టీఎస్ బిపాస్

వికీపీడియా నుండి
(టీఎస్ బిపాస్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టీఎస్ బిపాస్‌
తెలంగాణ ప్రభుత్వం రాజముద్ర
తేదీ2019
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
పాలుపంచుకున్నవారుతెలంగాణ ప్రజలు
వెబ్‌సైటుటీఎస్ బిపాస్‌ అధికారిక వెబ్ సైట్

టీఎస్ బిపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మీషన్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్/తెలంగాణ రాష్ట్ర నూతన భవన అనుమతి విధానం)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. తెలంగాణ ప్రజలకి అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులను, లేఅవుట్లు అనుమతులు ఇవ్వడంకోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది.[1] భూ యజమానులకు, ప్రాపర్టీ బిల్డర్లకు భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి ఈ విధానం ఉపయోగపడుతోంది.

ఈ విధానం ద్వారా 600 చదరపు గజాలలోపు ఉండే ఇళ్ళ నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తోంది. 600 చదరపు గజాల కంటే ఎక్కువ ఉన్న నివాస, నివాసేతర భవనాలకు 21 రోజుల్లో సింగిల్ విండో అనుమతి అందజేయబడుతోంది.[2]

మంత్రివర్గ ఆమోదం[మార్చు]

పౌరుల చట్టాలకు లోబడి ఉండటానికి, అధికారులలో జవాబుదారీతనం పెంచడానికి, అవినీతి పద్ధతులను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మునిసిపాలిటీ చట్టం “తెలంగాణ మునిసిపాలిటీ చట్టం 2019”ను అమలు చేసింది. ఆ మున్సిపాలిటీల చట్టానికి అనుగుణంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్స్‌ అనుమతులు, పట్టణ ప్రణాళిక విషయాల అమలు కోసం భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్ బిపాస్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 15న తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టింది. 'టీఎస్ ఐపాస్ లాగానే టీఎస్ బిపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ' అని అభిప్రాయపడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ విధానాన్ని ఆమోదించింది.[3][4]

ప్రారంభం[మార్చు]

2020, నవంబరు 16న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ టీఎస్ బిపాస్ వెబ్సైటును ప్రారంభించాడు.[2]

అనుమతుల వివరాలు[మార్చు]

ఈ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సివుంటుంది. 600 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే సంబంధిత శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలను తెప్పించుకుని పరీశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తుంది.[5] ఇందుకోసం ఇళ్ళను ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌, ఇన్‌స్టంట్‌ అనుమతులు, సింగిల్‌ విండో అప్రూవల్స్‌ అనే మూడు క్యాటగిరీలుగా విభజించి అనుమతులు మంజూరు చేస్తున్నారు.[6]

అనుమతులు[మార్చు]

2022 మార్చి 19 నాటికి[6]

 • ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు: 96,584
 • అనుమతులు మంజూరైనవి: 64,553
 • డీమ్డ్‌ అప్రూవల్‌గా అనుమతి పొందినవి: 1,996
 • తిరస్కరించిన దరఖాస్తులు: 12,213

2023 మార్చి 18 నాటికి[1]

 • ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు: 1,76,000
 • అనుమతులు మంజూరైనవి: 1,26,000
 • తిరస్కరించిన దరఖాస్తులు: 20,286

ఇతర వివరాలు[మార్చు]

 1. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయడమే కాకుండా క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటారు.
 2. తప్పుడు పత్రాలు సమర్పించి ఆమోదం పొందినట్లుగా గుర్తిస్తే ఆ అనుమతుల్ని రద్దు చేసి, దరఖాస్తుదారుడు చెల్లించిన నగదును వెనక్కి ఇస్తారు.

నిర్మాణాలు[మార్చు]

ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి అత్యధిక నిర్మాణాలతో జీహెచ్‌ఎంసీ మొదటి స్థానంలో ఉండగా, వరంగల్‌ కార్పొరేషన్‌ రెండవ స్థానంలో ఉంది. టాప్‌-10లో జీహెచ్‌ఎంసీతోపాటు నగర శివారులోని బడంగ్‌పేట, తుర్కయాంజల్‌, బోడుప్పల్‌, నాగారం, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలు ముందున్నాయి. ఐటీ, ఇతర పరిశ్రమల ఉండటం, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల చాలామంది నగర శివారు ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గుచూపుతుండడంతో ఇక్కడ నిర్మాణాలు పెరుగుతున్నాయి.[1]

సోషల్‌ మీడియా[మార్చు]

ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నందున దరఖాస్తుదారులు, ఇండ్లు నిర్మించుకొనే వారికి ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్‌ శాఖ సామాజిక మాధ్యమాల్లో, ఫోన్‌ నంబర్‌, టోల్‌ ఫ్రీ నంబర్‌, ఈమెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు.[7]

 • మెయిల్‌ ఐడీ: ts-bpass-support@telangana.gov.in
 • టోల్‌ ఫ్రీ నంబర్‌: 18005992266
 • ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌: 040-22666666
 • వాట్సాప్‌ నంబర్‌: 9392215407

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 telugu, NT News (2023-03-19). "Hyderabad | శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాల జోరు.. హైదరాబాద్‌ చుట్టూ భారీగా పెరిగిన నిర్మాణాలు". www.ntnews.com. Archived from the original on 2023-03-19. Retrieved 2023-03-19.
 2. 2.0 2.1 The Hansindia, Hyderabad (16 November 2020). "KTR launches TS-bPASS website for building, layout permissions" (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 16 November 2020. Retrieved 28 December 2021.
 3. The News Minute, Hyderabad (15 September 2020). "Telangana Assembly passes TS-bPASS Bill allowing self-certification of buildings". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 20 September 2020. Retrieved 28 December 2021.
 4. TV9 Telugu, తెలంగాణ (6 August 2020). "తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!". TV9 Telugu. Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 5. Zee News Telugu, Telangana (14 January 2021). "TS-bPASS in Telangana: త్వరలో టీఎస్‌-బీపాస్‌ మరిన్ని సేవలు.. సర్కార్ కీలక అడుగులు". Zee News Telugu. Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
 6. 6.0 6.1 telugu, NT News (2022-03-20). "టీఎస్‌బీపాస్‌ అనుమతులు 64,553". Namasthe Telangana. Retrieved 2022-03-20.
 7. telugu, NT News (2023-05-13). "TS BPASS | మరింత చేరువగా టీఎస్‌బీపాస్‌.. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులోకి". www.ntnews.com. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-15.

బయటి లింకులు[మార్చు]