డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని సైనిక క్షిపణి పరిశోధన కేంద్రం.[1]

చరిత్ర[మార్చు]

1970లలో యాంటీ ట్యాంక్ మిస్సైల్ టెస్టింగ్ కోసం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) సుమారు 2100 ఎకరాల భూమిని సేకరించింది. అప్పటి డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం, ఆర్‌సిఐ ఏర్పాటుకు భూమి ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించాడు. 1985 ఆగస్టు 5న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేతులమీదుగా దీనిని శంకుస్థాపన జరిగింది. 1988 ఆగస్టు 27న భారత మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ఈ ప్రయోగశాలను ప్రారంభించాడు. 2015 అక్టోబరు 15న భారతదేశ రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్‌లోని డిఆర్డీవో మిస్సైల్ కాంప్లెక్స్ పేరును, డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌గా మార్చాడు.[2][3][4]

ప్రయోగశాలలు[మార్చు]

కాంప్లెక్స్‌లో మూడు ప్రయోగశాలలు ఉన్నాయి:[5]

  • అధునాతన సిస్టమ్స్ లాబొరేటరీ (ఏఎస్ఎల్): వాహనాలు, క్షిపణుల కోసం మోటార్లు, జెట్ వ్యాన్‌లు, నిర్మాణాలపై పరిశోధన చేయడంతోపాటు వాటి అభివృద్ధికి సహకరిస్తోంది. ప్రధానంగా అగ్ని క్షిపణులకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది.
  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డిఆర్డిఎల్): ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐజిఎండిపి)కి అందించిన సేవలకు ప్రసిద్ధి చెందింది.
  • రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ): డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం స్థాపించిన క్షిపణి ఏవియానిక్స్ లేబొరేటరీ.

ఇతర వివరాలు[మార్చు]

2021 జనవరి 25న ఇంటిగ్రేటెడ్ వెపన్ సిస్టమ్ డిజైన్ సెంటర్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ చైర్మన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ జి. సతీష్ రెడ్డి, మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఎం.ఎస్.ఆర్. తదితరులు పాల్గొన్నారు.[6]

మూలాలు[మార్చు]

  1. "Parrikar wants private players to tap DRDO's knowledge". The Hindu. 2017-01-17. Retrieved 2022-08-31.
  2. "Missile Complex in Hyderabad Renamed After Former President Abdul Kalam". Ndtv.com. Retrieved 2022-08-31.
  3. "Missile Complex in Hyderabad renamed after Kalam". Indiatoday.intoday.in. 2015-10-15. Retrieved 2022-08-31.
  4. Andhra Pradesh. "City Missile Complex bags numerous DRDO awards - ANDHRA PRADESH". The Hindu. Retrieved 2022-08-31.
  5. "Missile Complex in Hyderabad renamed after APJ Abdul Kalam". The Economic Times. 2015-10-15. Retrieved 2022-08-31.
  6. "New centre at Kalam missile complex". The Hindu. Special Correspondent. 2021-01-25. ISSN 0971-751X. Archived from the original on 2022-05-06. Retrieved 2022-08-31.{{cite news}}: CS1 maint: others (link)