దేవిరెడ్డి రామకోటేశ్వరరావు
దేవిరెడ్డి రామకోటేశ్వరరావు | |
---|---|
జననం | 1954, డిసెంబరు 10 పురుషోత్తమపట్నం చిలకలూరిపేట మండలం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, న్యాయ నిర్ణేత |
భార్య / భర్త | విజయకుమారి |
తండ్రి | నరసింహారావు |
తల్లి | తులసమ్మ |
దేవిరెడ్డి రామకోటేశ్వరరావు, తెలుగు నాటకరంగ నటుడు, దర్శకుడు, నాటక సంస్థ నిర్వాహకుడు, న్యాయ నిర్ణేత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]రామకోటేశ్వరరావు 1954, డిసెంబరు 10న నరసింహారావు, తులసమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మండలంలోని పురుషోత్తమపట్నంలో జన్మించాడు. చిలుకలూరుపేటలోని హయ్యర్ సెకండరీ పాఠశాల నుండి స్కూల్ విద్యను, సిఆర్ కళాశాల నుండి బికామ్ కామర్స్ కోర్సును పూర్తిచేశాడు. ఆ తరువాత బి.ఎ. డిగ్రీ చేశాడు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డి.టి.ఎ. (డిప్లమో) పట్టభద్రుడయ్యాడు.[2]
ఉద్యోగం
[మార్చు]1978 నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామకోటేశ్వరరావుకి విజయ కుమారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, నరేంద్ర).
నాటకరంగం
[మార్చు]రామకోటేశ్వరరావు 1965లో నాటకరంగానికి ఆకర్షితుడై "పల్లె పడుచు" నాటకంలో గోపి పాత్రను పోషించాడు. ఆ తరువాత చివరకు మిగిలేది, పంజా, దారి తప్పిన ఆకలి, మనుషులోస్తున్నారు జాగ్రత్త, వందనోటే, నవ్వండి ఇది విషాదం, పూజకు వెలయెరా, జరుగుతున్న చేరిత్ర, తర్జని, ఆట వంటి పలు నాటకాలలో నటించాడు. చివరకు మిగిలేది, మనుషులోస్తున్నారు జాగ్రత్త, వందనోటు, గాంధీ పుట్టిన దేశం, వరుడు కావాలి, నవ్వండి..! ఇది విషాదం, పూజకు వేళాయరా మొదలైన నాటకాలకు దర్శకత్వం కూడా వహించాడు.
రామకోటేశ్వరరావు 1970 నుండి నాటిక పోటీలకు స్క్రూటినీ జడ్జీగా, నాటకోత్సవాల సమన్వయకర్తగా నంది నాటక పరిషత్తు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు వంటి సుమారు 100 పరిషత్తులకు సేవలు అందించాడు. తెలుగు నాటకరంగానికి చేసిన ఉత్తమ సేవలకుగాను 2018లో నిజామాబాద్ మురళీకృష్ణ కళా నిలయం సంస్థచే "నాటక మిత్ర" అనే బిరుదు కూడా పొందాడు.[2]
నాటకరంగ సేవలు
[మార్చు]- 2014 నంది నాటకోత్సవాలుకు గుణనిర్ణేతగా ఉన్నాడు.
- 2013 నుంచి 2020 వరకు పరుచూరి రఘుబాబు నాటక పోటీలకు ప్రాథమిక పరిశీలకునిగానూ, 2017, 2019, 2021 అజో-విభొ- కందాళం పౌండేషన్ వారి నాటిక పోటీలకు ప్రాథమిక పరిశీలకునిగా వ్యవహరించాడు.
- 2017లో ఆకాశవాణి, విజయవాడ వారి పోటీలకు గుణ నిర్ణేతగా ఉన్నాడు
- చిలకలూరిపేట ఫిలిం సొసైటీని స్థాపించి, 1975 నుంచి 1978 వరకు కార్యదర్శిగా పనిచేశాడు.
- శ్రీకళానికేతన్ (హైదరాబాద్) నిర్వాహక కార్యదర్శి
- రసరంజని (హైదరాబాద్) ఉపాధ్యక్షుడు
పురస్కారాలు
[మార్చు]- 2020లో అజో-విభొ- కందాళం ఫౌండేషన్ " రంగస్థల సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారం
- 2022లో కీ.శే. ఆర్. రామారావు స్మారక..."రంగస్థలి ప్రతిభా పురస్కారం" రంగస్థలి, నరసరావుపేట
- 2023 జనవరిలో భోగాపురం పరిషత్తు "అడపా మాణిక్యం, అచ్చయమ్మల స్మారక జీవితకాల సాధన పురస్కారం"
- 2023 ఏప్రిల్ లో కళారంజని నాటక అకాడమీ, భీమవరం "విశ్వ నట చక్రవర్తి యస్.వి.రంగారావు పురస్కారం"
- 2023 జులైలో రసరంజని "గరిమెళ్ల రామమూర్తి రంగస్థల పురస్కారం"
మూలాలు
[మార్చు]- ↑ రంగస్థలాలతో నాటక రంగానికి భవిష్యత్తు, ఈనాడు, గుంటూరు, 2020 ఫిబ్రవరి 4.
- ↑ 2.0 2.1 India, The Hans (2019-07-07). "Telugu theatre is in clutches of parishads". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-19. Retrieved 2022-04-19.