Jump to content

తండ్రీ కొడుకుల ఛాలెంజ్

వికీపీడియా నుండి
తండ్రీ కొడుకుల ఛాలెంజ్
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
రాధ ,
సుమలత
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీనికేతన్ ఆర్ట్స్
భాష తెలుగు

తండ్రీ కొడుకుల ఛాలెంజ్ 1987 జనవరి 14 నవిడుదలైన సినిమా. కృష్ణ, రాధ, సుమలత, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాదు..[1] ఎం. మల్లికార్జున రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ పద్మాలయ పిక్చర్స్ కోసం ఎంవి రామారావు, ఎ. రామ్‌దాస్ నిర్మించారు.

సంక్రాంతి పండుగకు మజ్ను, భార్గవ రాముడు, పున్నమి చంద్రుడు వంటి ఇతర సినిమాల నుండి పోటీని ఎదుర్కొన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ [2] అయింది.. ఇది తమిళ చిత్రం నీదిక్కుప్పిన్ పాసంకు రీమేక్.

అడ్వకేటు రాజా ఎస్.పి. చక్రధరరావు, డా. సరస్వతీదేవిల కుమారుడు. అతడు వీరాస్వామి గూండాల బారిన పడిన శంకరయ్యను రక్షిస్తాడు. అతడిపై వీరాస్వామి పెట్టిన దొంగ కేసుకు వ్యతిరేకంగా, తన అన్న రాము పైననే వాదించి గెలుస్తాడు. తరువాత శంకరయ్య కుమార్తె గౌరిని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలని కూడా భావిస్తాడు. కానీ అతడి తల్లికి కళ్యాణిని కోడలుగా చేసుకోవాలని ఉన్నందున ఆమె గౌరీని తప్పుకోమని బెదిరిస్తుంది. గౌరీ కజిన్, మాజీ సైనిక అధికారీ అయిన నరహరి ఆమెపై తీరని కామంతో ఉన్నాడు. రాజాతో ఆమెకు ఉన్న సంబంధం తెలిసి కోపంగా ఉన్నాడు. వీరాస్వామి సహాయంతో అతడు శంకరయ్యను హత్య చేసి, ఆ నేరం సరస్వతి దేవిపై వేస్తాడు. అతనిని రక్షించడానికి ప్రయత్నిస్తూ తన భార్య శంకరయ్య శరీరం నుండి హత్య ఆయుధాన్ని బయటకు లాగివేస్తూండగా చూసిన చక్రధరావు ఆమె ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుని అరెస్టు చేస్తాడు.

రాజా ఇప్పుడు తన తల్లి అమాయకత్వాన్ని నిరూపించుకోవటానికి రంగం లోకి దిగుతాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తన సొంత సోదరుడు రాముతో మళ్ళీ ముఖాముఖి ఎదుర్కొంటాడు. అంధుడిగా మారువేషంలో ఉన్న సిబిఐ అధికారి సహాయంతో అతను నిజమైన నేరస్థులను - నరహరి, వీర స్వామిలను - పట్టుకోవడమే కాకుండా, స్థానిక బాంబుల అక్రమ తయారీకి ఈ ఇద్దరే కారణమని నిరూపించడంలో తన తండ్రికి సహాయం చేస్తాడు. అతను తన కుటుంబాన్ని తిరిగి కలిపి గౌరీని తల్లి సమ్మతితో పెళ్ళి చేసుకుంటాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. అప్పా అమ్మా -
  2. యెక్కు యెక్కు -
  3. ఓయ్ లబాఖ్ -
  4. ఊహలా బంతి -
  5. మాఘమాస మొచ్చినా -
  6. అత్తినం -

మూలాలు

[మార్చు]
  1. "Thandri Kodukula Challenge 1987 film".
  2. "Sankranti Superheroes of Tollywood".