Jump to content

మజ్ను

వికీపీడియా నుండి
మజ్ను
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం దాసరి పద్మ
రచన దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగార్జున ,
రజని,
కె.ఆర్.విజయ
సంగీతం లక్ష్మీకాంత్-ప్యారేలాల్
ఛాయాగ్రహణం పి, శరత్ బాబు
కూర్పు బి. కృష్ణంరాజు
భాష తెలుగు

మజ్ను 1987 లో వచ్చిన శృంగార విషాద చిత్రం. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు ఇందులో అక్కినేని నాగార్జున, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1987 జనవరి 14 న శోభన్ బాబు పున్నమి చంద్రుడు, బాలకృష్ణ భార్గవ రాముడు, కృష్ణ తాండ్రి కొడుకుల ఛాలెంజ్ లతో పాటు విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది.[1] చిత్రం తమిళలో ఆనంద్ పేరుతో పునర్నిర్మించారు.

రాజేష్ ( నాగార్జున ) అలేఖ్య ( రజని ) తో ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నప్పుడు అంతా బానే ఉంటుంది. ఒక స్నేహితుడి వలన రాజేష్ మనస్సులో,అలేఖ్య ప్రవర్తన పట్ల అనుమాన బీజం నాటుకుంటుంది. రాజేష్ దాని గురించి అడిగినప్పుడు, అమెకు కోపం వస్తుంది. స్నేహితుడి మాటను నమ్మి తనను ఎలా అనుమానించడమేంటని ఆమె అడుగుతుంది. అతన్ని ప్రేమించడం సరైనది కాదని ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది. దుడుకు స్వభావం గల రాజేష్ కూడా ఆమె పద్ధతి అహంకార యుతంగా ఉందని భావిస్తాడు. ఈ జంట విడిపోతుంది. అలేఖ్య అతనిని విడిచిపెట్టిన తరువాత రాజేష్‌కు నిజమైన ఇబ్బంది మొదలవుతుంది. తన దుడుకు ప్రవృత్తి పట్ల పశ్చాత్తాపం కలుగుతుంది.

అక్కడ రాజేష్ అలేఖ్య గురించి ఆందోళన చెందుతాడు. నిరాశలో పడతాడు. రాజేష్ తల్లి అలేఖ్య ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ తన తల్లిదండ్రులు చూపించిన కపిల్ దేవ్ (సుధాకర్) ను పెళ్ళి చేసుకోవాలని అలేఖ్య ఓ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నట్లు ఆమెకు తెలుస్తుంది. రాజేష్ తల్లి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. రాజేష్ మానసిక ఆరోగ్యం పట్ల ఆందోళనతో, అలేఖ్య అతన్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అబద్ధం చెప్పి అతడికి సంతోషం కలిగిస్తుంది. అతడు అన్నం తిన్నాక ఆమె, అలేఖ్య ఇంట్లో జరిగిన వాస్తవాన్ని, కపిల్ దేవ్‌ను వివాహం చేసుకోవాలనే ఆమె నిర్ణయం గురించీ చెబుతుంది. అంతా విని రాజేష్ కలవరపడతాడు. అతని తల్లి అతనిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో, రాజేష్ దగ్గరలో ఉన్న ఒక సింక్ వద్దకు వెళ్లి, బలవంతంగా వాంతి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. క్షణాల్లో అతను తిన్నదంతా వాంతి చేసుకుంటాడు. ఆలేఖ్య లేకుండా తాను సంతోషంగా.జీవించలేనని చెబుతాడు.

రాజేష్, ఆలేఖ్య కలుస్తారా అనేది మిగతా కథ.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు. దాసరి నారాయణరావు పాటలు వ్రాసాడు. లాహరి ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది..[2]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నేనే నేనే హీరో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 6:15
2. "కదలకు కన్ను కన్ను కలుపు"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 5:15
3. "ఇది తొలి రాత్రి"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 6:34
4. "పొరబడితివో త్వరబడితివో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 5:54
5. "ఐ లవ్ యూ"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 6:36
6. "గాలిదెబ్బ తట్టుకోనా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 5:47
36:21

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-18. Retrieved 2020-08-20.
  2. "Majnu". JioSaavn. Archived from the original on 26 జనవరి 2021. Retrieved 9 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్ను&oldid=4236652" నుండి వెలికితీశారు