తక్కెడశిల జాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాని తక్కెడశిల (ఆంగ్లం: Johny Takkedasila) (08.06.1991) వై.ఎస్.ఆర్ జిల్లా పులివెందులలో జన్మించారు. తెలుగు, హిందీ, ఆంగ్లంలో సాహిత్యాన్ని రాయగల బహుభాషా సాహిత్యవేత్త. కవిత్వం, కథ, నవల, విమర్శ, అనువాదం విభాగాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. వీరు రచించిన వివేచని సాహిత్య విమర్శ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది[1].

విద్యార్హతలు      [మార్చు]

తొలి చదువు:

  • ఒకటి నుండి తొమ్మిదో తరగతి వరకు నాగార్జున హైస్కూల్, పులివెందుల, వై.ఎస్.ఆర్ జిల్లా.
  • పదవ తరగతి : ఎస్.బి మెమోరియల్ హైస్కూల్, ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్ జిల్లా.
  • డిప్లమా: E.C.E (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ (Y.S.S.R), పులివెందుల.

మలి చదువు:

  • బి.టెక్: E.C.E  అమీనా ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్.
  • ఎం.టెక్: E.C.E  శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కడప.
  • హిందీ ప్రవీణ: దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మద్రాస్.

ఇతర:

  • P.G.D.C.A: టాప్ లైన్ ఇన్స్టిట్యూట్, పులివెందుల.
  • ఇంటర్మీడియట్: APOSS నుండి ఇంటర్మీడియట్ లో బై.పి.సి పూర్తి అయ్యింది.
  • టెక్నికల్ కోర్సులు: C, Oops, C#, Dotnet, SQL server, Oracle, Hardware & Networking, JAVA, JQUERY, HTML, Visual Basic, Amplitude, MS. Office, M.s dos

బోధనానుభవం:[మార్చు]

మూడేళ్ళ పాటు పులివెందులలోని టాప్ లైన్ ఇన్స్టిట్యూట్ లో C, C++, Oracle, Hardware and Networking లాంటి కోర్సులను రెండు వేలకు పైగా విద్యార్తులకు భోదించారు.

ఉద్యోగం:[మార్చు]

  • మొదట సాఫ్ట్వేర్ గా పని చేశారు.
  • 2016 నవంబర్-9 నుండి ఇప్పటిదాక ప్రతిలిపి తెలుగు విభాగాధిపతిగా సేవలు అందిస్తున్నారు.

ముద్రితమైన పుస్తకాలు:  [మార్చు]

కవిత్వం

1.     అఖిలాశ

2.    విప్లవ సూర్యుడు

3.    నక్షత్ర జల్లుల్లు (కొత్త సాహిత్య ప్రక్రియ)

4.    బురద నవ్వింది

5.    మట్టినైపోతాను (యాత్ర కవిత్వ సంపుటి)

6.    గాయాల నుండి పద్యాల దాక

7.    పరక

దీర్ఘకావ్యాలు:

  1. ‘వై’ (తెలుగు సాహిత్యంలో హిజ్రాలపై రాసిన రెండవ దీర్ఘకావ్యం)
  2. ఊరి మధ్యలో బొడ్రాయి (మర్మాంగంపై రాసిన తొలి తెలుగు దీర్ఘకావ్యం)

కథా సంపుటాలు:

  1. షురూ (రాయలసీమ మాండలిక ముస్లిం మైనార్టీ కథలు)
  2. కట్టెల పొయ్యి కథా సంపుటి.

నవలలు:

  1. మది దాటని మాట (‘గే’ కమ్యూనిటీపై తొలి తెలుగు నవల)
  2. రంకు (అక్రమ సంబంధాలపై ముస్లిం మైనార్టీ తెలుగు నవల)
  3. దేవుడి భార్య (దేవదాసి వ్యవస్థపై రాసిన నవల) (పుస్తకంగా రాలేదు)
  4. జడకోపు (చెక్కభజన కళాకారుడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని రాసిన నవల)
  5. చాకిరేవు (రజక కులస్తుల జీవితాల మీద రాసిన నవల)

సాహిత్య విమర్శ:

  1. వివేచని (యాభై వ్యాసాల విమర్శ సంపుటి)
  2. అకాడమీ ఆణిముత్యాలు (కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన పుస్తకాలపై వ్యాసాలు)
  3. కవిత్వ స్వరం (ఆధునిక తెలుగు కవిత్వంపై విమర్శ వ్యాసాలు)
  4. శివారెడ్డి కవిత్వం ఒక పరిశీలన

హిందీ:

  1. జిందగీ కె హీరే (నానోలు హిందీలో) నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం.

అనువాదం:

  1. 22 మంది రచయితల బాలసాహిత్య తెలుగు కథలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. Ukiyoto అనే ప్రపంచ ప్రఖ్యాత పుస్తక ప్రచురణ సంస్థ ‘Tiny Treasures’ పేరుతో ముద్రించింది. పుస్తకం యాభై దేశాల్లో లభిస్తుంది.

సంపాదకత్వం:

  1. మాతృస్పర్శ (160 మంది కవులు అమ్మపై రాసిన కవితలు)
  2. తడి లేని గూడు (కథా సంపుటం)

బాలసాహిత్యం :

  1. పాపోడు (రాయలసీమ కడప మాండలిక బాలసాహిత్య కథలు, కథలన్నీ పిల్లల సమస్యలపై మాత్రమే రాసినవి)
  2. బాలసాహిత్యంలోకి (బాలసాహిత్య విమర్శ వ్యాసాలు)
  3. బాలల హక్కులు (బాలల హక్కులపై తొలి తెలుగు బాలసాహిత్య నవల)

పురస్కారాలు :[మార్చు]

  1. సత్రయాగం సాహిత్య వేదిక నుండి ‘కవిమిత్ర’ పురస్కారం.
  2. బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం.
  3. చెన్నైకి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి ‘తెలుగు-వెలుగు’ పురస్కారం.
  4. ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం.
  5. కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం.
  6. “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019.
  7. ‘వివేచని’ సాహిత్య విమర్శ సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం.

కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలను 2023 జూన్ 23వ తేదీన ప్రకటించింది[2]. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన సమావేశంలో వివరాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన యువ పురస్కారాలకు 20 మందిని ఎంపిక చేశారు[3]. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాల ద్వారా రచయితకు రూపాయలు యాభై వేలు చొప్పున నగదు, నగదు, తామ్ర పత్రం జ్ఞాపిక అందజేస్తారు. తెలుగుకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తక్కెడశిల జాని రచించిన విమర్శనా గ్రంథం వివేచని దక్కించుకుంది[4]. తక్కెడశిల జాని వైయస్సార్ జిల్లా పులివెందులలో 1991 సంవత్సరం జూన్ 8వ తేదీన జన్మించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన జానీ పలు దీర్ఘ కావ్యాలు, కథ సంపుటాలు, నవలలు, సాహిత్య విమర్శ గ్రంధాలు వెలువరించారు.

మూలాలు :

  1. "తక్కెడశిల జానికి యువ పురస్కారం". EENADU. Retrieved 2023-09-01.
  2. "Nikhat Zareen", Wikipedia (in ఇంగ్లీష్), 2023-08-28, retrieved 2023-09-01
  3. ABN (2023-06-24). "జాని తక్కెడశిల, చదువులబాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-01.
  4. "ఇద్దరికి సాహిత్య అకాడమీ పురస్కారాలు". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-01.