తషు కౌశిక్
తషు కౌశిక్ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
తషు కౌశిక్, భారతీయ సినిమా నటి, మోడల్. స్టేజ్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన తషు కౌశిక్, రామ్ గోపాల్ వర్మ దర్వాజా బంద్ రఖో సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]
తొలి జీవితం
[మార్చు]తషు కౌశిక్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూరులో వ్యాపారవేత్త రాకేశ్ గౌడ్ కు జన్మించింది. ఆమె చిన్నతనంలోనే ఆమె కుటుంబం ముంబై నగరానికి వెళ్ళింది. అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించిన తషు, జూమ్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది.[2]
సినిమారంగం
[మార్చు]తషు కౌశిక్ తెలుగబ్బాయి సినిమాలో తనీష్ సరసన, రాజ్ కందుకూరి దర్శకత్వంలో దూల శీను సినిమాలో శ్రీ సరసన, మైక్ టెస్టింగ్ 143 అనే సినిమాలో తారక రత్న సరసన నటించింది.[3] రాజేష్ నాయర్ రూపొందించిన అన్నం ఇన్నమ్ ఎన్నమ్ చిత్రంతో ఆమె మలయాళ సినిమారంగంలోకి ప్రవేశించింది.[4] 2013లో కూల్ గణేశలో కన్నడ సినిమాలో నటించింది.[5] పజయ వన్నార పెట్టై సినిమా ద్వారా తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది.[6] ముంబైలోని వెర్సోవాలో ఆమె తన సొంత రెస్టారెంట్ నడుపుతున్న సమయంలో తషుకు మొదటి తెలుగు సినిమా అవకాశం వచ్చింది.[6]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2006 | దర్వాజా బంద్ రఖో | షీబా కె. షా | హిందీ | |
2010 | రాజు మహారాజు | బిందు | తెలుగు | |
2011 | దుశ్శాసన | తెలుగు | ||
2011 | వైకుంఠపాలి | స్నిగ్ధ | తెలుగు | |
2011 | గ్రాడ్యుయేట్ | మనీషా | తెలుగు | |
2013 | అన్నం ఇన్నమ్ ఎన్నమ్ | రియా | మలయాళం | |
2013 | తెలుగబ్బాయి | మేఘ | తెలుగు | |
2013 | గోల సీను | సంధ్య | తెలుగు | |
2013 | కూల్ గణేశ | కన్నడ | ||
2013 | ఎస్కేప్ ఫ్రమ్ ఉగాండ | ఏంజెల్ మాథ్యూస్ | మలయాళం | |
2013 | పజయ వన్నార పెట్టై | తమిళం | ||
2013 | రిపోర్టర్ | మాయ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ Zachariah, Ammu (1 May 2012). "Tashu Kaushik to debut in Mollywood". Times of India.
- ↑ "Tashu Koushik". chithr.com. 11 May 2009. Archived from the original on 16 మే 2009. Retrieved 15 మార్చి 2021.
- ↑ "Tashu Kaushik's all new avatar". Times of India. 9 August 2012. Archived from the original on 2013-12-19. Retrieved 2021-03-15.
- ↑ "Tashu Kaushik in M'town". Deccan Chronicle. 19 May 2012. Archived from the original on 20 మే 2012. Retrieved 15 మార్చి 2021.
- ↑ "I want to do realistic roles: Tashu". Times of India. 13 September 2012. Archived from the original on 2012-10-24. Retrieved 2021-03-15.
- ↑ 6.0 6.1 "I want to direct a film: Tashu Kaushik". Times of India. 8 April 2012. Archived from the original on 2013-05-08. Retrieved 2021-03-15. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "articles.timesofindia.indiatimes" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తషు కౌశిక్ పేజీ