Jump to content

తెన్నేటి విద్వాన్

వికీపీడియా నుండి
(తెన్నేటి వెంకట సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)
తెన్నేటి విద్వాన్
తెన్నేటి వెంకట సుబ్బారావు చిత్రం
జననం
తెన్నేటి వెంకట సుబ్బారావు

1924 నవంబర్ 11
మరణంజూలై 3 2015
వరంగల్లు
మరణ కారణంఅనారోగ్యం
విద్యబి.ఎ.,ఎం.ఎ.,బి.యిడి,సంస్కృత కోవిద, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ వొకేషనల్ గైడెన్స్
ఉద్యోగంవరంగల్ లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యాపకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత,సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు
పిల్లలుముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు
వెబ్‌సైటుhttp://vidwantenneti.net/about

తెన్నేటి విద్వాన్ అని పిలువబడే ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడైన అయిన ప్రముఖ వ్యక్తి అసలు పేరు "తెన్నేటి వెంకట సుబ్బారావు". ఈయన అనేక రచనలు చేసారు.[1] ఆయన రచయితగా సుమారు 30 పుస్తకాలను వివిధ భాషలలో రచించారు.[2] ఆయన తెలుగు, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, సంస్కృతం, కన్నడ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.

జీవిత విశేషాలు

[మార్చు]

సుబ్బారావుగా పేరొందిన ఆయన 1924 నవంబరు11న కృష్ణా జిల్లాలో జన్మించారు. తర్వాత వరంగల్‌కు వలస వచ్చారు.

వృత్తి

[మార్చు]

ఆయన 40 సంవత్సరముల పాటు విద్యారంగానికి ఎనలేని సేవచేసారు. ఆయన వరంగల్ లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసారు. ఆయన ప్రవృత్తి పరంగా రచయిత, విద్యావేత్త.

విద్య

[మార్చు]

ఆయన 1942 లో బి.ఎ చదువున్నప్పుడు ఆ విద్యను మధ్యలో వదలి "క్విట్ ఇండియా ఉద్యమం"లో పాల్గొన్నారు. తరువాత స్వయం అధ్యయనం చేసి 1954 లో బి.ఎ డిగ్రీని, 1964 లో ఎం.ఎ ని, 1967 లో బి.యి.డి చేసారు. ఆ తరువాత సంస్కృత కోవిద, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ ఒకేషనల్ గైడెన్స్ కోర్సులను కూడా పూర్తిచేసారు.

హోదాలు

[మార్చు]

ఆఅయన తన ప్రస్థానాన్ని ఉపాధ్యాయునిగా "మల్టీ పర్పస్ హై స్కూల్"లో ప్రారంభించారు. ఈ పాఠశాల ఆ కాలంలో తెలంగాణ ప్రాంతంలో అతి పెద్ద పాఠశాల. ఉపాద్యాయునిగా పనిచేసిన కాలంలో ఆయన ఉపాధ్యాయుల ఉద్యమంలో 1959 నుండి క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఆయన స్టేట్ టీచర్స్ యూనియన్ కు సెక్రటరీ పనిచేసారు. ఆయన 1961లో వరంగల్ లోని ఎంప్లాయిస్ కన్సూమర్ కో ఆపరెటివ్ సొసైటీని స్థాపించారు. బహు భాషా నిపుణునిగా ఆయన 1961 లో తెలంగాణ ప్రాంతంలో జనాభా గణన చేయుటకు ఈ ప్రాంతంలో గల భాషల గూర్చి భారత ప్రభుత్వం ఈయనను సంప్రదించింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గౌరవ సాహిత్య సంపాదకునిగా నియమింపబడ్డారు. ఆయన ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ కు సెక్రటరీగానూ, వరంగల్ జిల్లా ఆంధ్రప్రదేస్ టీచర్స్ కాన్ఫరెన్స్ రిసెప్షన్ కమిటీకి అధ్యక్షునిగా కూడా ఉన్నారు. ఆయన హనుమకొండలోని చైతన్య డిగ్రీ కళాశాలకు మొదటి ప్రధానాచార్యునిగా పనిచేసారు. హైదరాబాదులోని ఆంధ్రమహిళా సభ "వయోజనవిద్య-సాహిత్యం, బోధనాబ్యసన సామాగ్రి" అంశం పై నిర్వహిస్తున్న వర్క్ షాప్ నకు రీసోర్స్ పర్సన్ గా కూడా పనిచేసారు. వరంగల్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కు వ్యవస్థాపక అద్యక్షునిగా పనిచేసారు. ఈ అసోసియేషన్లో నాలుగు కేంద్రాలలో 200 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారారు.

లలిత కళలకు సేవ

[మార్చు]
  • వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రేక్షక సభ, వరంగల్లు, (ఆంధ్రప్రదేశ్ నాటక కమిటీ అనుబంధ సంస్థ)
  • వరంగల్ జిల్లా కళలకు కళాకారుల కొరకు 2 పుస్తకాల ప్రచురణ.
  • హనూంకొండ లోని సరస్వతీ సంగీత పాఠశాల వ్యవస్థాపక సెక్రటరీ.
  • 1940లలో విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో రేడియో కళాకారునిగా.
  • 1940లలో స్టేజ్ డైరక్టరుగా, వ్యాఖ్యాతగా నిర్వహించారు. తరువాత అనేక మంది విద్యార్థులను నాటకాలకు తయారుచేసారు.
  • రాష్ట్ర స్థాయిలో కళల కోసం సెమినార్స్, వర్క్ షాప్స్ నిర్వహించారు.
  • వివిధ కళలలో వందల సంఖ్యలో రంగస్థల ప్రదర్శనలిచ్చారు.
  • 1960 లో హిందీ మహా విద్యాలయకు ప్రిన్సిపాల్ గ కూదా ఉన్నారు 100 కి పైగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసారు.

సాహితీ సేవలు

[మార్చు]
  • అనేక కవి సమ్మేశనాలను నిర్వహించారు, పాల్గొన్నారు.
  • సమాజ విలువల పై అనేక పుస్తకాలను ప్రచురించారు. అనెక పుస్తకాలకు ముందుమాట వ్రాసారు.
  • "కళాలోకం" అనే పుస్తకం రెండు వాల్యూంలు రచించారు.
  • వరంగల్లు జిల్లా విజ్ఞానం కోసం "వరంగల్లు దర్శిని" అనే పుస్తకం నకు కో-ఆర్గనైజర్ గా పనిచేసారు.
  • విశాలాంద్ర బుక్ హౌస్ ద్వారా నిర్వహింపబడుచున్న రీడర్స్ క్లబ్ కు అధ్యక్షునిగా పనిచేసారు.

అవార్డులు

[మార్చు]
  • 2008 లో శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి "సంఘసేవ" విభాగంలో "కీర్తి పురస్కారం" పొందారు.
  • మార్చి 12 2012 న కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ద్వారా సన్మానం.

పుస్తకాలు

[మార్చు]

ఆయన రచనల్లో స్వర్ణ శకటం, ది లిటిల్ క్లే కార్ట్, మాయా చదరాలు, దగాకోరు శాస్ర్తాలు-మూఢ నమ్మకాలు, పావులూరి మల్ల గణితశాస్త్రం, లీలావతి గణితం-వ్యాఖ్యాన సహితం వంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అముద్రిత గ్రంథాలు సైతం అనేకం ఉన్నాయి. "ద లిటిల్ క్లే కార్ట్" - 2006 లో సంస్కృత నాటకాన్ని అనువాదం చేసారు. "మాథ్ వితవుట్ మాథమెటిక్స్" - నీల్ కమల్ పబ్లిషర్స్ ప్రచురించారు. "ఫాసినాటింగ్ స్క్వేవ్ నంబర్స్" - 2009 లో నీల్ కమల్ పబ్లిషర్స్ ప్రచురించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు.కూతుళ్లలో ఒకరు నవలా రచయిత్రి తెన్నేటి సుధారాణి, చిన్న కొడుకు విజయచంద్ర కేయూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.

మరణం

[మార్చు]

తెన్నేటి వేంకట సుబ్బారావు...జూలై 3 2015 ఉదయం 8.30 లకు. శివసాన్నిధ్యం చెందారు. రైమ్స్ చదివే పిల్లలనుండి మొదలుకొని, వివిధ రంగాలలో విద్వాంసులైన వారు అందరూ ఆయన హితులే...సాహిత్యానికి, కళారంగానికి వారు చేసిన సేవ వెల కట్టలేనిది. వివిధ రంగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సన్మానాలు అందుకొని, వరంగల్ కీర్తిని ఇనుమడింపజేశారు.1999 సంవత్సరంలోనే తన కళ్లను దానం చేయడంతో పాటు పార్థివ శరీరాన్ని కేఎంసీకి ఇస్తానని ఆనాడే ప్రకటించారు. అలాగే కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. సుబ్బారావు కోరిక మేరకు కళ్లను ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు అప్పగించి, మధ్యాహ్నం పార్థివదేహాన్ని కేఎంసీకి అందించారు.

మూలాలు

[మార్చు]
  1. "about tenneti venkata subbarao". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-04.
  2. "Books by vidwan tenneti". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వనరులు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]