Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2018)

వికీపీడియా నుండి
ప్రతిభా పురస్కారాలు (2018)
పురస్కార గ్రహీతలు
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2017
మొత్తం బహూకరణలు 12
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2017ప్రతిభా పురస్కారాలు (2018)2019

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే ప్రతిభా పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది.

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2018 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2] వీరికి 2021 డిసెంబరు 18న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కళాశాలల విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలను సత్కరించారు.[3]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 రామకవచం వెంకటేశ్వర్లు కవిత్వం
2 ఆచార్య వెలుదండ నిత్యానందరావు విమర్శ
3 డి. అనంతయ్య చిత్రకళ
4 ఆర్‌. గంగాధర్‌ శిల్పకళ
5 ఓలేటి రంగమణి నృత్యం
6 డాక్టర్‌ ఎస్‌.కె. వెంకటాచార్యులు సంగీతం
7 కల్లూరి భాస్కరం పత్రికారంగం
8 రావుల వెంకట్రాజం గౌడ్‌ నాటకం
9 కౌళ్ళ తలారి బాలయ్య జానపదము
10 డాక్టర్‌ మలుగ అంజయ్య అవధానం
11 ఎన్‌. అరుణ రచయిత్రి
12 పి. చంద్రశేఖర ఆజాద్‌ కథ/నవల

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి (2018-11-15). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 2018-11-15. Retrieved 2022-01-28.
  2. "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". Sakshi. 2021-12-08. Archived from the original on 2021-12-08. Retrieved 2023-01-28.
  3. "తెలుగు వర్సిటీలో '2018 ప్రతిభా పురస్కారాలు' ప్రదానం". EENADU. 2021-12-19. Archived from the original on 2023-01-28. Retrieved 2023-01-28.

ఇతర లంకెలు

[మార్చు]
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine