తెలుగు సినిమా పాటల రచయిత్రులు
తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణిక నాటకాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా తీయడంతో, రంగస్థలం మీద బాగా పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది. రంగస్థలంతో సంబంధమున్నకవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటకకవులుగా ఉన్న చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు. ఆ తరువాత ఎంతోమంది తెలుగు సినిమా పాటల రచయితలు పాటలు రాశారు.
సినిమాలకు పాటల రచన చేసే రచయిత్రుల సంఖ్య మనకు చాలా తక్కువ. 1932లో తెలుగు సినిమా పుడితే 1966 వరకూ ఒక్క మహిళా రచయిత్రి కూడా రాలేదు.[1] అయితే కొంతమంది రచయిత్రులు కూడా తెలుగు సినిమాలకు పాటలు రాశారు.[2]
పాటల రచయిత్రుల జాబితా
[మార్చు]- కె.జి. వసంతాదేవి - 'దారి కాచి వేచినానురా...రేయిబవలు చూచినానురా' (విజయశంఖం (1966)). లభించిన ఆధారాల ప్రకారం వసంతాదేవినే మన తొలి తెలుగు పాటల రచయిత్రని తెలుస్తుంది.[1][3][4]
- వీరమాచనేని సరోజిని - 'ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఊగాలి ఊగాలి' (చిన్నారి పాపలు - 1968) సుప్రసిద్ధ సినీనటి సావిత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీరమాచనేని సరోజిని నిర్మించారు. నిర్మాత, దర్శకులు, నటీనటులు, నేపథ్యగాయకులు, సాంకేతిక సిబ్బంది అంతా మహిళలే నిర్వహించడం ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమా గిన్నిస్ రికార్డ్స్ లోకి చేరింది. సరోజిని, సుప్రసిద్ధ దర్శకుడు వి. మధుసూదనరావు భార్య. మంచి గాయకురాలు.[5]
- కామ్రెడ్ విజయలక్ష్మీ - 'కులం కులమని కుచ్చితాలు పెంచుకోకు' విప్లవ శంఖం (1982)
- జ్యోతిర్మయి - 'చేతికి గాజుల్లా...' (రాధాకళ్యాణం (1981)). 'లేత చలిగాలులు దోచుకోరాదురా' (మూడు ముళ్ళు (1987))
- డా. సీతాదేవి - మా తెలుగుతల్లి (1988)
- రాణి పులోమజాదేవి - బుల్లెబ్బాయ్ (2007), ఐస్ క్రీం, జెంటిల్ మేన్[6]
- రమాదేవి - 'పోకిరి రాజా...' మాయ (సినిమా) (2014)[7]
- కిరణ్మయి - మిస్సింగ్ (2013)
- కొండముది అనురాధ - నాచూపు (పవన్ సుబ్బలక్ష్మీ ప్రేమించుకున్నారట)
- పి. సూర్యకుమారి -
- డా. చల్లా భాగ్యలక్ష్మి - ఒక్కడొచ్చాడు (2016),[8][9] అమరావతి అమ్మాయి (2017),[10] పెళ్లి రోజు (2017),[11]
- శ్రేష్ట - ఒక రొమాంటిక్ క్రైమ్ కథ (2013), 'ఓ మధురిమవై', 'బంగారు కొండ' (కో అంటే కోటి),[12] పెళ్లిచూపులు 2016, అర్జున్‌రెడ్డి (2017), యుద్ధం శరణం (2017)[13][14]
- చైతన్య పింగళి - 'ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు' (ఫిదా 2017)
- లక్ష్మీ ప్రియాంక [15][16]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆర్కైవ్. "స్త్రీమూర్తులకు శతకోటి వందనాలు". archive.is. Archived from the original on 27 జూలై 2013. Retrieved 30 September 2017.
- ↑ ఈమాట. "తెలుగు సినిమా పాట". eemaata.com. Retrieved 29 September 2017.
- ↑ ఘంటసాల గళామృతం. "విజయ శంఖం - 1966". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 29 September 2017.[permanent dead link]
- ↑ గూగుల్. "కె.జి. వసంతాదేవి". www.google.co.in. Retrieved 29 September 2017.
- ↑ ఘంటసాల గళామృతం. "చిన్నారి పాపలు - 1968". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 29 September 2017.[permanent dead link]
- ↑ "గేయ రచయిత్రి రాణి పులోమజాదేవి మృతి Updated: 30-Sep-2017". Archived from the original on 2015-09-24. Retrieved 2017-09-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ గోతెలుగు.కాం. "టాలీవుడ్‌లో లేడీ లిరిక్ రైటర్". www.gotelugu.com. Retrieved 30 September 2017.
- ↑ ఆంధ్రజ్యోతి. "ఒక్కడొచ్చాడు". Archived from the original on 25 డిసెంబరు 2016. Retrieved 30 September 2017.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ నవతెలంగాణ. "బర్త్‌డే గిఫ్ట్.. ఒక్కడొచ్చాడు". Retrieved 30 September 2017.
- ↑ తెలుగు నమస్తే ఆంధ్ర. "అచ్చమైన తెలుగింటి ప్రేమకథ `అమరావతి అమ్మాయి`". telugu.namasteandhra.com. Archived from the original on 10 సెప్టెంబరు 2017. Retrieved 30 September 2017.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ సాక్షి. "పెళ్లి కాని యువతుల కథ". Retrieved 30 September 2017.
- ↑ 123తెలుగు. "ఆడియో సమీక్ష : కో అంటే కోటి – ఫ్రెష్ ఫీల్ తో సాగే సరికొత్త ఆల్బమ్". www.123telugu.com. Retrieved 30 September 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ఈనాడు. "ఆమె పాటల వెనక... ఎన్ని పాట్లున్నాయో!". Archived from the original on 13 October 2017. Retrieved 30 September 2017.
- ↑ నమస్తే తెలంగాణ. "శ్రేష్టమైన పాటల పూదోట." Retrieved 30 September 2017.
- ↑ Sakshi (22 January 2019). "ఆ గాయంలోంచే గేయం పుట్టింది". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.