తోటపల్లి (గరుగుబిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోటపల్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం గరుగుబిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,877
 - పురుషులు 917
 - స్త్రీలు 960
 - గృహాల సంఖ్య 518
పిన్ కోడ్ 535 463
ఎస్.టి.డి కోడ్

తోటపల్లి, విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలానికి చెందిన గ్రామము.

పార్వతీపురానికి 13 కి.మీ. దూరంలో వున్న పల్లెటూరు తోటపల్లి. నాగావళిని, దాని పంట కాలువలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందిన పచ్చని పల్లె సీమ ఇది. పార్వతీపురము, సాలూరులను కలుపుతూ బ్రిటిష్ వారు నిర్మించిన వంతెనపైన వస్తు, వర్తకాలకు ఈ పల్లె ఆధారపడి ఉంది. ఇక్కడ ఉన్న వేంకటేశ్వరాలయము, రామాలయాలు ఈ జిల్లాలో బాగా ప్రసిద్ధి ఉన్నాయి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ పైననే ఈ పల్లె ప్రజల ఆదాయం ఎక్కువగా ఆధారపడి వుండేది. అయితే, నాగావళి పైనున్న వంతెన అవసాన దశకు చేరి మూతపడటము, తోటపల్లి బ్యారేజి వచ్చి ఈ పల్లె చుట్టు పక్కల నైసర్గిక స్వరూపము పూర్తిగా మారిపోవటం కారణంగా తోటపల్లి ప్రశస్తి తగ్గింది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,877 - పురుషుల సంఖ్య 917 - స్త్రీల సంఖ్య 960 - గృహాల సంఖ్య 518

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]