త్రివేణీ సంగమం
త్రివేణి సంగమం అనేది మూడు నదుల కలయిక (త్రి అనగా మూడు, వేణి అనగా నది). ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడి.
ప్రయాగ్ రాజ్
[మార్చు]గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం. ఇక్కడ గంగా నది నీరు స్పష్టంగా ఉంటుంది, యమునా నది ఆకుపచ్చ రంగులో, సరస్వతి నది అంతర్వాహిని గా ఉంటుంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు.[1] [2]
నాసిక్
[మార్చు]ఇది మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఉంది. ఇక్కడ అరుణ, వరుణ, గోదావరి నదులు కలుస్తాయి.
పశ్చిమ బెంగాల్
[మార్చు]పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని త్రిబేని పట్టణంలో, గంగా నది, భాగీరథి, హుగ్లీ కలుస్తాయి. వీటిని గంగా, జమున, సరస్వతి అని పిలుస్తారు.
గుజరాత్
[మార్చు]గుజరాత్ లోని త్రివేణి సంగమం, గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని సోమనాథ్, వెరావల్ సమీపంలో ఉంది. ఇక్కడ హిరాన్, కపిల, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ మూడు నదులు కలిసి పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రంలో కలుస్తాయి.[3]
కాళేశ్వరం
[మార్చు]ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది.[4]
కూడుతురై
[మార్చు]ఇది కూడుతురైలోని ఈరోడ్ ఉంది. ఇక్కడ కావేరీ, భవానీ, అముదా నదులు కలుస్తాయి.[5] దీనిని దక్షిణ త్రివేణి సంగమం అని అంటారు.
భాగమండల
[మార్చు]భాగమండల కర్నాటక లోని కొడగు జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ కావేరీ, కన్నికే, సుజ్యోతి అనే నదులు కలుస్తాయి.
తిరుమకూడలు నరసిపుర
[మార్చు]తిరుమకూడలు నరసిపుర లేదా టి. నరసిపుర కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ కావేరీ, కబిని, స్పటిక సరోవర నదులు కలుస్తాయి. ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాని నిర్వహిస్తారు.
మూవట్టుపూజ
[మార్చు]ఇక్కడ కాళియార్, తోడుపుజయార్, కొతయార్ అనే మూడు నదులు కలుస్తాయి.
మున్నార్
[మార్చు]మున్నార్ అనగా మూడు నదులు అని అర్ధం. ముధిరపూజ, నల్లతన్ని, కుండల నదులు కలిసిపోయే ప్రదేశం.
కందకుర్తి
[మార్చు]ఇది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా , రెంజల్ మండలంలోని గ్రామం. ఇక్కడ గోదావరి నది, మంజీర, హరిద్రా నదులు కలుస్తాయి.
భిల్వారా
[మార్చు]ఇది భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ బనాస్ నది బెరాచ్, మెనాలి నదులతో కలిసిపోతుంది[6].
మూలాలు
[మార్చు]- ↑ Mohan, Vineeth (2016-09-19). "Places Connected To Lord Rama And Ramayana - Prayag". www.nativeplanet.com. Retrieved 2021-01-20.
- ↑ "Triveni Sangam". prayagraj.com. Archived from the original on 8 December 2015. Retrieved 3 December 2015.
- ↑ "Triveni Sangam". gujrattourism. Retrieved 2022-07-30.
- ↑ INDIA, THE HANS (2016-06-14). "Kaleshwaram temple to get a makeover". www.thehansindia.com. Retrieved 2022-07-30.
- ↑ "Dakshina Triveni Sangamam - Sangameswarar Temple!". TeluguOne Devotional. Retrieved 2022-07-30.
- ↑ "बीगोद के त्रिवेणी संगम: वे विसर्जित अस्थियों में खोजते हैं सोना-चांदी | Triveni Sangam of Beagod". Patrika News. 2019-02-05. Retrieved 2022-07-30.