దండమూడి రామమోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దండమూడి రామమోహనరావు సుప్రసిద్ధ మార్దంగికులలో విశిష్ట వ్యక్తి.

వీరు రామస్వామి చౌదరి కుమారులుగా రామమోహనరావు 1933 మార్చి 18న విజయవాడలొ జన్మించారు. పళని సుబ్రహ్మణ్యం పిళ్లె, కొండపాటూరి రంగనాయకుల వంటి గురువుల వద్ద మృదంగ విద్యను అభ్యసించారు. తన ఆరవ ఏట శ్రీ యస్ దొరై సంగీత కచేరీకి మృదంగం వాయించి పండితుల ప్రశంసలు అందుకొన్నారు.

కర్ణాటక సంగీతంలోని ప్రసిద్ధులు పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకట స్వామినాయుడు, దాలిపర్తి పిచ్చిహరి, వోలేటి, ఈమని, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లె, బాలచందర్, చెంబై వంటి ఆ తరం వారికి మృదంగ సహకారం అందించారు. నేటి సంగీత కళాకారులలో ఆయన సహకరించని ప్రసిద్ధులు లేరనడం ఆశ్చర్యం కాదు. రామమోహనరావు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. 1944 నుండి ఆకాశవాణి కళాకారుడుగా పేరుపొందారు. 1949 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ మృదంగ విద్వాంసులుగా చేరి 1993 లో పదవీ విరమణ చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమి 1995 లో వీరిని సత్కరించింది. వాద్యరత్న నాద భగీరథ, కళా ప్రవీణ వంటి బిరుదులతో పాటు కనకాభిషిక్తులయ్యారు. ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశారు. పాంప్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు. ఎందరో సంగీత విద్వాంసుల్ని తయారుచేశారు. వీరి సతీమణి శ్రీమతి సుమతి విజయవాడ సంగీత ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.