దండమూడి సుమతీ రామమోహనరావు
దండమూడి సుమతీ రామమోహనరావు | |
---|---|
![]() | |
బాల్య నామం | నిడుమోలు సుమతి |
జననం | 1950 ఏలూరు |
భార్య / భర్త | దండమూడి రామమోహనరావు |
జాతీయత | భారతీయురాలు |
రంగం | మృదంగం |
శిక్షణ | నిడుమోలు రాఘవయ్య, దండమూడి రామమోహనరావు |
అవార్డులు | కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం |
దండమూడి సుమతీ రామమోహనరావు పురుషాధిక్యత ఉన్న భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి[1].
జీవిత విశేషాలు[మార్చు]
ఈమె నిడుమోలు రాఘవయ్య, వెంకటరత్నం దంపతులకు 1950వ సంవత్సరంలో ఏలూరులో జన్మించారు[2]. ఈమె నాద బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. చిన్ననాటి నుండే మృదంగ విద్వాంసులైన తండ్రి నిడుమోలు రాఘవయ్య గారి వద్ద మృదంగం నేర్చుకుని పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో దండమూడి రామమోహనరావు వద్ద మృదంగ విద్యనభ్యసించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి అనేక మంది ప్రముఖులకు వాద్య సహకారం అందించారు. ఈమె భర్త దండమూడి రామమోహనరావు కూడా మృదంగవిద్వాంసులే. భర్తతో కలిసి అనేక కచేరీలు చేశారు. ఆకాశవాణిలో ఏ' గ్రేడ్ కళాకారిణి. "మృదంగ శిరోమణి", "మృదంగ మహారాణి", "నాదభగీరథ", "మృదంగ లయ విద్యాసాగర" బిరుదులతో ఆమెను అనేక సంస్థలు సన్మానించాయి. మద్రాసు సంగీత అకాడమీ 1974, 80, 85 సంవత్సరాలలో ఉత్తమశ్రేణి వాద్యకళాకారిణిగా ఎంపికచేశారు. 1988లో విజయవాడ నగరపాలకసంస్థ కళా సత్కారాల్లో భాగంగా ఆమెను సన్మానించింది. ఈమెకు 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. ఈమె లయవేదిక అనే సంస్థను స్థాపించి భర్త పేరుమీద అనేక మంది మృదంగ కళాకారులను సన్మానిస్తున్నది.
పురస్కారాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ రాణీ కుమార్ (11 June 2011). "Into a man's world". ది హిందూ. Retrieved 18 May 2020.
- ↑ వెబ్ మాస్టర్. "Dandamudi Sumathi Rama Mohan Rao". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 18 May 2020.
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 6 June 2020.