దండు శివరామరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తిలిలో దండు శివరామరాజు విగ్రహం

దండు శివరామరాజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. అత్తిలి శాసనసభ్యునిగా పనిచేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు.

జీవిత విశేషాలు[మార్చు]

శివరామరాజు గారి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మందలపర్రు గ్రామం.[1] ఆయన 1936, జూలై14పెనుమంట్ర మండలం పొలమూరులో పేద కుటుంబంలో జన్మించారు. అతి చిన్న స్దాయి నుండి అం చెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో ఆదర్శవంతమైన పాత్ర పోషించారు. చింతలపాటి వరప్రసాదమూర్తి రాజు స్ధాపించిన విద్యాసంస్ధల్లో డ్రిల్‌ టీచర్‌గా సామాన్య వృత్తి ప్రారంభించి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనమండలి సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1975 నుండి 1984 వరకు శానసమండలి సభ్యులుగా పనిచేశారు. 1985లో టిడిపిలో చేరారు. 1989 నుండి మూడు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.[2]

శాసనమండలి సభ్యుడిగా శివరామరాజు విద్యాసేవ చేసారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన శివరామరాజు పశ్చిమగోదావరి అత్తిలి శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేసారు. చంద్రబాబు ప్రభుత్వంలో 1999 నుండి 2004 వరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా ఆదర్శవంతంగా, నీతి నియమాలతో పనిచేసారు. దేవాదాయ శాఖలో శివరామరాజు సంస్కర ణలు తీసుకురావడానికి కృషి చేసారు.[2]

వితరణశీలి[మార్చు]

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. శిమరామరాజుకు వారసులు లేకపోవడంతో తన ఆస్తులను దాన ధర్మాలకు ధారాదత్తం చేశారు. శివరామరాజు తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిలో 9 ఎకరాలను వివిధ దేవస్థానాలు, మిత్రులు, తెలుగుదేశం పార్టీకి రాసి ఇచ్చారు. బువ్వనపల్లి గ్రామంలో ఉన్న ఉమా మార్కెండేయస్వామి ఆలయానికి రెండెకరాల భూమి, పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలోని ఉమామార్కండేయస్వామి ఆలయానికి ఒక ఎకరం భూమి, అత్తిలిలోని వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఒక ఎకరం వితరణగా ఇచ్చారు.[3]

మూలాలు[మార్చు]

  1. తె.దే.పా-Leader-Dandu-Sivarama-Raju-Dead/701192 Senior తె.దే.పా Leader Dandu Sivarama Raju Dead[permanent dead link]
  2. 2.0 2.1 మాజీ మంత్రి దండు శివరామరాజు కన్నుమూత[permanent dead link]
  3. "మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత". Archived from the original on 2016-03-07. Retrieved 2015-03-18.

ఇతర లింకులు[మార్చు]