దండ తిరుపతిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండ తిరుపతిరెడ్డి
జననందండ తిరుపతిరెడ్డి
భారతదేశం కూనారం గ్రామం, కాల్వశ్రీరాంపూర్ మండలం, కరీంనగర్ జిల్లా
మరణం2004
గోదావరిఖని, తెలంగాణ
నివాస ప్రాంతంగోదావరిఖని, తెలంగాణ
వృత్తితెలంగాణ ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు.

దండ తిరుపతిరెడ్డి తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు. తెలంగాణ కోసం 41 రోజుల అంకుటిత దీక్షతో తెలంగాణ మాల ధరించి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలంగాణ వ్యాప్తంగా ఊరురా తిరిగి కరపత్రాల ద్వారా తెలియజేసిన వ్యక్తి.

బాల్యం[మార్చు]

ఇతను పూర్వపు కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో రాఘవరెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఇతను జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.[1]

కుటుంబం[మార్చు]

దండ తిరుపతిరెడ్డికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూమార్తెలు, ఒక కూమారుడు. పెద్ద కూమార్తె మూల విజయారెడ్డి తండ్రిలోని ఉద్యమ స్ఫూర్తిని అలవరుచుకొని తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్లొనేవారు. ప్రస్తుతానికి ఆమె పెద్దపల్లి జిల్లా స్త్రీ, శిశు, వృద్దుల, వికలాంగుల సంక్షేమ శాఖ కో ఆర్గనేజర్ గా, TRS పార్టీ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.

జీవిత ప్రస్థానం[మార్చు]

తెలంగాణ కోసం అంకుటిత దీక్షతో 41 రోజులు తెలంగాణ మాల ధరించి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలంగాణ వ్యాప్తంగా ఊరురా తిరిగి కరపత్రాల ద్వారా తెలియజేశారు. 90 వ దశకంలో జిల్లాలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కార్యక్రమం, అక్షర ఉజ్వల కోసం తెలంగాణ ప్రముఖ ఉద్యమకారుడు మల్లావఝ్జుల సదాశివ్ తో కలిసి ఉద్యమంలో కీలక భూమికను పోషించారు. ఈ ఉద్యమ క్రమంలో ప్రభుత్వ నిర్బంధాలను, అనేకనేక దాడులను, పోలీస్ కేసులను భరించి పోరాడిన ఉద్యమకారుడు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేపట్టి పది రోజులు జైలు జీవితం గడిపారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర అధ్యక్షనిగా పనిచేశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలను నిర్వహించి ఎంతో మందిని చైతన్యవంతున్ని చేసారు.

మరణం[మార్చు]

ఇతను 2004లో ఆరోగ్య కారణాలతో పరమావధించారు.

మూలాలు[మార్చు]

  1. దండ తిరుపతిరెడ్డి. దండ తిరుపతిరెడ్డి. జనం సాక్షం. pp. 4–5. |access-date= requires |url= (help)