మూల విజయారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూల విజయారెడ్డి
Mula VijayaReddy.jpg
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిఉద్యమకారిణి

మూల విజయారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారిణి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత 2001 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించింది. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. పెద్దపల్లి జిల్లా స్త్రీ, శిశు, వృద్దుల, వికలాంగుల యాదృచ్ఛిక పేజీగుల సంక్షేమ శాఖ కో ఆర్గనేజర్ గా, TRS పార్టీ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.[1]

జననం[మార్చు]

విజయరెడ్డి అప్పటి కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ లోని కూనారం గ్రామంలో జన్మించారు.[2] ఈవిడ తండ్రి దండ తిరుపతిరెడ్డి ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశాడు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేపట్టి పది రోజులు జైలు జీవితం గడిపాడు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర అధ్యక్షనిగా పనిచేశాడు.[3][4]

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న మూల విజయారెడ్డి

తెలంగాణ ఉద్యమంలో[మార్చు]

1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తన తండ్రి స్ఫూర్తితో మలిదశ ఉద్యమంలో పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్‌ లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు కోటపల్లి మండలంలోని ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యులను చేసింది. రైలురోకో, ఐఎన్టీయూసీ కార్యాలయ ధ్వంసంలో విజయారెడ్డిపై రెండు కేసులు సైతం నమోదయ్యాయి. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ లో పెట్టే సమయంలో ఢిల్లీ లోనే ఉండి, 12 రోజులపాటు ఆందోళనలో పాల్గొన్నది. సమైక్యాంధ్రకు నిరసనగా ఢిల్లీలోని విజయచౌక్‌లో ధర్నా చేస్తున్న విజయారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కరోజు జైలులో ఉంది.[5]

పదవులు[మార్చు]

  • TRS పార్టీ జాయింట్ సెక్రటరీ - ఆశ్వాబాద్, కాగజనగర్ ఇంఛార్జ్ గా ఉన్నారు.
  • గోదావరిఖని మున్సిపల్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గా చేసారు.
  • మిర్యాలగూడ తెరాస పార్టీ ఇంచార్జిగా కూడా చేసారు.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 30 March 2017.
  2. జనంసాక్షం బుక్
  3. నమస్తే తెలంగాణ. "మూల విజయారెడ్డికి రాష్ట్ర స్థాయి పురస్కారం". Retrieved 30 March 2017.[permanent dead link]
  4. నవతెలంగాణ. "విజయారెడ్డికి రాష్ట్రస్థాయి పురస్కారం". Retrieved 30 March 2017.
  5. నమస్తే తెలంగాణ. "ఉద్యమ మహిళగా విజయారెడ్డి." Retrieved 30 March 2017.[permanent dead link]