దర్భగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్భగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం జీలుగుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,251
 - పురుషుల సంఖ్య 2,117
 - స్త్రీల సంఖ్య 2,134
 - గృహాల సంఖ్య 1,177
పిన్ కోడ్ 534456
ఎస్.టి.డి కోడ్

దర్భగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 534 456. దర్భగూడెం ఒక ప్రాచీన గ్రామము. ఈ గ్రామ జనాభా 6000. జీలుగుమిల్లి మండలములో ఇదే పెద్ద గ్రామము. 1995కు మునుపు ఈ గ్రామము సిరి సంపదలతో విలసిల్లేది. ఈ గ్రామములో విద్యావంతులు ఎక్కువ. ఈ గ్రామములో ఒక మంచి ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల చుట్టుప్రక్కల ఊర్లలో పెట్టింది పేరు.

1995లో రైతులకు గిరిజనులకు మధ్య తగువులు జరిగాయి. ఆ తరువాత ఏడు సంవత్సరములు వ్యవసాయములు లేక రైతులు విలవిలలాడి పోయారు. పిల్లలను చదివించటానికి, ఆడ పిల్లల పెళిల్లు చేయటానికి డబ్బు లేక చాలా అవస్తలుపడినారు.

ఇప్పుడు మరల ఊరు కొంచెము కోలుకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొని ఆ ఊరి జనం నిలిచారు. కొంతమంది మాత్రము ఊరు విడిచి వలస వెల్లిపోయారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,251 - పురుషుల సంఖ్య 2,117 - స్త్రీల సంఖ్య 2,134 - గృహాల సంఖ్య 1,177

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4158.[2] ఇందులో పురుషుల సంఖ్య 2165, మహిళల సంఖ్య 1993, గ్రామంలో నివాసగృహాలు 963 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు