దీపక్ బర్డోలికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపక్ బర్డోలికర్
పుట్టిన తేదీ, స్థలం(1925-11-23)1925 నవంబరు 23
బర్డోలీ, గుజరాత్
మరణం2019 డిసెంబరు 12(2019-12-12) (వయసు 94)
లండన్
వృత్తికవి, రచయిత, జర్నలిస్ట్
భాషగుజరాతి
విద్యమెట్రిక్యులేషన్
పురస్కారాలుఫకీర్ సువర్ణాచంద్రక్ (1990)
జీవిత భాగస్వామి
ఫాతిమా
(m. 1961)
సంతానం4 కొడుకులు, 1 కూతురు

సంతకం

ముసాజీ ఇసాప్జీ హఫెస్జీ (23 నవంబర్ 1925 - 12 డిసెంబర్ 2019), గుజరాతీ కవి, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు. అతని కలం పేరు దీపక్ బర్డోలికర్. భారతదేశ విభజన తర్వాత అతను పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లాడు. అతను డాన్ గుజరాతీ ఎడిషన్‌తో, కరాచీ నుండి ప్రచురించబడిన అనేక గుజరాతీ దినపత్రికలతో పనిచేశాడు. డయాస్పోరిక్ గుజరాతీ సాహిత్యానికి ఆయన చేసిన కృషి వలన గుర్తింపు పొందాడు. అతను అనేక కవితలు, చరిత్ర పరిశోధనలను ప్రచురించాడు. రెండు వాల్యూమ్‌లు గా తన ఆత్మకథను కూడా ప్రచురించాడు.[1]

జననం,విద్య

[మార్చు]

దీపక్ బర్డోలికర్ 23 నవంబర్ 1925 న బర్డోలిలో (ప్రస్తుత భారతదేశంలోని గుజరాత్ లోని సూరత్ జిల్లాలోని ప్రాంతం) ఇసాప్జీ (యూసుఫ్) కి జన్మించాడు. అతను ఆరుగురు తోబుట్టువులలో చిన్నవాడు. అతనికి ఆరేళ్ల వయసులో అతని తండ్రి మరణించాడు. అతను ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, బార్డోలిలోని బార్డోలి బ్రాహ్మణ సర్వజానిక్ ఉన్నత పాఠశాలలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. తరువాత 1945 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్‌లో చేరి, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు.[2]

రచనలు

[మార్చు]

బార్డోలికర్ ప్రధానంగా గజల్ కవిత్వానికి ప్రాధాన్యతనిచ్చాడు. పరివేష్, అమాంత్రాన్, విశ్వాస్, తలాబ్, ఎని షెరిమా, గుల్మహోర్న గుంట్, చంపో ఆనే చమేలీ, హవానా పగలా, కుల్లియతే దీపక్, తడ్కో తారో ప్యార్, రెలో అషద్నో అనేవి అతని కవితా సంకలనాలు. ధూళియు ఆకాష్, భక్తవర్ అతని నవలలు. అతని చరిత్ర, పరిశోధన రచనలలో సున్నీ వహోరా, వహోరా విభూతియో, ఖురాన్ పరిచయ్, న్యైనో దివాస్, వట్నా దివా ఉన్నాయి. మేఘధనుష్య అతని వ్యాసాల సేకరణ..[3]

ఆత్మకథ

[మార్చు]

అతను తన ఆత్మకథను రెండు సంపుటాలుగా ప్రచురించాడు. ఉచ్చాలా ఖే ఛే పానీ (2004) అనే భాగంలో అతని పుట్టినప్పటి నుండి 1978 వరకు రికార్డులు నమోదు చేయగా, సంకలోనో సీతమ్ (1999) లో అతని జీవిత మిగతా అనుభవాలు ఉన్నాయి.

పురస్కారాలు

[మార్చు]

కరాచీలోని రంగకల గుజరాతీ సాంస్కృతిక సంఘం 1990 లో గుజరాతీ గజల్స్‌కి చేసిన కృషికి అతనికి ఫకీర్ సువర్ణ చంద్రక్‌ను ప్రదానం చేసింది.

మరణం

[మార్చు]

ముసాజీ ఇసాప్జీ హఫెస్జీ తన పదవీ విరమణ తరువాత, 2000 సంవత్సరంలో తన కొడుకుతో కలిసి UK లోని మాంచెస్టర్‌కు వెళ్లాడు. క్యాన్సర్ కారణంగా లండన్ లో 12 డిసెంబర్ 2019 న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Kalyani, Vipul (September 2015). Desai, Parul Kandarpa (ed.). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્ર્યોત્તર યુગ -1) [History of Gujarati Literature (Post-Independence Era - 1)]. Vol. 7. Ahmedabad: K. L. Study Center, Gujarati Sahitya Parishad. pp. 228–229. ISBN 978-81-930884-5-6.
  2. Vyas, Rajani (2012). Gujaratni Asmita (5th ed.). Ahmedabad: Akshara Prakashan. p. 263.
  3. "બારડોલી: ગુર્જરીનો કવિ છું હું 'દીપક', હું નથી એક દેશનો માણસ". NavGujarat Samay (in గుజరాతి). 2019-12-12. Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-24.