దుర్భాక రాజశేఖర శతావధాని
స్వరూపం
(దుర్భాకరాజశేఖర శతావధాని నుండి దారిమార్పు చెందింది)
దుర్భాక రాజశేఖర శతావధాని | |
---|---|
జననం | కాళహస్తయ్య నవంబర్ 18, 1888 వైఎస్ఆర్ జిల్లాజమ్మలమడుగు గ్రామం |
మరణం | ఏప్రిల్ 30, 1957 |
ఇతర పేర్లు | రాజశేఖర శతావధాని |
వృత్తి | రాజకీయాలు |
ప్రసిద్ధి | ప్రముఖ కవి, అవధాని |
పదవి పేరు | మునిసిపల్ కౌన్సిలర్, తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు |
భార్య / భర్త | లక్ష్మమ్మ |
పిల్లలు | కుమారుడు కామేశ్వరయ్య, కుమార్తె కామేశ్వరీదేవి |
తండ్రి | దుర్భాక వెంకటరామయ్య |
తల్లి | సుబ్బమ్మ |
దుర్భాక రాజశేఖర శతావధాని (నవంబర్ 18, 1888 - ఏప్రిల్ 30, 1957) [1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రితో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
విద్యాభ్యాసము
[మార్చు]- 1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
- 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
- మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
ఉద్యోగాలు
[మార్చు]- 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
- ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
- 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
- మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.
రచనలు
[మార్చు]- రాణాప్రతాపసింహచరిత్ర[2]
- అమరసింహచరిత్ర
- వీరమతీ చరిత్రము
- చండనృపాల చరిత్రము
- పుష్పావతి
- సీతాకల్యాణము (నాటకము)
- సీతాపహరణము (నాటకము)
- వృద్ధిమూల సంవాదము (నాటకము)
- పద్మావతీ పరిణయము (నాటకము)
- విలయమాధుర్యము
- స్వయంవరము
- అనఘుడు
- గోదానము
- శరన్నవరాత్రులు
- అవధానసారము
- రాణీసంయుక్త (హరికథ)
- తారాబాయి (నవల)
- టాడ్ చరిత్రము
- రాజసింహ
- ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో)
- కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)
బిరుదులు
[మార్చు]కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి, కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు.
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
- ↑ [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో