Jump to content

దేవుడిచ్చిన కొడుకు

వికీపీడియా నుండి
దేవుడిచ్చిన కొడుకు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ
శ్రీదేవి
సత్యనారాయణ
అంజలీదేవి
గిరిబాబు
జయమాలిని
సంగీతం సత్యం
గీతరచన ఆరుద్ర
సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కళ ఎస్.కృష్ణారావు
కూర్పు ఎస్.ఎస్.ప్రకాశం,
వెంకటరత్నం
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
  • కృష్ణ
  • శ్రీదేవి
  • అంజలీదేవి
  • రాజేశ్వరి
  • జయవాణి
  • జయమాలిని
  • నూతన్ ప్రసాద్
  • అల్లు రామలింగయ్య
  • గిరిబాబు
  • త్యాగరాజు
  • మోదుకూరి సత్యం
  • కైకాల సత్యనారాయణ

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాతలు: పి.బాబ్జీ, జి.సాంబశివరావు
  • దర్శకుడు: కె.ఎస్.ఆర్.దాస్
  • మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • పాటలు: ఆరుద్ర, సినారె, వేటూరి, గోపి
  • సంగీతం: సత్యం

గజపతి కోటీశ్వరుడు. గజపతి కొడుకు శేఖర్ భిల్లా అనే వ్యక్తితో స్నేహం చేసి జూదం, తాగుడులకు బానిస అవుతాడు. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న గజపతిని గోపీ అనే వ్యక్తి ఒకరోజు దొంగలబారి నుండి రక్షించి గజపతి అనుగ్రహం వల్ల ఎస్టేటులో ఉద్యోగం సంపాదిస్తాడు. క్రమక్రమంగా గజపతి విశ్వాసాన్ని చూరగొని, అతని కుటుంబంలో ఒకడిగా కలిసిపోయి, రాణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. గోపీని దేవుడిచ్చిన కొడుకుగా భావించి గజపతి, అతనికి తన యావదాస్తిపై పెత్తనాన్ని అప్పగించి, తన తరతరాల సంపద దాచబడియున్న ఖజానాను, అందులో వజ్రవైడూర్యాలు పొదగబడిన దేవీ విగ్రహాన్ని చూపించి, దాని రక్షణ భారం అప్పగిస్తాడు.

ఇక్కడి నుండి కథ మలుపు తిరుగుతుంది. నిజానికి గోపీ దొంగల ముఠా నాయకుడైన నాగూ అనుచరుడు. నాగూ ప్లాన్ ప్రకారం దేవీ విగ్రహం కాజేయడానికి గోపీ నియమించబడి వుంటాడు. గజపతి దంపతులు తన యందు చూపిన పుత్రవాత్సల్యానికి, గజపతి కూతురు, చిన్న కొడుకుల సోదరప్రేమను నిర్లక్ష్యంగా త్రోసి పుచ్చలేక గోపీ నాగూకి ఎదురు తిరుగుతాడు. దానితో విగ్రహాన్ని తనకు అప్పగించపోతే గజపతి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తాడు. శేఖర్ స్నేహితుడు బిల్లా కూడా నాగూతో చేతులు కలుపుతాడు. వీళ్ల బారినుండి గజపతి కుటుంబాన్ని, సంపదను, దేవీ విగ్రహాన్ని గోపీ ఎలా కాపాడాడన్నది మిగిలిన కథ[1].

పాటలు

[మార్చు]
  1. అయితే మొగుణ్ని కాదా మగాడ్ని - రచన: ఆరుద్ర[2] - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. నీ మనసులో ఏమున్నదో అ దేవుడికైనా తెలియదుగాని - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  3. బొట్టుపెట్టిన కాటుకెట్టిన పూలుచుట్టిన చీరకట్టిన మళ్ళి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సి.నారాయణరెడ్డి
  4. మా మంచి చెల్లెమ్మా చామంతి పువ్వమ్మా నువ్వు నవ్వమ్మా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - రచన: గోపి

మూలాలు

[మార్చు]
  1. రమణ (18 February 1980). "చిత్రసమీక్ష దేవుడిచ్చిన కొడుకు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 315. Retrieved 21 January 2018.[permanent dead link]
  2. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బయటి లింకులు

[మార్చు]