దేవుడు మామయ్య
(దేవుడు మావయ్య నుండి దారిమార్పు చెందింది)
దేవుడు మావయ్య (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
నిర్మాణం | దేవినేని వెంకట్రామయ్య, బద్రీనాథ్ |
తారాగణం | శోభన్ బాబు , వాణిశ్రీ , జగ్గయ్య, శ్రీధర్, విజయలలిత, పద్మనాభం ఛాయాదేవి |
సంగీతం | చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రకాశ్ |
నిర్మాణ సంస్థ | రాజా ఆర్ట్స్ ఎంటర్‌ప్రైజస్ |
భాష | తెలుగు |

కథ[మార్చు]
అనాథ అయిన రాజా అనాథపిల్లలను చేరదీసి పెంచుతూ ఉంటాడు. ఒకసారి ఆత్మహత్య చేసుకోబోతున్న సీత అనే పల్లెటూరి యువతిని రక్షిస్తాడు. సీత చిన్ననాడే తన భర్తగా నిర్ణయించబడిన గోపీని వెదుక్కొంటూ పట్నం వచ్చి గోపీచేత తిరస్కరింపబడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. గోపీని లీల అనే యువతి ప్రేమిస్తుంది. లీల గోపీ మూలంగా గర్భవతి అవుతుంది. రాజా సీతను ఆధునిక యువతిగా తయారు చేస్తాడు. గోపీ కొత్త సీతను చూసి ఎలాగైనా తనదానిగా చేసుకోవాలని ఎత్తులు వేస్తాడు[1].
పాటలు[మార్చు]
- అందమంతా చీరకట్టి పరువంతా పైట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- చిట్టి పొట్టి డింగ్ డాంగ్ బెల్ మున్ని నాని బ్యూటిఫుల్ మీతోనే నా లోకం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- జీవితమే ఒక జోల పాట కనుల నీరు తుడిచే ( విషాదం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- జీవితమే ఒక జోల పాట కనుల నీరు తుడిచే కలల తీపి పాట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- బ్రతుకే ఒక ఆట వయసే సయ్యాట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్
- యే వసంత కోకిల వాన వేళ పాడదు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలు[మార్చు]
- ↑ "చిత్రసమీక్ష - వెంకట్రావ్ - ఆంధ్రపత్రిక - దినపత్రిక - తేదీ:జనవరి 18, 1981 - పేజీ 6". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-11.
బయటి లింకులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)