Jump to content

ధారా వెంకట సుబ్బయ్య

వికీపీడియా నుండి
ధారా వెంకట సుబ్బయ్య
జననం(1866-05-12)1866 మే 12
మరణం1946 జూన్ 12(1946-06-12) (వయసు 80)
జాతీయతభారతీయుడు
వృత్తిప్రభుత్వ ఉద్యోగం (లాక్ సూపరెంటెండెంటు)
ఉద్యోగంబ్రిటిషు ప్రభుత్వం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పౌరాణిక నటుడు

ధారా వెంకట సుబ్బయ్య (1866 మే 12 - 1946 జూన్ 12) సుప్రసిద్ధ రంగస్థల నటుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు 1866లో ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడం వలన తల్లితో పాటు నైజాం వలస వెళ్ళారు. అక్కడ ఉర్దూ భాష పర్షియన్ భాషలలో పరిచయం ఏర్పడింది. అక్కడ కొంతకాలం ఉండి తిరిగి ఒంగోలు వచ్చి ఎ. బి. ఎమ్. ఉన్నత పాఠశాలలో స్కూల్ ఫైనల్ వరకు చదివారు. ఆంగ్ల సాహిత్యంలో పరిచయం ఏర్పరచుకొని, తర్వాత సంస్కృతం, గ్రీకు, లాటిన్ భాషలను నేర్చుకున్నారు. వేదాలు, ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేశారు. పెదగంజాంలో కొంతకాలం లాక్ సూపరెంటెండెంటు ఉద్యోగం చేశారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

వీరికి నాటక కళాభిరుచి మెండుగా ఉండడం మూలాన వివిధ నాటకాలలో విభిన్న పాత్రలు పోషించేవారు. భక్త ప్రహ్లాద, వేణీ సంహారం, భీష్మ నిర్యాణం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు మొదలైన నాటకలను రసవంతంగా ప్రదర్శించేవారు. హిరణ్యకశిపుడుగా, గాంగేయుడుగా, గయుడుగా, హరిశ్చంద్రుడుగా వైవిధ్యమున్న పాత్రల్ని పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. హరి ప్రసాదరావు గారితో సన్నిహిత మైత్రి చేత తమ నటనపై ప్రసాదరావు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. వెంకట సుబ్బయ్య గారు ఆనాటి ప్రసిద్ధ హరికథకులైన గొల్లపూడి రామలింగశాస్త్రితో కలిసి కథా రచన, స్వరకల్పన చేసేవారు. పీష్వా నారాయణరావు మొదలైన హిందీ భాష నాటకాలను ప్రయోక్తగా వ్యవహరించారు.

మరణం

[మార్చు]

వీరు 1946 జూన్ 12 తేదీన పరమపదించారు.

మూలాలు

[మార్చు]