నందికంటి శ్రీధర్
నందికంటి శ్రీధర్ | |||
తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 2023 అక్టోబరు 05 - 07 డిసెంబర్ 2023[1] | |||
ముందు | తాడూరి శ్రీనివాస్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 అల్వాల్ | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నందికంటి శ్రీధర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2023 అక్టోబరు 05న తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనకబడిన వర్గాల (ఎంబీసీ) డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి తొలిసారి అల్వాల్ మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ గా తొలి పదవి చేపట్టి ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పని చేశాడు. ఆయన 2000 సంవత్సరంలో అల్వాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఆ తర్వాత 2009లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పని చేశాడు.
నందికంటి శ్రీధర్ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా 2016లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.[3]
2023లో మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మనస్తాపంతో ఆయన 2023 అక్టోబర్ 2న మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పార్టీ అధ్యక్ష & కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి[4] అక్టోబర్ 04న రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5][6]
ఆయనను 2023 అక్టోబరు 05న తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనకబడిన వర్గాల (ఎంబీసీ) డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2] నందికంటి శ్రీధర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 2.0 2.1 Namasthe Telangana (6 October 2023). "ఎంబీసీ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Disha (10 December 2022). "మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి నందికంటి శ్రీధర్". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Namasthe Telangana (3 October 2023). "కాంగ్రెస్ పార్టీకి 35 ఏండ్లపాటు సేవచేస్తే చివరికి మిగిలింది ఆవేదనే: మల్కాజిగిరి డీసీసీ చీఫ్ నందికంటి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Namasthe Telangana (5 October 2023). "కారెక్కిన నందికంటి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Mana Telangana (4 October 2023). "బిఆర్‌ఎస్ గూటికి నందికంటి శ్రీధర్." Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.