తాడూరి శ్రీనివాస్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Taduri Srinivas.jpg
తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్
జననం
తాడూరి శ్రీనివాస్‌

1967 ఫిబ్రవరి 2
వృత్తిరాజకీయ నాయకుడు, న్యాయవాది
జీవిత భాగస్వాములుతాడూరి శ్రీలత
పిల్లలుఉదయ్ కిరణ్ , సాయి కిరణ్

తాడూరి శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ తొలి చైర్మన్ గా నియామకం అయ్యాడు.[1][2]

జననం[మార్చు]

తాడూరి శ్రీనివాస్ 2 ఫిబ్రవరి 1967 లో జన్మించాడు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి. అయన తండ్రి ప్రభుత్వ ఉపాద్యాయుడు.

రాజకీయ జీవితం[మార్చు]

విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆసక్తితో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టి.ఎన్.ఎస్.ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పని చేసాడు. లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్షంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ లో సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. ఎన్నికల సమయంలో వివిధ జిల్లాల పార్టీ ఇంచార్జి గా, ఉప్పల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. 30 మార్చి 2017న ఆయన ను రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించాడు. 2017లో ఆయనను మల్కాజ్‌గిరి, అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం, సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం, సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం లకు ఇంచార్జిగా పార్టీ నియమించింది.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, హోం తెలంగాణ తెలంగాణ ముఖ్యాంశాలు (31 March 2017). "ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్‌". www.andhrajyothy.com. Archived from the original on 16 సెప్టెంబర్ 2019. Retrieved 16 September 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  2. ఆంధ్రభూమి, రాష్ట్రీయం (31 March 2017). "ఎంబిసి సంస్థ చైర్మన్ తాడూరి". www.andhrabhoomi.net. Archived from the original on 16 సెప్టెంబర్ 2019. Retrieved 16 September 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)