నక్కా ఆనంద్ బాబు
నక్కా ఆనంద్ బాబు | |||
మాజీ మంత్రి & మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 నుండి ప్రస్తుతం | |||
ముందు | రాజ్ సతీష్ పాల్ | ||
---|---|---|---|
తరువాత | మేరుగు నాగార్జున | ||
నియోజకవర్గం | వేమూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 10 సెప్టెంబర్ 1966 గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నాగేంద్రం, పుష్పవతి | ||
జీవిత భాగస్వామి | సత్య రత్న కుమారి | ||
సంతానం | ఎన్ అఖిలేష్, ఎన్ అకాష్ | ||
నివాసం | గుంటూరు | ||
వృత్తి | రాజకీయ నాయకురాడు |
నక్కా ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]నక్కా ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా లో జన్మించాడు. ఆయన 1981లో హైదరాబాద్ లోని ఎస్.జె.ఆర్.ఆర్.ఎం హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు. ఆనంద్ బాబు 1988లో గుంటూరు లోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ నుండి బీఏ పూర్తి చేసి, 1991లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి బిఎల్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2017 నుండి 2019 వరకు నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఎస్సీ & ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయనను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3]
- శాసనసభకు పోటీ
సంవత్సరం | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2009 | వేమూరు | (ఎస్సీ) | మేరుగు నాగార్జున | కాంగ్రెస్ పార్టీ | 52938 | నక్కా ఆనంద్ బాబు | తెలుగుదేశం పార్టీ | 55168 | 2230 | గెలుపు |
2014 | వేమూరు | (ఎస్సీ) | మేరుగు నాగార్జున | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 75095 | నక్కా ఆనంద్ బాబు | తెలుగుదేశం పార్టీ | 77222 | 2127 | గెలుపు |
2019 | వేమూరు | (ఎస్సీ) | నక్కా ఆనంద్ బాబు | తెలుగుదేశం పార్టీ | 81671 | మేరుగు నాగార్జున | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 71672 | 9999 | ఓటమి |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (6 April 2017). "కొత్త మంత్రులకు టీడీపీ నేతల షాక్". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.