Jump to content

మేరుగు నాగార్జున

వికీపీడియా నుండి
మేరుగు నాగార్జున

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – 3 జూన్ 2024

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - 3 జూన్ 2024
ముందు నక్కా ఆనంద్‌ బాబు
నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్‌డ్‌)

వ్యక్తిగత వివరాలు

జననం 15 జూన్ 1966
వెల్లటూరు గ్రామం, భట్టిప్రోలు మండలం, గుంటూరు జిల్లా
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కోటేశ్వర రావు
జీవిత భాగస్వామి నాగమణి
సంతానం శ్రీరామ్ కిరణ్ నాగ్, శ్రీరామ్ చందన్ నాగ్ & శ్రీ రమ్య మోనికా నాగ్
నివాసం వెల్లటూరు గ్రామం
వృత్తి రాజకీయ నాయకుడు

మేరుగు నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి,[1] 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మేరుగు నాగార్జున 15 జూన్1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా , భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామంలో జన్మించాడు. ఆయన 1980లో వెల్లటూరు గ్రామంలో పదవ తరగతి వరకు చదివాడు. మేరుగు నాగార్జున 1982లో ఇంటర్మీడియట్, 1985లో రేపల్లె లోని ఏబిఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి 1987లో ఎం.కామ్, 1989లో ఎమ్.ఫీల్, 1994లో పి.హెచ్.డి పూర్తి చేశాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

మేరుగు నాగార్జున 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహంతో 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎస్సీ & ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా నియమితుడయ్యాడు. ఆయన 2012లో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ గా పని చేశాడు.[5]

శాసనసభకు పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
2009 మేరుగు నాగార్జున కాంగ్రెస్ పార్టీ 52938 నక్కా ఆనంద్‌ బాబు టీడీపీ 55168 2230 ఓటమి
2014 మేరుగు నాగార్జున వైసీపీ 75095 నక్కా ఆనంద్‌ బాబు టీడీపీ 77222 2127 ఓటమి
2019 నక్కా ఆనంద్‌ బాబు టీడీపీ 81671 మేరుగు నాగార్జున వైసీపీ 71672 9999

గెలుపు

2024 సంతనూతలపాడు మేరుగు నాగార్జున వైసీపీ 75372 బి.ఎన్. విజయ కుమార్ టీడీపీ 105757 30385 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Vemuru Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  2. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  3. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sakshi (10 April 2022). "పదునైన గళం.. అలుపెరుగని పోరాటం". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  5. Sakshi (24 January 2019). "ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మల్లిస్తున్నారు : మెరుగు". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.