నలమాద పద్మావతిరెడ్డి

వికీపీడియా నుండి
(నలమాడ పద్మావతిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నలమాద పద్మావతి రెడ్డి
నలమాద పద్మావతిరెడ్డి


పదవీ కాలము
2014- 2018
నియోజకవర్గము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నలమాద పద్మావతి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2014లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించింది.

జననం[మార్చు]

1967, జూన్ 17న ఆర్. ధనంజయరెడ్డి, ఉమాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లో జన్మించింది.

విద్యాభ్యాసం[మార్చు]

ఈవిడ కళాత్మక (ఆర్కిటెక్చర్) విద్యలో పట్టభద్రుడయింది. రిషి వ్యాలీ పాఠశాలలో మరియు హైదరాబాద్ లోని జవహార్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదువుకుంది. బెంగుళూర్లో అంతర్గత రూపకల్పన (ఇంటీరియర్ డిజైనింగ్) విద్యను అభ్యసించింది.[1][2]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

ఈవిడ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలి మహిళా పోటీదారుణి.[3] 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 13,374 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థిని ఓడించి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయింది.[4] నలమాడ పద్మావతిరెడ్డి 81,966 ఓట్లు రాగా, బొల్లం మల్లయ్య యాదయ్య 68,592 ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె టిఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలైంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈవిడ 1990, ఏప్రిల్ 1న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ మంత్రి నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివాహం చేసుకుంది.[5]

మూలాలు[మార్చు]