Jump to content

నవాబ్ శివకుమార్ గౌడ్

వికీపీడియా నుండి
నవాబ్ శివకుమార్ గౌడ్
జననం (1972-08-03) 1972 ఆగస్టు 3 (వయసు 52)
జీవిత భాగస్వామిశైలజ
పిల్లలు3

నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, సామజిక సేవకుడు. ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నవాబ్ శివకుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, పిట్లం గ్రామంలో 1972 ఆగస్టు 3న జన్మించాడు. ఆయన ఆరో తరగతిలో ఉన్నప్పుడు అతడి నాన్న చనిపోవడంతో కుల వృత్తియైన కల్లును అమ్ముతూ కుటుంబ బాధ్యతలను తన అన్నయ్యతో కలిసి చూసుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటూ పిట్లం గ్రామంలోనే పదవ తరగతి పూర్తి చేశాడు. శివకుమార్ ఆ తరువాత కామారెడ్డి పట్టణంలో 1989లో జీవీఎస్‌ కాలేజీలో ఇంటర్మీడియట్ (ఎంపీసీ) చదివి కాలేజీలో మూడవ ర్యాంకర్‌గా నిలిచి తరువాత డిగ్రీ బీఎస్సీలో కాలేజ్‌ టాపర్‌గా నిలిచాడు. ఆయన బీఎస్సీ పూర్తి చేసి హైదరాబాద్ నిజాం కాలేజీలో పీజీ ఎలక్టానిక్స్​​‍ పూర్తి చేశాడు.[1]

వృత్తి జీవితం

[మార్చు]

నవాబ్ శివకుమార్ గౌడ్ 1994లో లాసెట్‌, బీఈడీ ఎంట్రన్స్​‍ రాయగా అదే సంవత్సరం గ్రూప్‌-1 పరీక్షలు రాసి ప్రిలిమ్స్​‍ క్వాలిఫై ఆర్థిక పరిస్థితుల వల్ల మెయిన్స్​‍ రాయలేకపోయాడు. ఆయన ఆ తరువాత నాగార్జునసాగర్‌ ప్రభుత్వ కాలేజీలో బీఈడీ చేసి, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికై ఎస్జీటీ టీచర్‌గా చేరాడు. శివకుమార్ 1998లో గ్రూప్‌-1కు దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్​‍ పాసై 1999లో మెయిన్స్​‍ రాశాడు. కానీ రాలేదు దింతో ఆయన 2002లో జూనియర్‌ లెక్చరర్‌గా 2002లో జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికై 2012 వరకు రామారెడ్డి, కామారెడ్డి కాలేజీల్లో పని చేశాడు. ఆయన తిరిగి 2004లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్​‍ పాసై కుటుంబ సమస్యలతో మెయిన్స్​‍ పరీక్షలు రాయలేకపోయాడు.

2007 నోటిఫికేషన్‌లో కామన్‌ సిలబస్ పెట్టడంతో ఎలాగైనా గ్రూప్స్​‍ కొట్టాల్సిందేనని కుటుంబాన్ని ఊరిలో ఉంచి, హైదరాబాద్‌కు వచ్చి పరీక్షలకు సిద్దమై ప్రిలిమ్స్​‍, మెయిన్స్​‍ క్లియర్‌ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లి 10 మార్కులతో ఇంటర్వ్యూ మిస్సయ్యింది. అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉదృతమవుతున్న సమయంలో తెలంగాణ లెక్చరర్స్​‍ ఫోరం వ్యవస్థాపకుడిగా ఉద్యమంలో కీలకంగా పని చేశాడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కామారెడ్డిలో పని చేస్తున్నాడు, ఆ సమయంలో ఆయన పని చేస్తున్న కాలేజీకి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రిన్సిపాల్‌ ఉండడం ఆమె తెలంగాణ పట్ల ఎగతాళిగా మాట్లాడడంతో ఆమె ఆయనకు వాగ్వాదం జరిగింది. ఆ మాటలతో పట్టుదలతో మళ్లీ గ్రూప్‌-1 చదివి గ్రూప్‌-1 ఇంటర్వ్యూ వరకు వచ్చాడు. ఆయన తిరిగి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రావడంతో ఆర్థిక ఇబ్బందులతో మెటీరియల్‌ కొనేందుకు పైసల్ లేకపోవడంతో బంగారు ఉంగరాన్ని తాకట్టుపెట్టి, పరీక్షకు హాజరై 2011 గ్రూప్‌-1లో జైళ్లశాఖలో డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. ఆయన ఆ తరువాత తమిళనాడులో ట్రైనింగ్‌ పూర్తి చేసి 2012లో జైళ్లశాఖలో డీఎస్పీగా విధుల్లో చేరాడు. ఆయన ఆ తరువాత కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌గా[2][3] పని చేసి 2021లో ఎస్పీగా పదోన్నతి అందుకొని చర్లపల్లి ఓపెన్ జైలు సూపరింటెండెంట్‌గా చేరి నవంబర్ 2021 నుండి చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌ సంస్థ

[మార్చు]

వరంగల్ జిల్లాలో 2019లో ప్రవీణ్‌ అనే వ్యక్తి తొమ్మిది నెలల పసిపాపపై హత్యాచారానికి పాల్పడిన ఘటన శివకుమార్‌ గౌడ్‌ను కదిలించింది. ఇలాంటి అకృత్యాలకు తావులేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో భ్రూణ హత్యల నివారణ, బాలికల సంరక్షణ ప్రధాన లక్ష్యాలుగా ది సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌ సంస్థను ప్రారంభించాడు.[4] ఆయన ఈ సంస్థ ప్రారంభించిన తర్వాత సామాజిక స్పృహ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు ఆయనతో జత కట్టారు. ఈ సంస్థ ద్వారా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుపేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (20 April 2022). "ఆత్మవిశ్వాసంతో అడుగేయాలి". Retrieved 3 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Sakshi (30 April 2019). "ఇంటర్‌ ఫెయిలే జీవితాన్ని మార్చేసింది". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  3. Andhra Jyothy (20 April 2019). "ఖైదీల కుటుంబాలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  4. The Hindu (13 December 2020). "For the cause of girl child" (in Indian English). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  5. Namasthe Telangana (13 July 2022). "మీ విజయం..మా అభయం!". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.