నాగపూరి రాజలింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగపూరి రాజలింగం గౌడ్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 నుండి 2004
ముందు నిమ్మ రాజిరెడ్డి
తరువాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
నియోజకవర్గం చేర్యాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953
చేర్యాల, చేర్యాల మండలం సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లింగయ్య గౌడ్
సంతానం నాగపూరి కిరణ్
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు
15, డిసెంబర్ 2021నాటికి

నాగపూరి రాజలింగం గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

నాగపూరి రాజలింగం గౌడ్ 1953లో తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలం, చేర్యాలలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

నాగపూరి రాజలింగం 1985లో జరిగిన ఎన్నికల్లో చేర్యాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నిమ్మ రాజిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [మండల శ్రీరాములు] పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. నాగపూరి రాజలింగం 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసన సభ్యుల కోటాలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై వరకు 29 మార్చి 2015 వరకు ఎమ్మెల్సీగా పని చేశాడు.[2][3] ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 October 2023). "'ప్రజలు చందాలు పోగేసి గెలిపించారు' : మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  2. The New Indian Express (29 January 2009). "All 11 nominations found valid". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  3. Sakshi (8 May 2015). "తెలుగు రాష్ట్రాల్లో 'ఎమ్మెల్సీ' నగారా". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  4. The Hindu (25 June 2014). "Five Congress MLCs join TRS" (in Indian English). Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.