Jump to content

నాగరాజులు

వికీపీడియా నుండి

మహాభారత యుద్ధకాలము మొదలు దాదాపు మౌర్యులు కాలము వరకు అనగా (270 B C) వరకు ఆంధ్రదేశమున నాగులు, యక్షులు, దానవులు మున్నగు తెగలవారు నివసించేవారు. నాగరాజులు ఆంధ్రదేశమునే గాక, భారతదేశమునంతటను నివసించి పాలించిన దృష్టాంతరములు ఉన్నాయి. ఆర్యులు మనదేశానికి వచ్చి మందరగిరి ప్రాంత మధన కార్యమును సాగించినప్పుడే వాసుకియను నాగరాజు సాయపడి యుండెను. ఆదిశేషుడు, తక్షకుడు మొదలగువారీ వంశీయులే.

పూర్వ చరిత్ర

[మార్చు]

జనమేజయుడు ఇంద్రప్రస్తపురి నుండి పాలించుచు నాగులపై దండయాత్ర సలిపెను. అహిఛ్చత్రము, నాగపూరు, పద్మావతీనగరము మొదలగు ఉత్తరదేశప్రాంతమునుండి దక్షిణదేశప్రాంతమునకు వలసివచ్చిరేమోనని తెలియుచున్నది. తర్వాత వీరికి భోగవతీపురము (బస్తరు) వనవాసి (మైసూరులోనిది) నివాసము లేర్పడి, అచట రాజ్యాధికారము పొదినట్లు చెప్పవచ్చును. వీరు వింధ్యవాసినీ దేవత భక్తులని శాసనములలో చెప్పబడుచున్నది. అందుచే వీరు మొదట వింధ్య పర్వతము వారని తెలియుచున్నది.ఆంధ్రప్రాంతమున ఉండిన యక్షులు జైనమతావలంబులు కాగా, వీరు బౌద్ధమతావలంబులు. ఇది అశోకుడు పూర్వమై యుండును.నాగరాజొకడు అమరావతిలో ఒక బౌద్ధ స్థూపమును నిర్మించెను.తెలంగాణ లోను, కృష్ణకు దక్షిణమునున్న పలు గ్రామంలందు నాగులు నివసించి, తర్వాత నాశనమై కొందరు వలసకుపోయినట్లు అచ్చటి కొన్ని గ్రామంల పేర్లవల్ల తెలియుచున్నది. ఉదాహరణకి:

  • 1. నాగులేరు - ఈచిన్నయేరు నాగుల పేరిట పల్నాటి తాలూకాలో ఇప్పటికి ప్రవహించుచున్నది.పూర్వమేనామమో తెలియదు.
  • 2. నాగరాజుపాడు కాట్రాజుపాడు లేదా నాగరాజుపాడు ఇది తెనాలి తాలూకా కొల్లూరు ప్రాంతమునందు ఉంది. దీనిని త్రిలోచనవ పల్లవుడు నాశనము చేసినట్లు లోకలు రికార్డులు తెలుపుచున్నవి.
  • 3. నాగులపాడు తెలింగాణయందు ఓరుగల్లు ప్రాంతమందు ఒక గ్రామం.ఇది యచట నాగుల ఉనికిని వారి నాశనమును తెలుపుచున్నది.
  • 4. నాగరాజుపాడు గుంటూరు జిల్లాయందలి పెదనందిపాడు దగ్గరి గ్రామం. పూర్వమిచట నాగులున్నట్లు పలు శాసనములు ఉన్నాయి.

ఇమకను ఆంధ్రలో గల నాగసముద్రము, నాగవరం, నాగులవరం, సర్పవరం, నాగూరు మొదలగు గ్రామాలు ఆంధ్రలోను, కర్ణాటక ప్రాంతమందును ఉన్నందువలన నాగుల ఉనికిని తెలుపుచున్నవి.

ఆంధ్రజాతి, మహాభాగవతము ప్రకారము బలియను క్షత్రియ వంశీకులై ఉమ్ందీ వింధ్య ప్రాంతమునుండి కారణాంతరములచే దిగువకు వలసవచ్చిన కొలదిన మొదాట నాగులతో యుద్ధములోనర్చి వారిలో కొందరిని పారద్రోలిరి, తెనుగు దేశమున స్థిరపడి, నాగులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకొనిరి వారి రాజ్యమును పైఠాను, ధాన్యకటకము లందు స్థాపించు కొనినట్లు భావింపవచ్చును.

నాగులలో సూతనాగులను శాఖీయులు కోందరులోబడిపోయి శాతకర్ణి రాజులవద్ద సామంతులుగా మెలగుచువచ్చిరి. శివస్కంద నాగ శాతక చివరి శాతవాహన రాజువద్ద శాతవాహన రాష్ట్ర ప్రతినిధి పాలకుడుగా నుండెను. ఈ వంశములో హారీతిపుత్ర విహ్నుకుద చూతుకులానంద శాతకర్ణి, ఈతని కుమారుడు ధేనుసేన, కుమార్తె నాగ మూలానిక వీరందరు 3 వ శాతాబ్దిని వనవాసిలో (మైసూరు ప్రాంతం) పాలకులుగా వసించిరి.

ఆంధ్ర దేశమున ఇట్లు నాగులు ఆంధ్రులలో లీనమగుచున్న కాలముననే మధుర దేశములోని పద్మావతీ ప్రాంతమున వారి రాజ్యములు వృద్ధిఅయినవి.అచట భీమనాగ, స్క్మదనాగ, బృహస్పతినాగ, దేవనాగ, విభునాగ, వ్యాఘ్రనాగ, గణపతినాగ, అను వారి నాణెములు ఈ ప్రాంతములలో దొరికినవి.వీరిలో భావనాగ, గణపతినాగ, భావసేనులు గుప్త రాజుల సామంతులుగా నున్నట్లు కనబడుచున్నది. ధారావర్షుడను నాగరాజు కులోత్తుంగచోడ చక్రవర్తి సామంతుదుగా నుండెను.ఈ బస్తరు ఇంద్రావతీ నదికిరుప్రక్కలా నున్నది.సా.శ..1065 సం.నాటికి ఈ నాగరాజులలో మధురాంతకదేవుడు, సోమేశ్వరదేవుడు అనువారు ప్రత్యర్థులుగా ఉండిరి. వీరిదేశములో కొంతభాగము గోండుభాష ఉంది.

మూలము

[మార్చు]
  • 1956 భారతి మాస పత్రిక.