గంధం నాగరాజు
గంధం నాగరాజు | |
---|---|
జననం | గంధం నాగరాజు ఆగష్టు 30, 1968 నరసరావుపేట, గుంటూరు జిల్లా |
మరణం | ఏప్రిల్ 27, 2011 |
నివాస ప్రాంతం | గుంటూరు జిల్లా నరసరావుపేట |
ప్రసిద్ధి | కథారచయిత, నవలాకారుడు, నాటక రచయిత |
తండ్రి | గంధం యాజ్ఞవల్క్య శర్మ |
గంధం నాగరాజు కథ, నవల, నాటక, సినిమా రచయిత.
జననం
[మార్చు]నాగరాజు 1968, ఆగస్టు 30న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సూర్యప్రకాశరావు, రాధరుక్మిణి దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే పెదనాన్న గారైన గంధం యాజ్ఞవల్క శర్మ ఈయన్ను దత్తత తీసుకున్నారు.
చదువు - ఉద్యోగం
[మార్చు]ఎం.సీ.హెచ్ కోర్సును పూర్తిచేసిన నాగరాజు కుంభంమెట్టు కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశారు.
రచనలు
[మార్చు]1990లో అపరాజిత కథతో రచనను ప్రారంభించారు.
కథలు
[మార్చు]- జన్మభూమి
- క్షమయాదరిత్రి
- కర్మయోగి
- సృష్టి
- రజ్జుసర్పభ్రాంతి,
- పునరావాసం
- తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క
- అపరాజిత
- ప్రియాంక
- జీవితానికో పుష్కరం
- వెంకటప్పయ్య
- ట్రామాకేర్
వంటి 18 కథలు[1]
నవలలు
[మార్చు]- పసిడిలంక
- స్థితప్రజ్ఞ
నాటకాలు
[మార్చు]- వలస
- రంగులరాట్నం
నాటికలు
[మార్చు]- ఆలోచించండి
- సత్యాగ్రహి
- పాదుకాస్వామ్యం
- చదువు
- శేషార్ధ్హం
- నోట్ దిస్ పాయింట్
- మిధ్యాబింబం
- నువ్వు ప్లస్ నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టూ పెళ్ళి
- డాకట్ర్ జోసఫ్ మరకతమణి
- అనంతం
ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.
ప్రచురణలు
[మార్చు]గంధం నాగరాజు నాటక సాహిత్యం
నాటరాజు రాసిన నాటక, నాటికలతో ప్రచురించబడిన గంధం నాగరాజు నాటక సాహిత్యం పుస్తకాలను 2023 మే 28న నరసరావుపేట ఉన్నత పాఠశాలలో సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆవిష్కరించాడు. నుండి ఇతను పేరిట రెండు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. నాగరాజు నాటకాలను దర్శకత్వం వహించి విరివిగా ప్రదర్శించిన దర్శక నట ప్రయోక్త ఎస్.ఎం. బాషా, తన 'మైమూన్ మకాన్ ఫౌండేషన్' ద్వారా నాగరాజు గ్రంధాలను ముద్రించి అందుబాటులోకి తెచ్చాడు.
సినిమారంగం
[మార్చు]రాగం చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీరంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. అటుతర్వాత బాణం,[2] బెట్టింగ్ బంగార్రాజు, ఓం శాంతి ఓం, గాయం-2, ఇంకోసారి, రాగం వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.
మరణం
[మార్చు]ఈయన 2011, ఏప్రిల్ 27న అనారోగ్యంతో మరణించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ కథానిలయం. "గంధం నాగరాజు". kathanilayam.com. Retrieved 26 October 2016.
- ↑ జురాన్ సినిమా. "బాణం- ఓ నాలుగు ముక్కలు". zurancinema.wordpress.com. Retrieved 26 October 2016.
- ↑ "గమ్యం సినిమా రచయిత గంధం నాగరాజు కన్నుమూత". telugu.oneindia.com. 2011-04-27. Archived from the original on 2024-02-14. Retrieved 2024-02-14.