Jump to content

సాయిమాధవ్ బుర్రా

వికీపీడియా నుండి
డా॥ సాయిమాధవ్‌ బుర్రా
జననండిసెంబర్ 16, 1973
వృత్తిరంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత.
జీవిత భాగస్వామిబుర్రా సీత
పిల్లలుబుర్రా మీనాక్షి, బుర్రా సాయి లక్ష్మి
తల్లిదండ్రులు

డా॥ సాయిమాధవ్‌ బుర్రా ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత.[1] కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణల రచయితగా పరిచయమయ్యాడు.[2]

జననం

[మార్చు]

సాయిమాధవ్‌, రంగస్థల నటులైన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, జయలక్ష్మి కుమారుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో 1973 డిసెంబర్ 16న జన్మించాడు.[3]

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

తల్లిదండ్రులిద్దరు రంగస్థల కళాకారులు అవడం, కళాకారుల కుటుంబంలో జన్మించడం సాయికి కలిసొచ్చింది. ఆరు సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర నాటకంలో లోహితాశ్యుడు పాత్ర ధరించాడు. హైస్కూల్ చదువులో స్కూల్ నాటకాల్లో నటించి, అందరి ప్రశంసలు అందుకున్నాడు. మయసభ దుర్యోధన ఏకపాత్రాభినయంలో మంచి పేరు సంపాదించాడు. తన మిత్రులతో కలిసి అభ్యుదయ కళాసాహితి అనే సంస్థను స్థాపించి, కళ్లు నాటికను ప్రదర్శించాడు.2019 లో కళలకాణాచి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి నాటకరంగానికి అనితరసాధ్యమైన సేవలు అందిస్తున్నాడు . అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా కొనసాగుతున్నాడు

నటించిన నాటకాలు - పాత్రలు

[మార్చు]
  1. హరిశ్చంద్ర - లోహితాశ్యుడు
  2. గడియారం
  3. కళ్లు
  4. అమ్మకానికో అబ్బాయి
  5. రేపేంది
  6. ఈనాడు
  7. వరవిక్రయం
  8. చరిత్ర పుటల్లో చెరగని మరకలు
  9. పుటుక్కు జరజర డుబుక్కుమే
  10. హిమజ్వాల
  11. మంచంమీద మనిషి
  12. పండగొచ్చింది
  13. నాకీపెళ్లొద్దు
  14. చెరసాల
  15. పోస్టర్

ఏకపాత్రలు

[మార్చు]
  1. దుర్యోధనుడు 
  2. అల్లూరి సీతారామ రాజు

రచన - దర్శకత్వం - నటన

[మార్చు]
  1. బ్రోచేవారెవరురా
  2. దాకలమూచి

రచన - నటన

[మార్చు]
  1. అద్దంలో చందమామ

సినీ ప్రస్థానం

[మార్చు]

రంగస్థలం నుండి సినిమారంగంలోకి ప్రవేశించి సినిమాలలో నటించడమేకాకుండా పాటలు, సంభాషణలు రాస్తున్నాడు.[4]ఇతను మాటలు రాసిన కంచె,మహానటి రెండు సినిమాలు భారతప్రభుత్వము వారిచే ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి

నటుడిగా

[మార్చు]
  1. రెండో కృష్ణుడు
  2. బాల ప్రపంచం
  3. గుంటూరు గుండమ్మ కథ

పాటల రచయితగా

[మార్చు]
  1. తాళికట్టుశుభవేళ (మూడు పాటలు)
  2. హైటెక్ స్టూడెంట్స్ (అన్ని పాటలు)
  3. శ్రీ సత్యనారాయణ స్వామి (మూడు పాటలు)
  4. కృష్ణం వందే జగద్గురుం (రెండు పాటలు)
  5. గౌతమి పుత్ర శాతకర్ణి (కథాగానం)

మాటల రచయితగా

[మార్చు]
  1. కృష్ణం వందే జగద్గురుం (2012)
  2. గోపాల గోపాల (2015)
  3. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
  4. కంచె (2015)
  5. రాజు గారి గది (2015)
  6. దొంగాట (2015)
  7. సర్దార్ గబ్బర్ సింగ్ (2016)
  8. గౌతమి పుత్ర శాతకర్ణి (2017)
  9. ఖైదీ నెంబర్ 150 (2017)
  10. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త (2017) 
  11. మనస్సుకి నచ్చింది (2018)
  12. మహానటి (2018)
  13. సాక్ష్యం (2018)
  14. శరభ 
  15. ఎన్.టి.ఆర్. కథానాయకుడు,
  16. ఎన్.టి.ఆర్. మహానాయకుడు 
  17. సైరా నరసింహారెడ్డి
  18. ఆర్.ఆర్.ఆర్.
  19. శ్రీకారం
  20. గమనం
  21. క్రాక్
  22. ది వారియర్
  23. కల్కి 2898 ఏ.డీ

టివీ రంగం

[మార్చు]

టెలీఫిల్మ్స్

[మార్చు]

నటుడిగా

  1. సీతాలు చదువు
  2. కొసమెరుపులు
  3. అమ్మకానికో అబ్బాయి
  4. గ్రీటింగ్ కార్డు
  5. పొదరిల్లు
  6. చీకట్లో చిరుదీపాలు

మాటల రచయితగా

  1. అభినంద
  2. అనంతం

కథ - టెలిప్లే - మాటలు - దర్శకత్వం

  1. మనసు చెప్పిన మాట

సీరియల్స్

[మార్చు]

కథ - స్క్రీన్ ప్లే - మాటలు

  1. పుత్తడి బొమ్మ
  2. శిఖరం
  3. నవ్వు నవ్వు
  4. సంబరాల రాంబాబు

మాటలు - పాటలు

  1. కల్యాణ తిలకం

స్క్రీన్ ప్లే - మాటలు

  1. రాధా కళ్యాణం

మాటల రచయితగా

  1. సీతామహాలక్ష్మీ
  2. సీఎం ఏఎమ్ టూ పిఎం

కథ - స్క్రీన్ ప్లే - మాటలు - పాటలు

  1. తాళి కట్టు శుభవేళ
  2. స్వాతి చినుకులు
  3. ఇద్దరమ్మాయిలు

అవార్డులు

[మార్చు]

1.2010 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పుత్తడిబొమ్మ డైలీసీరియల్ కి ఉత్తమస్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డ్ .

2.2015 సవత్సరానికి టివిరంగంలో సీతామహాలక్ష్మి సీరియల్ కి ఉత్తమ మాటలరచయితగా నంది అవార్డ్ 3.2016 లోనే మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాకి ఉత్తమ మాటలరచయితగా నంది అవార్డ్ 4. న్యూ లైఫ్ ధియొలాజికల్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్

మూలాలు

[మార్చు]
  1. సాయిమాధవ్‌ బుర్రా, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 335.
  2. "సన్నివేశాలే సగం బలాన్నిచ్చాయి!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 4 January 2017. Retrieved 4 January 2017.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (27 March 2017). "చరిత్రలో నాకో పేజీ ఉండాలి: బుర్రా సాయిమాధవ్". Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  4. డైలీహంట్, ఈనాడు (4 November 2019). "ఇద్దరు హీరోలున్నా 'ఆర్‌ఆర్‌ఆర్‌' కథలో ఉన్నది అదే!" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2020. Retrieved 19 February 2020.