నార్త్ జోన్ మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
(నార్త్ జోన్ మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నార్త్ జోన్ మహిళల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్Harleen Deol
జట్టు సమాచారం
చరిత్ర
IZODC విజయాలు1
IZ3D విజయాలు1
IZT20 విజయాలు0
IZOD విజయాలు1

నార్త్ జోన్ (ఉత్తర మండలం) మహిళల క్రికెట్ జట్టు, ఉత్తర భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే మహిళల క్రికెట్ జట్టు. ఈ మహిళల సీనియర్ ఇంటర్ జోనల్ (అంతర మండల) జట్టు ఒక రోజు, T20 పోటీలలో ఆడుతుంది. ఇది ఉత్తర భారతదేశానికి చెందిన ఐదు జట్ల నుండి ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్టు. అవి - ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్. ఈ జట్టును రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి 1974-75లో ఏర్పాటు చేసారు. ఈ పోటీలు పూర్తి అయ్యేవరకు అంటే 2002-03 వ సం. వరకు ఈ పోటీలు ఆడారు. వారు 2011-12లో ఒక రోజు పోటీలో పాల్గొని గెలిచారు, ఆపై 2017-18లో మూడు రోజుల పోటీలో టోర్నమెంట్ చివరి ఎడిషన్‌ను గెలుచుకున్నారు. వారు 2022–23లో ఒక రోజు ఆట ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్నారు.[1]

చరిత్ర

[మార్చు]

ఉత్తర మండల మహిళల క్రికెట్ జట్టు మొదటగా రాణి ఝాన్సీ ట్రోఫీ కొరకు 1974–75 సీజన్‌లో లిస్ట్ A తరపున పోటీలో ఆడింది. ఈ జట్టు పోటీలను 2002-03 సీజన్ తర్వాత రద్దు అయ్యే వరకు ఆడింది. కానీ ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు. 2007లో నార్త్ జోన్ జట్టు ఒక రోజు పోటీలో 2006-07 నుండి 2013-14 వరకు టోర్నమెంట్ లు ఆడింది.[2] 2011–12లో, నార్త్ జోన్ జట్టు తమ నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు 2011–12లో ఒకసారి టైటిల్‌ను గెలుచుకుని సెంట్రల్ జోన్ విజయ పరంపరను అడ్డుకుంది. మిగిలిన 7 టైటిళ్లను సెంట్రల్ జోన్ జట్టు గెలుచుకుంది.[3]

2014–15 సీజన్‌లో, జోనల్ జట్లు మహిళల రెండు రోజుల పోటీలో పాల్గొన్నాయి.తరువాతి సీజన్‌లో మూడు-రోజుల పోటీలలో దక్షిణ మండల (సౌత్ జోన్‌) జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది.[4][5] 2017–18లో, నార్త్ జోన్ మొదటి మూడు-రోజుల టైటిల్‌ను గెలుచుకుంది. సెంట్రల్ జోన్ జట్టు వరుసగా మూడు సార్లు గెలిచింది. నాలుగు మ్యాచ్‌ నుంచి రెండు సార్లు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.[6]

2022–23లో, మహిళల సీనియర్ T20 జోనల్ క్రికెట్ టోర్నమెంట్[7] మొదటి ఎడిషన్‌లో ఉత్తర మండల జట్టు ఆరు జట్లలో నాల్గవ స్థానంలో నిలిచింది.[8] 2023 ఫిబ్రవరిలో, 2022–23 మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలో ఉత్తర మండల జట్టు విజయం సాధించి వారి సముదాయంలో అగ్రస్థానంలో నిలిచింది. చివరి రోజు ఆటలో కేంద్ర మండల జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది [9]

ఆటగాళ్ళ బృందం

[మార్చు]

2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ టోపీ (క్యాప్‌)లు ఉంటాయి.[10][11]

పేరు జాతీయత దేశీయ జట్టు వివరాలు
హర్లీన్ డియోల్  భారతదేశం హిమాచల్ ప్రదేశ్ నాయకురాలు
కనికా అహుజా  భారతదేశం పంజాబ్
అనీషా అన్సారీ  భారతదేశం హిమాచల్ ప్రదేశ్
సిమ్రాన్ బహదూర్  భారతదేశం ఢిల్లీ
తానియా భాటియా  భారతదేశం పంజాబ్ వికెట్ కీపర్
నికితా చౌహాన్  భారతదేశం హిమాచల్ ప్రదేశ్
నీనా చౌదరి  భారతదేశం హిమాచల్ ప్రదేశ్
సరళా దేవి  భారతదేశం జమ్మూ కాశ్మీర్
సుమన్ గులియా  భారతదేశం హర్యానా
శివంతి గుప్తా  భారతదేశం జమ్మూ కాశ్మీర్
అమన్‌దీప్ కౌర్  భారతదేశం హర్యానా
అమంజోత్ కౌర్  భారతదేశం పంజాబ్
కోమల్‌ప్రీత్ కౌర్  భారతదేశం పంజాబ్
సంధ్యా కుమారి  భారతదేశం జార్ఖండ్
సుస్మితా కుమారి  భారతదేశం హిమాచల్ ప్రదేశ్
సోనియా లోహియా  భారతదేశం ఢిల్లీ
ప్రియా మిశ్రా  భారతదేశం ఢిల్లీ
మోనికా పాండే  భారతదేశం చండీగఢ్
ప్రియా పునియా  భారతదేశం ఢిల్లీ
శీతల్ రానా  భారతదేశం హర్యానా
ప్రతీకా రావల్  భారతదేశం ఢిల్లీ
నందనీ శర్మ  భారతదేశం చండీగఢ్
నీతూ సింగ్  భారతదేశం పంజాబ్
పరునికా సిసోడియా  భారతదేశం ఢిల్లీ
రీమా సిసోడియా  భారతదేశం హర్యానా
రుబియా సయ్యద్  భారతదేశం జమ్మూ కాశ్మీర్
అంజు తోమర్  భారతదేశం జమ్మూ కాశ్మీర్
సుష్మా వర్మ  భారతదేశం హిమాచల్ ప్రదేశ్ వికెట్ కీపర్
లక్ష్మి యాదవ్  భారతదేశం ఢిల్లీ

సీజన్స్

[మార్చు]

మహిళల అంతర మండల మూడు రోజుల పోటీలు

[మార్చు]
సీజన్ లీగ్ స్టాండింగ్‌లు [12] గమనికలు
P W L DWF DLF ND BP Pts Pos
2014–15 4 0 0 1 2 1 0 6 3వ
2015–16 4 0 1 0 3 0 0 3 5వ
2016–17 4 1 0 0 3 0 0 9 3వ
2017–18 4 2 2 0 0 0 1 19 1వ విజేతలు

మహిళల సీనియర్ అంతర మండల T20 పోటీలు

[మార్చు]
సీజన్ లీగ్ స్టాండింగ్‌లు గమనికలు
P W L T NR NRR Pts Pos
2022–23 5 2 3 0 0 +0.630 8 4వ

మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలు

[మార్చు]
సీజన్ లీగ్ స్టాండింగ్‌లు గమనికలు
P W L T NR NRR Pts Pos
2022–23 5 5 0 0 0 +1.107 20 1వ ఛాంపియన్స్

గౌరవాలు

[మార్చు]
  • అంతర మండల మహిళల ఒక రోజు పోటీలు :
    • విజేతలు (1): 2011–12
  • సీనియర్ మహిళల క్రికెట్ అంతర మండల మూడు రోజుల గేమ్ :
    • విజేతలు (1): 2017–18
  • మహిళల సీనియర్ అంతర మండల T20 :
    • విజేతలు (0):
    • ఉత్తమ ముగింపు: 4వ ( 2022–23 )
  • మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు :
    • విజేతలు (1): 2022–23

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Team Profile: North Zone Women". CricketArchive. Retrieved 25 July 2021.
  2. "Women's List A Matches Played by North Zone Women". CricketArchive. Retrieved 29 July 2021.
  3. "Inter Zone Women's One Day Competition 2011/12". CricketArchive. Retrieved 29 July 2021.
  4. "Inter Zone Women's Three Day Competition 2016/17". CricketArchive. Retrieved 29 July 2021.
  5. "North Zone Women v South Zone Women, 5, 6, 7 March 2017". CricketArchive. Retrieved 29 July 2021.
  6. "Inter Zone Women's Three Day Competition 2017/18". CricketArchive. Retrieved 29 July 2021.
  7. "Senior Women's Inter Zonal T20 Trophy 2022: Full squads, Fixtures & Preview: All you need to know". CricketWorld. 7 November 2022. Retrieved 9 November 2022.
  8. "Senior Women's Inter Zonal T20". BCCI. Retrieved 17 November 2022.
  9. "Senior Women's Inter Zonal One Day". BCCI. Retrieved 22 February 2023.
  10. "Senior Women's Inter Zonal T20 Trophy 2022: Full squads, Fixtures & Preview: All you need to know". CricketWorld. 7 November 2022. Retrieved 9 November 2022.
  11. "Senior Women's Inter Zonal One Day Trophy, 2023/Squads". Cricket.com. Retrieved 22 February 2023.
  12. "Women's First-Class Matches Played by North Zone Women". Retrieved 29 July 2021.