నిహార్ రంజన్ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిహార్ రంజన్ గుప్తా
జననం(1911-06-06)1911 జూన్ 6
లోహగరా, నరైల్ జిల్లా, బంగ్లాదేశ్
మరణం1986 ఫిబ్రవరి 20(1986-02-20) (వయసు 74)
వృత్తిచర్మవ్యాధి నిపుణుడు, నవలా-స్క్రీన్ ప్లే రచయిత

నిహార్ రంజన్ గుప్తా (1911, జూన్ 6 - 1986, ఫిబ్రవరి 20) పశ్చిమ బెంగాల్ కు చెందిన చర్మవ్యాధి నిపుణుడు, ప్రముఖ బెంగాలీ నవలా-స్క్రీన్ ప్లే రచయిత. కల్పిత డిటెక్టివ్ పాత్ర కిరీటి రాయ్ సృష్టికర్త. అతని రచనలు కొన్ని బెంగాల్, బాలీవుడ్ సినిమాలుగా రూపొందించబడ్డాయి.[1]

జననం, విద్య

[మార్చు]

గుప్తా 1911, జూన్ 6న సత్య రంజన్ గుప్తా - లబంగలతా దేవి దంపతులకు బంగ్లాదేశ్‌, నరైల్ జిల్లాలోని లోహగరాలో జన్మించాడు. 1930లో కొన్నార్ హైస్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. కళాశాలలో చదువుతుండగా అక్క తేలు కుట్టడంతో మరణించింది. అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయడానికి వైద్యశాస్త్రాలలో ఉన్నత డిగ్రీని సంపాదిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

వృత్తిరంగం

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీ డాక్టర్‌గా పనిచేసిన గుప్తా, చిట్టగాంగ్, బర్మా, ఈజిప్ట్‌తోపాటు పలు ప్రాంతాలకు బదిలీ చేయబడ్డాడు. యుద్ధం తర్వాత అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు, డెర్మటాలజీలో ప్రత్యేకత కలిగి ఉన్న గుప్తా, తిరిగి రాగానే కలకత్తా వైద్య కళాశాలలో చేరాడు. వైద్యుడిగా అతని కెరీర్‌లో అతను భారతదేశంలోని అనేక ఆసుపత్రులతో సంబంధం కలిగి ఉన్నాడు. విభజన తర్వాత, అతని కుటుంబం 1947లో శాశ్వతంగా కోల్‌కతాకు వలస వచ్చింది.

చిన్నతనం నుండే రచయిత కావాలని కలలు కన్న గుప్తా, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశీస్సులు పొందేందుకు శాంతినికేతన్ వెళ్ళి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. [1] పద్దెనిమిదేళ్ళ వయసులో తన మొదటి నవల రాజ్‌కుమార్‌ను ప్రచురించాడు. పాఠశాల విద్య తర్వాత కలకత్తా వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో అతను డిటెక్టివ్ కథలపై ఆసక్తిని పెంచుకున్నాడు, అగాథా క్రిస్టీని కలుసుకున్నాడు.[1] తన సాహిత్య జీవితంలో రెండు వందలకు పైగా నవలలు, నాటకాలు, చిన్న కథలు, వ్యాసాలు రాశాడు. వాటిలో ఉల్కా, బాద్షా, లలుభులు, ఉత్తరఫాల్గుణి, అస్తి భాగీరథి టైర్, మయూర్ మహల్, దేవయాని, నీలతార, మాయామృగ, కోమలగంధర్, నిషిపద్మ అత్యంత ప్రసిద్ధమైనవి. ఇతడు రాసిన నలభై ఐదు నవలలు వరుసగా టాలీవుడ్, బాలీవుడ్‌లో బెంగాలీ, హిందీ సినిమాలుగా రూపొందించబడ్డాయి.[2] సాబుజ్ సాహిత్య అనే పిల్లల పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశాడు.[1]

స్వీకరించబడిన రచనలు

[మార్చు]
 • మాయమృగ (1960)
 • తై కరులు (1962) [తయిన్ కరుణై (తమిళం)గా పునర్నిర్మించబడింది]- ఉల్కా[3]
 • అన్నై (1962) [1960 బెంగాలీ చిత్రం మాయమృగ రీమేక్]
 • మేరీ సూరత్ తేరీ అంఖేన్ (1963) – ఉల్కా[4]
 • ఉత్తర ఫల్గుణి (1963) (మమత, కావ్య తలైవి, పుష్పాంజలిగా పునర్నిర్మించబడింది) [5]
 • బాద్షా (1963)
 • తపశి (బెంగాలీ -1965)
 • లాడ్లా (1966) (1960 బెంగాలీ చిత్రం మాయమృగ రీమేక్)
 • మేరే లాల్ (1966) (బెంగాలీ చిత్రం బాద్షాకు రీమేక్)
 • నై రోష్ని (1967) (పూవుం పొట్టుం, పుణ్యవతిగా పునర్నిర్మించబడింది)
 • దైవ మగన్ (1969) [తాయీ మమతే (కన్నడ), రక్త సంబంధం (తెలుగు)] - ఉల్కా
 • దేవర కన్ను (1975) [అన్నన్ ఒరు కోయిల్, ఎల్లం నినక్కు వెండి, బంగారు చెల్లెలు (తెలుగు)గా పునర్నిర్మించబడింది]
 • దో అంజానే (1976) (మావారి మంచితనం, ఆసేయ బలేగా పునర్నిర్మించబడింది)– రాత్రి యాత్రి[6]
 • కలంకిణి కంకబాటి (1981)[7]
 • లాలూ భూలు (1983)
 • కిరీటి ఓ కలో బ్రోమోర్ (2016)
 • కిరీటి రాయ్ (2016)
 • ఎబాంగ్ కిరీటి (2017)
 • నిలచొలే కిరీటి (2018)

మరణం

[మార్చు]

ఇతడు 1986, ఫిబ్రవరి 20న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించాడు.

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 "Kolkatar Kadcha". Anandabazar Patrika. 27 June 2011. p. 4.
 2. "Nihar Ranjan Gupta's birth anniversary observed". The Daily Star. 8 June 2009. Retrieved 2023-07-21.
 3. "Tiger Prabhakar Tragic Story | Cinema Swarasyagalu Ep-17 | Hariharapura Manjuanth". YouTube.
 4. "Meri Surat Teri Ankhen (1963)". The Hindu. Retrieved 2023-07-21.
 5. "Blast From The Past: Mamta (1966)". The Hindu. 2 April 2010. Archived from the original on 29 October 2013. Retrieved 2023-07-21.
 6. "Rekha breaks her silence". The Hindu. 8 October 2010. Retrieved 2023-07-21.
 7. "Book - Kalankini Kankabati - Niharranjan Gupta". Calcuttaweb Shopping (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-16. Retrieved 2023-07-21.

బయటి లింకులు

[మార్చు]