Jump to content

నీలం రాజశేఖరరెడ్డి

వికీపీడియా నుండి
నీలం రాజశేఖరరెడ్డి
జననంనీలం రాజశేఖరరెడ్డి
1918
అనంతపురం దగ్గర ఇల్లూరు
మరణం1994 డిసెంబరు 13
ప్రసిద్ధిభారతీయ కమ్యూనిస్టు నేత
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
తండ్రినీలం చిన్నపరెడ్డి,
తల్లిసుబ్బమ్మ

నీలం రాజశేఖరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు. 1918లో అనంతపురం దగ్గర ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు కల్లూరు సుబ్బారావు బెనారస్ జాతీయ కళాశాలలో రాజశేఖరరెడ్డిని, తరిమెల నాగిరెడ్డిని చేర్పించారు. మానవునికున్న ఆస్తిలో కెల్లా ప్రియమైనది జీవితమే! అలాంటి జీవితాన్ని గడిపే అవకాశం మనిషికి ఒకసారి మాత్రమే లభిస్తుంది. మానవజాతి విముక్తికోసం నా జీవితాన్ని వినియోగించాను అని సంతృప్తి పడగల జీవితాన్ని ప్రతి మానవుడూ గడపాలి- అన్న లెనిన్ మాటలు నీలానికి ఆదర్శం. 1943 జనవరిలో అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రథమ కార్యదర్శిగా అతను ఎన్నికయ్యారు. 1946లో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర రాశారు. 1938లో కమ్యూనిస్టు పార్టీలో చేరి మూడు సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. 1941-42లో యుద్ధాన్ని వ్యతిరేకరించినందుకు, యుద్ధ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసినందుకు రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం. ఆగ్రా సెంట్రల్ జైలు, బెనారస్ జిల్లా జైలు, చెరైలీ సెంట్రల్ జైలు, రాజమండ్రి, ఆలీపూర్, వెల్లూరు... ఇలా దేశంలో ప్రసిద్ధి పొందిన అన్ని జైళ్లల్లోనూ బందీ అయ్యారు. అతను ఆస్తిని 1952 ప్రాంతాల్లో పోలీసులు జప్తు చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నీలం తన యావదాస్తిని కమ్యూనిస్టు ఉద్యమానికే దానం చేశారు. చండ్ర రాజేశ్వరరావు, తమ్మారెడ్డి సత్యనారాయణ ల పేరుతో ఏర్పాటైన ట్రస్టులకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1994 డిసెంబరు 13న నీలం కన్నుమూశారు.

చండ్ర రాజేశ్వరరావు పౌండేషను మార్కిస్టు అధ్యయనానికి హైదరాబాదు శివార్లలోని కొండాపూర్లో ఏర్పాటుచేసిన పరిశోధనా కేంద్రానికి రాజశేఖరరెడ్డి స్మృత్యర్ధం "నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం" అని పేరుపెట్టారు.[1]

మూలాలు

[మార్చు]
  1. Research centre on Marxist studies Archived 2005-08-16 at the Wayback Machine - The Hindu సెప్టెంబరు 28, 2002