నేనే రాజు నేనే మంత్రి
నేనే రాజు నేనే మంత్రి (2017 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తేజ |
---|---|
తారాగణం | రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్ థ్రెసా |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నేనే రాజు నేనే మంత్రి 2017లో విడుదలైన ఒక తెలుగు సినిమా.[1]
కథ
[మార్చు]జోగేంద్ర(రానా దగ్గుబాటి)కి తన ఇల్లాలు రాధ(కాజల్ అగర్వాల్) అంటే ఎంతో ఇష్టం. సొంత వూరిలో వడ్డీ వ్యాపారం చేసుకొనే జోగేంద్రకు తన భార్యే ప్రాణం, తానే లోకం. జోగేంద్రతో పెళ్లైన మూడేళ్ల తరువాత రాధ గర్భవతి అవుతుంది. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలబడదు. ఊరి సర్పంచ్ (ప్రదీప్ రావత్) భార్యతో జరిగిన గొడవలో రాధకు గర్భస్రావం జరుగుతుంది. సర్పంచ్ మీద పగ తీర్చుకోవాలని భావించిన జోగేంద్ర అదే సర్పంచ్ కు పోటీగా ఎన్నికల్లో నిలబడి గెలుస్తాడు. అలాగే ఒకానొక సందర్భంలో తన భార్య గురించి చెడ్డగా మాట్లాడిన ఎమ్మెల్యేను చంపి, మళ్ళీ అదే పదవికి పోటీ చేసి తానే ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఒక రాష్ట్ర మంత్రి బలం ముందు ఎమ్మెల్యే బలం చాలటం లేదన్న ఆగ్రహంతో తానే మంత్రి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఇంకా పై పదవి పొందాలన్న ఆలోచిస్తున్న సందర్భంలో, ఎలాగైన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ జోగేంద్రకు కలుగుతుంది. ఈ పరుగులో అసలు తాను ఇదంతా ఎందుకు మొదలుపెట్టాడో మర్చిపోతాడు. రాధ ప్రేమను పక్కన పెట్టి ఎలాగైన సీఎం అవ్వటమే లక్ష్యంగా అక్రమాలు చేస్తుంటాడు. అందుకు ఒక టీవి రిపోర్టర్ సహాయం కూడా తీసుకుంటాడు. అయితే రాధ చనిపోవటంతో జోగేంద్రలో పశ్చాత్తాపం కలిగి, ప్రజల మనసు దోచుకొనే ప్రజా ప్రతినిధిగా మారాలనుకుంటాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి, తన అనుయాయులను కూడా ప్రతీ నియోజకవర్గంలో పోటీకి నిలిపి ఆఖరికి గెలిచి ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయికి చేరతాడు. అయితే ఆఖరికి ఎమ్మెల్యేలలో అనేకమంది డబ్బుకి అమ్ముడైపోయి, వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే దశలో ఉండగా, వారినందరినీ హతమార్చి అరెస్టు అవుతాడు జోగేంద్ర. కోర్టు జోగేంద్రకు ఉరిశిక్ష విధిస్తుంది. అయితే ఆఖరికి ప్రజలందరూ ఏకమై న్యాయస్థానం మీద ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం శిక్షను నిలిపివేసి, పునః సమీక్ష కోసం కమిటీ వేస్తుంది. కాని జోగేంద్ర ఓటు హక్కు అంటే ఎవరికి పెడితే వారికి వేసే హక్కు కాదని, అది నిజాయతీతో కూడుకున్న ఒక నైతిక బాధ్యత అని చెప్పి తానే అందరి సమక్షంలో ఉరి వేసుకోవడంతో కథ ముగుస్తుంది.[2]
నట వర్గం
[మార్చు]- జోగేంద్ర గా రానా దగ్గుబాటి
- రాధ గా కాజల్
- దేవికా రాణి గా కేథరిన్ థ్రెసా
- సుబ్బారాయుడు గా అశుతోష్ రాణా
- పోసాని కృష్ణమురళి
- అజయ్
- శివ గా నవదీప్
- జోష్ రవి
- ముఖ్యమంత్రి గా తనికెళ్ల భరణి
- జయప్రకాశ్ రెడ్డి
- టిఎన్ఆర్
- కల్పలత
- శివాజీ రాజా
- ప్రియాంక నల్కారి
- సాయి కేతన్ రావు
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: డి.రామానాయుడు
- నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ పానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
- నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
పురస్కారాలు
[మార్చు]2017 సైమా అవార్డులు (తెలుగు)