Jump to content

నేలనూతల రామకృష్ణయ్య

వికీపీడియా నుండి
నేలనూతల రామకృష్ణయ్య
జననంఅక్టోబర్ 23, 1893
మరణంజూలై 27, 1974
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు
తల్లిదండ్రులువేమూరి రామమూర్తి, సీతారావమ్మ

నేలనూతల రామకృష్ణయ్య (అక్టోబర్ 23, 1893 - జూలై 27, 1974) ప్రముఖ రంగస్థల నటుడు. అభినవ నారద, ఆభినవ చాణక్య, ది కస్టోడియన్ ఆఫ్ ఓరియంటర్ ఆర్ట్స్ బిరుదాంకితుడు.[1]

జననం - ఉద్యోగం

[మార్చు]

రామకృష్ణయ్య 1893, అక్టోబర్ 23 న బంగారయ్య, పిచ్చమ్మ దంపతులకు నెల్లూరు లో జన్మించాడు. నెల్లూరులో విద్యాభ్యాసం చేసిన రామకృష్ణయ్య 1912 నుంచి పోలీసు, రైల్వే, జిల్లా కోర్టులలో పనిచేసి 1914 నుండి 1948వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

1909లో నెల్లూరు లిటరరీ క్లబ్ వారి బుద్ధిమతి విలాసం మహిమంతుడు పాత్రలో నటించి రంగస్థలంపై అడుగుపెట్టాడు. రాళ్ళపల్లి నటేశయ్య దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్నాడు. అనేక నాటకాలలో నటించాడు.

నటించిన పాత్రలు:

మరణం

[మార్చు]

రామకృష్ణయ్య 1974, జూలై 27న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.511.