పద్మప్రియ భళ్ళమూడి
పద్మప్రియ భళ్ళమూడి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | కృష్ణమూర్తి, కళ్యాణి |
బంధువులు | సిహెచ్. నటరాజ్ (భర్త), స్నిగ్ధ (కూతురు) |
పద్మప్రియ భళ్ళమూడి, తెలుగు నాటకరంగ నటి, దర్శకురాలు, అధ్యాపకురాలు. 1992లో నాటకరంగంపై అడుగుపెట్టిన పద్మప్రియ, దాదాపుగా 500లకు పైగా ప్రదర్శనల్లో పాల్గొని, అనేక బహుమతులను అందుకుంది. దాదాపు 25 నాటికలకు దర్శకత్వం వహించింది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]పద్మప్రియ 1979, ఆగస్టు 11న భళ్ళమూడి కృష్ణమూర్తి, కళ్యాణి దంపతులకు హైదరాబాదు లో జన్మించింది. డిగ్రీ (బి.కాం.) పూర్తిచేసిన పద్మప్రియ, కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని రంగస్థలశాఖలో ఎం.పి.ఏ. చదివింది. తెలుగు విశ్వవిద్యాలయంలో ‘రంగస్థల శిక్షణతో వ్యక్తిత్వ వికాసం’ అంశం మీద పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా అందుకుంది.
వివాహం - ఉద్యోగ జీవితం
[మార్చు]నటుడు, నట శిక్షకుడైన సిహెచ్. నటరాజ్ తో పద్మప్రియ వివాహం జరిగింది. వీరికి కూతురు (స్నిగ్ధ). పద్మప్రియ, తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో రంగస్థల అధ్యాపకురాలిగా (అసోసియేట్ ప్రొఫెసర్‌గా) పనిచేస్తున్నది.[2][3]
రంగస్థల ప్రస్థానం
[మార్చు]తన తల్లిదండ్రులిద్దరూ నాటకరంగ నటులవడంతో, పద్మప్రియ కూడా నాటకరంగానికి పరిచయయింది. ప్రసిద్ధ నాటక ఉద్యమకర్త ఎ.ఆర్. కృష్ణ గారింట్లోనే పద్మప్రియ బాల్యం గడిచింది. చిన్నతనంలోనే నాటకాల రిహార్సిల్స్ సమయంలో ఈమె కూడా డైలాగులు చెప్పడం ప్రాక్టీస్ చేస్తుండేది. 1992లో ఏడవ తరగతి చదువుతున్నపుడు ఎ.ఆర్. కృష్ణ నిర్వహించిన ఒక చిల్డ్రన్స్ థియేటర్ వర్క్‌షాప్ చేరి ‘మళ్లీ మళ్లీ పుడితే గిడితే’ నాటకంలో తొలిసారిగా నటించింది. తర్వాత పదో తరగతి చదువుతున్నపుడు ‘రసరంజని’ నిర్వాహకుల్లో ఒకరైన దుగ్గిరాల సోమేశ్వరరావు దర్శకత్వంలో ‘కాకి ఎంగిలి’ నాటకంలో కథానాయికిగా నటించింది. జేవీ రమణమూర్తి, మొదలి నాగభూషణశర్మ, కోట శంకర్రావుల దర్శకత్వంలో రాళ్లపల్లి, సుత్తివేలు, పీజేశర్మ, సాక్షి రంగారావు, తనికెళ్ల భరణి, జేవీ సోమయాజులు, రఘుబాబు తదితర ప్రముఖులతో కలిసి నటించింది. నటిగా నాలుగుసార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నది.[1]
నటించినవి
[మార్చు]- శ్రీనాథుడు (నాటకం)[4]
- కాగితం పులి
- చరమాంకం
- కాకిఎంగిలి
- క్రాస్ రోడ్స్
- ఎయిర్ ఇండియా
- వలయం
- సరిహద్దు
- బొమ్మ
- ప్రతిస్పందన
- అనగనగా ఒకరోజు
- నాటకాంతం
- అనగనగా ఒక అమ్మాయి
- నాగమండలం
- అగ్నివర్షం
- అంధయుగం
- అరక్త్ క్షణ్
- అమరావతి కథలు
- వేమన
- బొబ్బలియుద్ధం
- కప్పలు
- సుందరీసుందరుడు
- కళ్యాణి
- గబ్బర్ సింగ్
- చీమ కుట్టిన నాటకం
- గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్
దర్శకత్వం చేసినవి
[మార్చు]- మాయ
- ఆంటిగనీ
- పెన్‌స్ట్రోక్[5]
- కాగితం పులి
- కౌముదీ మహోత్సవం
- త్యాగమయి
- కుందేటి కొమ్ము
- కలహాల కాపురం
- కట్టుబానిస
- శాంతి
- మనస్తత్వాలు
- మోరియా
- అంతర్యుద్ధం
బహుమతులు
[మార్చు]నాలుగుసార్లు నంది బహుమతి అందుకున్న పద్మప్రియ వివిధ పోటీలలో 50కి పైగా ఉత్తమ నటి బహుమతులను అందుకుంది.
- ఉత్తమ నటి - (సాంఘిక నాటిక) - నంది నాటక పరిషత్తు - 2004
- ఉత్తమ హాస్యనటి - గబ్బర్ సింగ్ (సాంఘిక నాటిక) - నంది నాటక పరిషత్తు - 2013
ఇతర బహుమతులు:
- ఉత్తమ నటి - కళ్లు (నాటిక) - జాతీయ పురస్కారం
- జవ్వాది రంగస్థల పురస్కారం
టీవిరంగ ప్రస్థానం
[మార్చు]1995లో జె.వి. సోమయాజులు దర్శకత్వంలో లఘుచిత్రంలో నటించడం జరిగింది. దూరదర్శన్ లో వచ్చిన కన్యాశుల్కం ధారావాహిక ద్వారా టీవిరంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత లేడి డిటెక్టీవ్, ఇంటింటి రామాయణం, పల్నాటి వీరభారతం, ఆలుమగలు, బంధం, ఆశ వంటి ఈటీవి, జెమినీ టీవీ ఛానల్స్ ధారావాహికల్లో నటించింది.
పురస్కారాలు
[మార్చు]- మహిళ శిరోమణి పురస్కారం - భారత్ కల్చరల్ అకాడమీ, రవీంద్రభారతి, హైదరాబాద్, 2018 మార్చి 14.[6]
ఇతర వివరాలు
[మార్చు]- తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల కళలశాఖలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ
- తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల శాఖాధిపతి పదవిని చేపట్టిన మొదటి మహిళ
- తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల కళల్లో నెట్ (అర్హత పరీక్ష) పొందిన మొదటి మహిళ
- తెలుగు రాష్ట్రాలనుండి రంగస్థల కళలశాఖలో బంగారు పతకం సాధించిన మొదటి మహిళ
- యునైటెడ్ స్టేట్స్ లో శ్రీనాథుడు నాటకాన్ని 24 ప్రదర్శనలు ఇచ్చింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ABN (2024-03-25). "డైలాగ్ రాక్షసి అని పిలిచేవారు". Andhrajyothy Telugu News. Archived from the original on 2024-03-25. Retrieved 2024-03-25.
- ↑ ప్రజాశక్తి. "కళాకారులు ప్రభుత్వాన్ని యాచించవద్దు". Archived from the original on 27 మార్చి 2019. Retrieved 11 August 2017.
- ↑ నవతెలంగాణ. "తెలుగు వర్సిటీలో ఆకట్టుకున్న నాటకాలు". Archived from the original on 3 జూలై 2022. Retrieved 11 August 2017.
- ↑ నమస్తే తెలంగాణ. "నాటకం సమస్యకు పరిష్కారం కావాలి". Retrieved 11 August 2017.[permanent dead link]
- ↑ ప్రజాశక్తి. "తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 1 డిసెంబరు 2016. Retrieved 11 August 2017.
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు (14 March 2018). "పురస్కారాల ప్రదానం". Retrieved 16 March 2018.[permanent dead link]
ఇతర లింకులు
[మార్చు]- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using ethnicity
- Infobox person using residence
- Pages using div col with unknown parameters
- 1979 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు రంగస్థల కళాకారులు
- తెలుగు రంగస్థల నటీమణులు
- టెలివిజన్ నటీమణులు
- హైదరాబాదు రంగస్థల నటీమణులు
- తెలుగు రంగస్థల దర్శకులు