పాంగ్ సరస్సు
మహారణా ప్రతాప్ సాగర్ పాంగ్ సరస్సు | |
---|---|
ప్రదేశం | కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 32°01′N 76°05′E / 32.017°N 76.083°E |
రకం | రిజర్వాయర్ |
పరీవాహక విస్తీర్ణం | 12,561 కి.మీ2 (4,850 చ. మై.) |
గరిష్ట పొడవు | 42 కిలోమీటర్లు (26 మై.) |
గరిష్ట వెడల్పు | 2 కిలోమీటర్లు (1.2 మై.) |
గరిష్ట లోతు | 97.84 మీ. (321.0 అ.) |
ఉపరితల ఎత్తు | 436 మీ. (1,430.4 అ.) |
పాంగ్ సరస్సు లేదా పాంగ్ రిజర్వాయర్ ను మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా పిలుస్తారు. దీనిని 1975లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలోని డెహ్రా గోపిపూర్ డివిజన్ లో గల శివాలిక్ పర్వతాలలోని చిత్తడి నేలలలో బియాస్ నదిపై నిర్మించారు. మహారాణా ప్రతాప్ గౌరవార్థం ఈ సరస్సుకు అతడి పేరు పెట్టారు.[1][2]
ప్రత్యేకత
[మార్చు]ఈ సరస్సు ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం రామ్‌సర్ కన్వెన్షన్ భారతదేశంలో ప్రకటించిన 27 అంతర్జాతీయ చిత్తడి నేలలలో ఒకటి. ఈ జలాశయం 24,529 హెక్టార్ల (60,610 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది.[3]
వివిధ ప్రాంతాల నుంచి దూరం
[మార్చు]- సిమ్లా నుండి దూరం - 233.2 కిమీ (144.9 మైళ్ళు)
- చంఢీగర్ నుండి దూరం - 272.9 కిమీ (169.5 మైళ్ళు)
- అమృత్ సర్ నుండి దూరం - 110 కిమీ (68.4 మైళ్ళు)
- ధర్మశాల నుండి దూరం - 55 కిమీ (34.2 మైళ్ళు)
- కాంగ్రా నుండి దూరం - 50 కిమీ (31.1 మైళ్ళు)
- చింతపూర్ణి నుండి దూరం - 18 కిమీ (11.3 మైళ్ళు)
- జ్వాలాముఖి నుండి దూరం - 12 కి.మీ (7.45 మీ)[4]
దేవాలయాలు
[మార్చు]కాంగ్రా జిల్లాలోని జవాలి నుండి 7 కిలోమీటర్ల దూరంలో, పురాతన, ప్రత్యేకమైన, ఎత్తైన దేవాలయాలు ఉన్నాయి. శివుడు, పార్వతి కొలువైన ఈ దేవాలయాలను మాహారాణా ప్రతాప్ నిర్మించాడు. ఈ దేవాలయాలు సంవత్సరంలో ఎనిమిది నెలలు నీటిలో మునిగిపోయి, మార్చి నుండి జూన్ వరకు మాత్రమే కనబడుతాయి.[5]
నీటి క్రీడా కేంద్రం
[మార్చు]పాంగ్ డ్యామ్ రిజర్వాయర్‌లో ప్రాంతీయ నీటి-క్రీడా కేంద్రం స్థాపించబడింది. ఇది ఈతతో పాటు కానోయింగ్, రోయింగ్, సెయిలింగ్, వాటర్ స్కీయింగ్ వంటి వాటి శిక్షణను అందిస్తుంది. ప్రాథమిక కోర్సు, ఇంటర్మీడియట్ కోర్సు, అధునాతన కోర్సు అని మూడు స్థాయిల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Ramsar Sites Database", web: RS6, 2002.
- ↑ "Pong Dam Lake Ramsar Site details" Archived 29 జూన్ 2015 at the Wayback Machine, World66.com.
- ↑ "Pong Dam lake gets Ramsar site status", Tribuneindia.com, 2003.
- ↑ http://cwc.nic.in/main/webpages/projects.html Archived 23 సెప్టెంబరు 2015 at the Wayback Machine. Information on some major projects Central Water Commission
- ↑ http://bbmb.gov.in/english/pong_tourism.asp Pong Dam
- ↑ "World Wetland Day" (PDF). Archived from the original (PDF) on 11 February 2012. Retrieved 12 November 2008.