పాలవలస రాజశేఖరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలవలస రాజశేఖరం
పాలవలస రాజశేఖరం


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994-1999
ముందు కిమిడి కళా వెంకటరావు
తరువాత కిమిడి గణపతిరావు
నియోజకవర్గం ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947[1]
పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సంగంనాయుడు
జీవిత భాగస్వామి ఇందుమతి
సంతానం పాలవసల విక్రాంత్‌, రెడ్డి శాంతి
నివాసం పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం బి.యస్సీ ఆనర్స్
మతం హిందూ మతము

పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. అతను శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా, భారతదేశ రాజ్యసభ పార్లమెంటు సభ్యునిగా పని చేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను శ్రీకాకుళం జిల్లా పాలకొండ కు చెందిన వాడు. అతని తండ్రి పాలవలస సంగంనాయుడు 1962-67 మధ్య కాలంలో ఉనుకూరు శాసనసభ్యునిగా పనిచేసాడు. రాజశేఖరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.యస్సీ ఆనర్స్ చేసాడు. అతను సర్పంచి పదవి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్లమెంటు సభ్యుని స్థాయి వరకు చేరాడు. వీరఘట్టం మండలం నీలానగరం సర్పంచిగా 1970-74 మధ్య పని చేశాడు. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా 1974 నుండి 1976 వరకు పనిచేసాడు. 1976లో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టాడు[2]. 1992-94ల మధ్యకాలంలో డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేసాడు. 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు. 1994 నుండి 1999 వరకు శాసన సభ్యునిగా ఉన్నాడు. 2006 నుండి 2011 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్తు అధ్యక్షునిగా సేవలందించాడు.[3]

అతను 2011 జూన్ 26న తన అనుచరులతో కలసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతని సతీమణి ఇందుమతి. అతని కుమారుడు పాలవసల విక్రాంత్‌, కుమార్తె రెడ్డి శాంతి. [5] శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పాలవలస విక్రాంత్ పనిచేస్తున్నాడు.[6] అతను కుమార్తె రెడ్డి శాంతి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కలమట వెంకటరమణ మూర్తి పై విజయం సాధించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Affidavit". affidavitarchive.nic.in. Retrieved 2021-06-13.
  2. Official debates of Rajya sabha. "Parliament of India". rsdebate.nic.in.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "ఇదీ సంగతి: ఇంట గెలిచి... అంతెత్తుకు ఎదిగి!!". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-06-13.
  4. "ZP chairman joins YSR Congress". The New Indian Express. Retrieved 2021-06-13.
  5. "సిక్కోలులో రూ. 5 కోట్ల మిస్టరీ..! వైసీపీ నేతను వదిలేశారేంటి..?". తెలుగు360 (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-06. Retrieved 2021-06-13.
  6. "సిక్కోలు డిసిసిబి పీఠంపై పాల‌వ‌ల‌స‌". eeroju. Archived from the original on 2021-06-13. Retrieved 2021-06-13.
  7. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.