ఉణుకూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉనుకూరు, శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము.[1].

ఉణుకూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం రేగిడి ఆమదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,597
 - పురుషుల సంఖ్య 814
 - స్త్రీల సంఖ్య 783
 - గృహాల సంఖ్య 390
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1, 597 - పురుషుల సంఖ్య 814 - స్త్రీల సంఖ్య 783 - గృహాల సంఖ్య 390

మూలాలు[మార్చు]

ఉణుకూరు నియోజక వర్గం[మార్చు]

1955లో ఉణుకూరు నియోజకవర్గము ఏర్పాటైనది. రాజాంకి చెందిన సి. ఎస్. రంగనాయకులు మొట్టమొదటి ఎమ్.ఎల్.ఎ.గా ప్రాతినిధ్యము వహించారు. ఉణుకూరు చరిత్రలో రాజాం పట్నం నుండి ఎన్నికైన ఏకైక శాసనసభ్యునిగా ఆయనిప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు. అనంతరము 1962 లో పాలకొండ ప్రాంతానికి చెందిన పాలవలస సంగంనాయుడు, 1967 లో విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లక్కనాపురం గ్రామానికి చెందిన ఎం.బి.పరాంకుశం, 1972 లో పాలవలస రుక్మిణమ్మ, 1978లో మరల పరాంకుశం ప్రాతినిధ్యం వహించారు. వీరందరూ కూడా స్థానికేతరులు కావడం విశేషం. 1983 లో కిమిడి కళా వెంకటరావు, 1985, 1989, ఎన్నికల్లో సహితం ఆయనే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1994 లో స్థానికేతరుడైన పాలవలస రాజశేఖరం, 1999లో డా. కిమిడి గణపతిరావు, 2004 లో మరలా కిమిడి కళా వెంకటరావు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఒక కుగ్రామమైన ఉణుకూరు నియోజకవర్గ కేంద్రముగా రాస్ట్రస్థాయిలో, జిల్లాలో మంచి ప్రాధాన్యత సంతరించుకుంది.


వోటర్లు = 112990

ఆంధ్రప్రదేశ్ అసంబ్లీ ఎన్నికలు 2004 : ఉణుకూరు.శ్రీకాకుళం జిల్లా
అభ్యర్థి పార్టీ ఓట్లు ఓట్ల నిష్పత్తి
కిమిడి కళా వెంకటరావు టి.డి.పి 61762 54.66
పాలవలస రాజశేఖరం కాంగ్రెస్ 48876 49.25
బొచ్చ తమ్మినాయుడు ఇండిపెండెంట్ 2552 2.08

మూలము[మార్చు]

  • జిల్లా పరిషత్ - శ్రీకాకుళం /సేకరణ:డా.శేషగిరిరావుhttp://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=ఉణుకూరు&oldid=1984268" నుండి వెలికితీశారు