పాల కూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:పాలకూర, టమాట పప్పు (2).jpg
పాలకూర, టమాట పప్పు

పాల కూర
పుష్పించిన పాలకూర మొక్క
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
S. oleracea
Binomial name
Spinacia oleracea
Spinach, raw
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి97 kJ (23 kcal)
3.6 g
చక్కెరలు0.4 g
పీచు పదార్థం2.2 g
0.4 g
2.2 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
59%
469 μg
52%
5626 μg
విటమిన్ - ఎ9400 IU
ఫోలేట్ (B9)
49%
194 μg
విటమిన్ సి
34%
28 mg
Vitamin E
13%
2 mg
విటమిన్ కె
460%
483 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
10%
99 mg
ఇనుము
21%
2.7 mg
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
పాలకూర

పాల కూర (ఆంగ్లం Spinach) ఒక విధమైన ఆకు కూర.

పరిచయము[మార్చు]

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర (spinach) ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి. విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది .

* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.

* మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.

* దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి

* ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

* కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. పాలకూరలో లభించే విటమిన్ C, విటమిన్ A లు, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు తదితరాలుంటాయి.

ఔషధ ఉపయోగాలు[మార్చు]

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని చెప్పక తప్పదు ఆకుకూరలతో కలిగే మేలు: * ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. * భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి.వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. * ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు (పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. * ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. * ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. * విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వారా లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. * విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాల_కూర&oldid=3303755" నుండి వెలికితీశారు