Jump to content

చింత

వికీపీడియా నుండి
(చింతచిగురు నుండి దారిమార్పు చెందింది)

చింత
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
టామరిండస్
Species:
టి. ఇండికా
Binomial name
టామరిండస్ ఇండికా

చింత (ఆంగ్లం: Tamarind) ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా.

చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి .ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు, ఇది క్రిందకు వేలాడుతూ ఉండే మాదిరి పండు. వీటిని సాంప్రదాయ ఔషధాలు, మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చెక్క వడ్రంగి వంటి పనులలోలో ఉపయోగించవచ్చు.ఈ చింత చెట్టు ఉపయోగాల వలన, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి.[1] పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. పులిచింత ఒక ఆయుర్వేద మందుగా, ఆవకాయగా వాడు చిన్న మొక్క Oxalis corniculata. Heyne. సీమ చింత చెట్టు, ఎర్రచింత, కారువేగి or చిందుగ అనగా Albizzia odoratissma. ఒక రకమైన చింతచెట్టు. చింతనాగు ఒక విషసర్పం Coluber naga, దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి.

వర్ణ

[మార్చు]

చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

ఉపయోగాలు

[మార్చు]
హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది '

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.

  • చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు.
  • చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలను రైతుల ఇళ్ల నుండి కొందరు వ్వాపారులు వచ్చి కొంటారు. వాటిని పొట్టు తీసి యంత్రాలద్వారా మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు. ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోష్టర్లు అంటించ డానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు.
  • చింతకొమ్మ: పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు. (చింతబరిక అంటారు కోనసీమ ప్రాంతంలో)
  • చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు. చింత కలపను ముఖ్యంగా వంట చెరుకుగానే ఉపయోగిస్తారు. ఇటుకలు కాల్చడానికి ఇటుక బట్టీలలో వీటి ఉపయోగము ఎక్కువ.
  • చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.

ఉపయోగాలు

[మార్చు]

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. చింతకాయలు లేతగా ఉన్నప్పుడు వాటి రసంతో చారు చేస్తారు.లేత చింతకాయలతో చట్నీ చేస్తారు. వాటి గుజ్జును పప్పులో కలుపుతారు, అయితే, లేత చింతకాయలను అధికంగా వాడకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడినప్పుడు వాటితో నిలవ పచ్చడిని తయారుచేస్తారు. ఇవి ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. చింతకాయలతో, మిరపపళ్ళను కలిపి నిలవ పచ్చడిని తయారుచేస్తారు కొంతమంది. ముదిరిన చింత కాయకు వేడిచేసే గుణముంది. అది త్వరగా జీర్ణంకాదు. అతిగా తింటే కడుపులో మంట ఏర్పడుతుంది. పండితే సులువుగా జీర్ణమవుతుంది. చింతగుల్లనుంచి వచ్చిన చింతపండును వాడని వారుండరు. చింతపండును ఎండలో కొంత సమయం ఉంచి ఆ తర్వాత వాడటం ఆరోగ్యకరం. ఇందులో ఉండే పుల్లలు, గింజలు తీసి భద్రపరిస్తే పురుగు పట్టదు. చింతపండు తేలికగా అరుగుతుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అమిత దాహాన్ని అరికడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడటమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.

  • చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు. చింతచెట్టులోని ప్రతి భాగామూ ఉపయోగపడుతుంది. చింతచెట్టు వుంటే చింతే ఉండదంటారు పెద్దలు. ప్రతిరోజు వండే ఆహారపదార్థాల్లో *చింతపండుకు ప్రత్యేకస్థానం ఉంది. చింతచిగురు, లేత చింతకాయలు, ముదురు చింతకాయలు, పండిన చింతగుల్లలు, చింతపువ్వు, చింతగింజలు ఎంతో ఉపయోగపడతాయి.
  • చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో *చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.
  • ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు.
  • థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.
  • చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
  • చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు.
  • చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.
  • చింత కొమ్మలను బొగ్గుగా చెసి వాటిని చిత్రలేఖనంలొ ఉపయోగిస్తారు    

వైద్యపరంగా ఉపయోగాలు :

[మార్చు]

ఇక ఈ చింతచెట్టునుంచి లభ్యమయ్యే అతి ముఖ్య పదార్థం చింతకాయలు, చింతపండు. వీటిని పచ్చళ్ళలో వంటకాలలో విరివిగా నిత్యం వినియోగిస్తూవుంటారు. గింజలు, ఉట్టి తీసిన

చింతగింజలు/ వెంకట్రామా పురంలో తీసిన చిత్రము

100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తిని ప్రసాదిస్తుంది. సిట్రిక యాసిడ్‌ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి,

కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే మంచి ఆకలి పుడుతుంది. శరీరంలోని వాపులకి, నొప్పు లకి చింతపండు రసంలో ఉపð కలిపి మసాజ్‌ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే కంకు దెబ్బల వల్ల వచ్చిన వాపులకీ, బెణుకులకి చిక్కటి చింతపండు రసం తీసి దానిని ఉడికించి గోరు వెచ్చగా ఉన్నపðడే ఆ వాపులపై పూస్తే వెంటనే తగ్గుతాయి. భోజనానంతరం రసం (చారు) పోసుకోడంలో ఉన్న మర్మం ఏమిటంటే, ఇది జీర్ణశక్తిని పెంచి తిన్నది తేలికగా జీర్ణం అవుతుంది. అజీర్ణరోగాలకి, జీర్ణశక్తిని పెంచ డానికి చింతపండు దివౌషధంగా ఉపయోగ పడుతుంది. నిత్యం ఈ ఇబ్బందులు ఎదు ర్కొనేవారు. గ్లాసుడు పాలలో కాచి చల్లార్చిన చింతపండు రసం 4-5 చుక్కలు వేస్తే పాలు విరిగిపోయి, పైన నీళ్ళు తేలతాయి. ఆనీటిని గనుక రోజుకు మూడు పూటలా తాగుతూవుంటే ఈ రోగాలనుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. పరకృతిదక్షిణ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చారు, సాంబారు మొదలైనవి ప్రతిరోజూ వాడుతూవుంటారు కాబట్టి మూత్రకోశ వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు, మొదలైన వ్యాధులు తక్కుగా వుంటాయి. గుండె జబ్బులకు కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేదపరంగా ఎంతో విలువైనవి. చింతగింజలు పొడిచేసి ప్రతిరోజు చెంచాడుపోడి నీటిలో కలిపి సేవిస్తూవుంటే ఆమశంక, జిగట విరేచనాలు తగ్గుతాయి. అలాగే తినే పదార్థంగా అనుపానంగా చింతగింజల పొడిని సేవిస్తూవుంటే రక్తశ్రావం తగ్గుతుంది. చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజులపాటు తీసుకుంటే, వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది. వీర్యాభివృద్ధిచేస్తుంది. చింతచిగురులో విటమిన్‌ ఎ. సి. ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. చింతచిగురుని వంటకాల్లో కూడా వాడడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక చింత కర్ర బొగ్గుగా కాల్చి, ఆ బోగ్గుల పొడిలో ఉపð, పిప్పర్‌మెంట్‌ పువ్వు కలిపి పళ్ళపొడి తయారు చేస్తారు. చింత బొగ్గులపొడిలో నువ్వుల నూనె కలిపి కాలిన చోట రాస్తే కాలిన గాయాలు మానిపోతాయి. అన్నకోశవ్యాదితో బాధపడేవారు లవంగాలు, దాల్చినచెక్క నూరి 10 మి్ప్పలీటర్ల చింతపండు రసంలో కలిపి ప్రతి 4 గంట్ల కొకసారి పుచ్చుకుంటూవుంటే, మంచిగుణం కనబడుతుంది. 120 మిల్లీలీటర్ల చింతపండు రసంలో ఆరు గ్రాముల పంచదార కలిపి సేవిస్తూవుంటే తలతిరగడం తగ్గుతుంది.చింతగింజల పొడి డయేరియాను నివారిస్తుంది. డిసెంటీకి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చింతచెట్టు వేరు గుండె ఆనారోగ్యాలను నివారిస్తుంది. ఈ చెట్టు బెరడు టానిక్‌లా ఉపయోగిస్తుంది. చింతగుల్ల నుంచి చింతపండులో విటమిన్‌ బి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఆసియా ఖండంలోని అనేక దేశాలతో పాటు ఆఫ్రికా మొదలైన దేశాలలో కూడా చింత వనరులు ఎంతో వినియోగంలో ఉన్నాయి. చింతలో ఉన్న వెరైటీల్లో తీపి చింత అని ఒకటుంది. ఆ పండు గుజ్జుతో శీతలపానీయాలు తయారు చేసుకుని సేవిస్తూవుంటారు. పులుపు చింతతో ఊర గాయలు తయారుచేసి దేశవిదేశాలలో విక్రయించడంతో దీనికి ప్రపంచ మార్కెట్‌లో ఎంతో స్థానాన్ని పొందింది. వైద్య పరంగా కూడా దీనికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఆయుర్వేదం, హౌమియోపతి, మొదలైన వైద్యవిధానాల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించిం దంటే ఆశ్చర్యం ఏమీ లేదు.

చింతాకు చిగురు

[మార్చు]
చింత చిగురు, కొత్త పేట రైతు బజారులో తీసిన చిత్రం

దీనినే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో దాని ఆకులన్ని రాలి పోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకులు కూడా రాలి పోతాయి. దాని తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగురులను సేకరించి కూరలలో వేసు కుంటారు. చింత చిగురు తోనే కొన్ని వంటకాలు చేసుకుంటారు. ఇది రుచికి పుల్లగా వుంటుంది. చింత చిగురు వేసిన కూరల్లో చింత పండు వేయరు.

చింత చిగురుతో చేసె వంటలు

[మార్చు]
  • చింత చిగురు, పళ్లీలు, కలిపి చట్నీ చేస్తారు.
  • చింత చిగురు కంది పప్పు
  • వంకాయలతో చింత చిగురు వేసి చేసే కూర,
  • చింత చిగురులో చేపలు వేసి చేసే కూర,
  • చింత చిగురు రొయ్యలు కూర చాల ప్రత్యేకంగా వుంటుంది.
  • ఇలా ప్రతి కూరలోను చింత పండు బదులు చింత చిరుగు వేస్తే అది చాల రుచికరంగా వుంటుంది.
  • చింత చిగురు ఎక్కువ దొరికి నప్పుడు దాన్ని కచ్చ పచ్చగా రుబ్బి వడల ఆకారంలో చేసి వాటిని ఎండ బెట్టుకొని భద్ర పరుచుకొని చాల కాల వాడు కుంటారు. ఇవి కొన్ని నెలలు నిలవ వుంటాయి. చింత పండు వేసిందానికన్న దీన్ని వేసి కూరలు చేస్తే ఆ కూరలు చాల రుచికరంగా వుంటాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చింత&oldid=4311980" నుండి వెలికితీశారు