మునగ

వికీపీడియా నుండి
(మునగాకు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మునగ
Moringa oleifera flower.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: బ్రాసికేలిస్
కుటుంబం: మొరింగేసి
జాతి: మొరింగా
ప్రజాతి: ఎమ్. ఓలీఫెరా
ద్వినామీకరణం
మొరింగా ఓలీఫెరా

ములక్కాడ లేదా మునగ ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది మొరింగా (Moringa) ప్రజాతిలో విస్తృతంగా పెంచే మొక్క. ఇది మొరింగేసి (Moringaceae) కుటుంబానికి చెందినది. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి.

మునగ చెట్లు ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి పొడిగా ఉండే ఇసుక నేలలలో బాగా పెరిగినా, సముద్ర తీర ప్రాంతాలలో కూడా పెరుగుతాయి. ఇవి తొందరగా పెరిగి వర్షాభావాన్ని తట్టుకుంటాయి. వీటినిఆఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక, భారతదేశం, మెక్సికో, మలేషియా మరియు పిలిప్పైన్స్ దేశాలలో పెంచుతున్నారు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఇది ఒకటి; దీనిలోని ప్రతీభాగం ఆహారంగాను లేదా ఇతర ప్రయోజనం కలిగివున్నాయి. మునగాకులను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.

ఆఫ్రికాకు చెందిన సాంప్రదాయ ఆహారంలో మొరింగా ఆహార కొరతను తీర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడగలదు.[1]

దక్షిణ భారత దేశంలో[మార్చు]

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు తెలుసుకుందాం. -మునగ శాస్ర్తీయ నామం ‘మొరింగ బలిఫెర’ ఇది మొరింగేసి కుటుంబంలోనిది. సులువుగా పెంచే, తొందరగా పెరిగే మొక్క లలో ఇది ఒకటి. దీన్ని పంటగా కూడా సాగు చేస్తున్నారు. విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ధి కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం.బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని వుపయోగిస్తారు. ఎరువుగా కూడా దీన్ని వుపయోగిస్తారు. వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రయోగాల, పరిశోధనల ఫలితంగా తక్కువ వ్యయంతో మునగ విత్తనాలతో నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూ లించి, నీటిని శుద్ధి చేయొచ్చు. సాగు : -ఉత్తర భారతదేశంలోని దక్షిణ పర్వత ప్రాంతల్లో ఇది పుట్టినట్లు తెలు స్తోంది. అన్ని ప్రాంతాల నేలలు అనుకూలం. 9-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సాగు చెట్లలో అధిక దిగుబడి కోసం ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరిస్తారు. కొమ్మలు కొందికి వాలినట్లు వుండి దృఢంగా వున్నా కూడా ఇది చాలా పెళుసు. చిన్న గాలులకు, తాకిడికి సైతం విరిగిపోతుంటాయి. అందుకే మునగ చెట్టు ఎక్కకూడదని అంటారు. ఈ చెట్టు పూలు తెల్లగా, గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. కాయలు మూడు పలకలుగా 50 సెంటీ మీటర్ల పొడువు, 1-2 సెంటీ మీటర్ల వెడల్పు వుండి కాడల్లా వుంటాయి. అందుకే ములగకాడ అని కూడా అంటారు. ఎండిన తరువాత కాయలు మూడు భాగాలుగా చీలి, 3 రెక్కలతో కూడిన విత్తనాలు బయటికి వస్తాయి. విత్తనాలు కొమ్మల కత్తిరింపుల ద్వారా ఇవి విస్తరిస్తాయి. మునగ కాయలు (Drumsticks) చెట్టులో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగం. వీటిని భారతదేశంలో చిక్కుడు మాదిరిగా వండుకుంటారు. కొన్నిసార్లు మునగ గింజల్ని వేపుకొని తింటారు. మునగ పువ్వులు పుట్టగొడుగులాగా రుచికరంగా ఉంటాయి.

కలకత్తాలోని మునగాకులు.

మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము మరియు పొటాషియం ఎక్కువగా కలిగివుంటాయి. ఆకుకూరలు క్రింద వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ సాస్ ల లోనూ ఉపయోగిస్తారు. మురుంగకాయ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

కలకత్తాలోని మునగ చెట్టు కాండం.

మొరింగా విత్తనాలు సుమారు 38–40% వంట నూనె ఉంటుంది (ఎక్కువగా బెహెనిక్ ఆమ్లం కలిగివుండటం వలన బెన్ నూనె అంటారు). ఈ నూనె వాసనలేకుండా, క్లియర్ గా ఉంటుంది. నూనె తీయగా వచ్చిన పిప్పిని ఎరువుగానూ, నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చును.

నీటిని శుద్ది చేయుటకు[మార్చు]

శాస్ర్తీయ పరిశోధనల్లో విత్తనాలతో నీటిని శుద్ధి చేసే ప్రక్రియ కార్పొరేట్‌ సంస్థ అయిన జాన్‌ విల్ల హాసన్స్‌ మునగపై శాస్త్ర పరంగా ప్రయోగాలు చేసి మునగ విత్తనాలతో నీటిని పరి శుద్ధం చేయొచ్చని నిరూపించారు. విత్తనాలను తీసి బాగా మెత్తగా రుబ్బి ఆ పదా ర్థాన్ని శుద్ధి చేయాల్సిన నీటిలో బాగా కలిపి ఒక గంట సేపు వుంచాలి. పిండితో పా టు బాక్టీరియా, మలినాలు అన్నీ నీటి అడుగుకు చేరుతాయి. పైన తేలిన నీటినివినియోగించుకోవచ్చు.

మునగలోని పోషకాలు :[మార్చు]

విటమిన్‌ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు.అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్‌ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌం దర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు. ఇలా వద్దు చాలా మంది మునగ కాయ గుజ్జును మాత్రమే గోటితో తీసి తింటారు. చెక్క వదిలేస్తారు. ఇలా చేస్తే అందులోని పూర్తి పోష కాలు అందనట్టే. చెక్కను నమిలి సారాన్ని కూడా తీసుకోవాలి. పెరడు వున్న వాళ్లు మునగ కొ మ్మలను నాటితే ఆరు నెలలకే కాయలు వస్తా యి. హైబ్రిడ్‌ రకాలైతే మరీ ఎత్తు పెరగకుండా కాయలు ఎక్కువగా వస్తాయి. మునగ చెట్టు ఎక్కవద్దన్నారు కానీ మునగను తినవద్దనలేదు మన పె ద్దలు. భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే ము నగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే.

దీని చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్యవిధానాలలో ఉపయోగంలో ఉన్నాయి. జమైకాలో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారుచేస్తారు.

మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. అక్కడ దీనిని sojne ful అని పిలుస్తారు. వీటిని పచ్చి శెనగలు మరియు బంగాళాదుంపలతో కలిపి వండుతారు.

ఆయుర్వేదంలో[మార్చు]

ఆకుకూరలలో ప్రముఖమైనది మునగ. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు కాల్షియం పుష్కలంగా ఉంది.[2]

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్కి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.

అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గితే మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. National Research Council (2006-10-27). "Moringa". Lost Crops of Africa: Volume II: Vegetables. Lost Crops of Africa. 2. National Academies Press. ISBN 978-0-309-10333-6. Retrieved 2008-07-15. 
  2. [1]
"https://te.wikipedia.org/w/index.php?title=మునగ&oldid=2205385" నుండి వెలికితీశారు