సోయా చిక్కుడు

వికీపీడియా నుండి
(సోయా ఆకు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సోయా చిక్కుడు
Soybean.USDA.jpg
Scientific classification
Kingdom
Phylum
Class
Order
Family
Subfamily
Genus
Species
జి. మాక్స్
Binomial name
గ్లైసీన్ మాక్స్

సోయా చిక్కుడు చిక్కుడు జాతులలో ఒకటి. ఇది బలమైన ఆహారము.

చరిత్ర[మార్చు]

సోయా అపరాలకు చెందిన మొక్క.కాని సోయాను నూనెగింజలకై సాగుచెయుదురు. పామాయిల్ తరువాత రెండోస్దానంలో ఉత్పత్తి అవుతున్ననూనె సొయా. మూలస్దానం తూర్పు ఆసియా.B.C.2853 నాటికే చైనాలో, మంచురుయాలో సాగులో వున్నదని లిఖిత ఆధారాలున్నాయి.యూరోప్, అమెరికాలకు ఆసియన్ల వలసు కాలంలో ఆదేశాలకు వ్యాప్తిచెందినది.కీ.శ.1800 నాటికి పైఖండాలలో సాగులోకి వచ్చింది.కీ.శ.1765 లో సామ్యూల్‌బొవెన్ అనేనావికుడు సోయాను అమెరికాకుతీసుకెళ్లి'సరన', 'జార్జిలా'లలోసాగుచేసాడుకీ.శ.1857లో ఆఫ్రికా, ఇజిప్టులలో, కీ.శ.1882లో అమెరికా, బ్రెజిల్లో సోయా సాగు మొదలైంది.కాని కీ.శ.1940నుండి అమెరికలో సోయా సాగు వూపందుకున్నది.ఎక్కువ భూమిని క్రమంగా సోయాసాగుకు తెచ్చారు.కీ.శ.1960 నాటికి అమెరిక ప్రపంచదేశాలలో సోయా ఉత్పత్తిలో ప్రథమ స్దాయికి చేరింది.ఏడాదికి 70-85 మిలియను టన్నుల సోయాను ఉత్పత్తి చెస్తున్నది.అమెరిక తరువాత స్దానం బ్రెజిల్‌దేశానిది..

ఉత్పత్తిచేయు దేశాలు[మార్చు]

అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, చైనా,, ఇండియాలు సోయాను ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా లలో, బ్రెజిల్లో మాంటాగొస్సా, పరగ,, రియో గ్రాండెసుల్లలో సొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఊత్తరప్రదేశ్, మహారాష్ట్రలు.ఇప్పుడు తెలంగాణాలో కూడా విపరీతంగా పండిస్తున్నారు

సోయామొక్క[మార్చు]

విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది.[1] విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో,, చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును. సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును. సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%.

సోయాచిక్కుడు గింజలు

ఉపయోగాలు[మార్చు]

1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు.[2] 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపదార్థంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపదార్థంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్‌ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యియానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు.

సొయ గింజలలోని పోషక విలువలు

పదార్థం శాతం
తేమ 9.5-14%
ఫ్యాట్‌/నూనె 18-24
ప్రొటిను 39-47
పిండి పదార్థం 3-20
పీచు పదార్థం 4-8

సోయా చిక్కుడు పండించు ప్రాంతాలు[మార్చు]

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "సొయా చిక్కుడుతో ప్రయొజనాలు". Archived from the original on 2016-09-26. Retrieved 2016-10-03.
  2. "సొయా గింజల ప్రయొజనాలు". Archived from the original on 2017-06-07. Retrieved 2016-10-03.