Jump to content

పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
(పిఎస్‌ఎల్‌వి-సీ32 నుండి దారిమార్పు చెందింది)

పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌకను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (క్లుప్తంగాఇస్రో) రూపోంధించింది. ఇది ఇస్రో తయారుచేసిన పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన 34వ ఉపగ్రహ వాహకనౌక. పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక, పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌక. పిఎస్‌ఎల్‌వి-సీ32ఉపగ్రహ వాహకనౌక, ఇస్రో ప్రయోగించిన XL రకానికి చెందిన వాహకనౌకలలో 12వ వాహకనౌక.

పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇండియన్ రిజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం పరిధిలో భాగమైన 6 వ ఉపగ్రహమైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని అంతరిక్షములో నిర్దేశిత కక్ష్యలోకి పంపుటకు నిర్ణయించారు. ఇండియన్ రిజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం పరిధిలో మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించవలసి ఉండగా ఇప్పటి వరకు 5 IRNSS (1Aనుండి1E వరకు) ఉపగ్రహాలను అనుకున్న విధంగా నిర్దేశిత అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం జరిగింది.ఆవరుసలో పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టబడుచున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహం ఆరవది.

పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారా పలు ఉపగ్రహాలను అంతరిక్షంలో, కక్షలో ఇస్రో ప్రవేశపెట్టినది. ఐఎన్‌ఎస్‌ఎస్ శ్రేణికి చెందిన 1A,1B,1C, 1D, 1E ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారానే ప్రవేశపెట్టారు.అంతేకాదు చంద్రయాన్-1, జీశాట్-12, రీశాట్-1, మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాప్ట్‌లను, డిఎమ్‌సి-3 ఉపగ్రహాలను కూడా పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన ఉపగ్రహ వాహకనౌకల ద్వారానే ప్రవేశపెట్టారు.

XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారా 1400-1700కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చును.సూర్యానువర్తిత ధ్రువీయ కక్ష్యలో 1700 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను,600కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టవచ్చును.భూబదిలీ కక్ష్యలో అయినచో 1425 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని284 X 20650 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టు సామర్ద్యంXL రకానికి చెందిన రాకెట్ కలిగి ఉంది.నౌకాయాన పర్యవేక్షణకై ఇస్రో తయారుచేసిన ఐఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహన్నిఈ పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో భూఅనువర్తిత (Geosynchronous) కక్ష్యలో ప్రవేశపెట్టుటకై ఇస్రో నిర్ణయించారు.

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక-నిర్మాణ వివరాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక 4అంచెలు/దశలు కలిగిన రాకెట్. ప్రయోగ సమయంలో, ఇంధనం బరువుతోసహా 320 టన్నుల బరువు కలిగి ఉంది. ఎత్తు 44.4 మీటర్లు.వాహకనౌక నాలుగు దశలలో మొదటి, మూడవ దశలో ఘన ఇందనాన్ని చోదకంగాను, రెండవ, నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తారు.

మొదటి దశ

[మార్చు]

ఉపగ్రహ వాహనం మొదటి దశను కోర్ స్టేజి PS1 అంటారు. ఇందులో ఘన ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తారు. ఘన ఇంధనం పేరు HTBP అనగా హైడ్రాక్సీటేర్మినేటేడ్ పాలి బ్యుటడైన్.కోర్ స్టేజి PS1లో138.2టన్నుల అనగా హైడ్రాక్సీటేర్మినేటేడ్ పాలి బ్యుటడైన్ నింపబడి ఉండును.అంతేకాకుండగా కోర్ స్టేజి PS1కు అదనంగా ఆరు స్ట్రాపాన్ మోటరులు బిగింప బడి ఉన్నాయి. ఒక్కొక్క స్ట్రాపాన్ మోటరులో 12.2టన్నుల ఘన హైడ్రాక్సీ టేర్మినేటేడ్ పాలి బ్యుటడైన్ ఇంధనం నింపబడి ఉండును.మొదటి దశ కోర్ స్టేజి PS1 వ్యాసం 2.8 మీటర్లు., స్ట్రాపాన్ మోటరుల వ్యాసం ఒక మీటరు.మొదటి దశ కోర్ స్టేజి PS1 పొడవు20 మీటర్లు, స్ట్రాపాన్ మోటరు పొడవు 12 మీటర్లు.

రెండవ దశ

[మార్చు]

రెండవ దశను PS2 దశ అంటారు. ఇందులో చోదకంగా ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. ద్రవ ఇంధనంగా UH25, నైటోజన్ టెట్రాక్సైడ్ ఉపయోగిస్తారు.UH25 అనగా అసౌష్టవ డై మిథైల్ హైడ్రాజీన్+25% హైడ్రాజీన్ హైడ్రేట్.ఈ దశలో 42 టన్నుల చోదక ఇంధనాన్నిదహన పరచెదరు. PS2 దశ వ్యాసం 2.8 మీటర్లు, పొడవు 12.8 మీటర్లు.

మూడవ దశ

[మార్చు]

మూడవ దశను PS3 స్టేజి అంటారు. ఇందులో మొదటి దశలో వలె ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు.ఇందులో 7.6 టన్నుల చోదక ఇంధనాన్నిదహన పరచెదరు. PS3 స్టేజి వ్యాసం 2.0 మీటర్లు, పొడవు 3.6 మీటర్లు.

నాల్గవ దశ

[మార్చు]

నాల్గవ దశను PS4 స్టేజి అంటారు.ఇందులో రెండవ దశలో వాడినట్లుగానే ద్రవ ఇంధనాన్ని నింపెదరు.PS4 స్టేజిలో వాడు ద్రవ ఇంధనం MMH+MON-3.MMH అనగా మొనోమిథైల్ హైడ్రాజీన్, MON-3 అనగా మిశ్రమ నైట్రోజన్ అక్సైడులు.ఇంధనం పరిమాణం 2.5 టన్నులు. స్టేజి వ్యాసం 1.3 మీటర్లు, పొడవు 3.0 మీటర్లు.

నాల్గవదశ పైభాగంలో ఉన్న పరికారల పెట్టెమీద ఉపగ్రహం ఉండి, దాని చుట్టు రక్షక కవచం అమర్చబడి ఉండును.

ప్రయోగ ముందస్తు సన్నాహాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాలోని, శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్షప్రయోగ కేంద్రమైన సతీష్ థవన్ అంతరిక్ష కేంద్రం లోని, రెండవ ప్రయోగ కేంద్రంనుండి ప్రయోగించుటకు నిర్ణయించారు.పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌకను గురువారం, 10 మార్చి,2016న సాయంత్రం 4 గంటలకు ప్రయోగిస్తారు.మంగళవారం (8.03.16) ఉదయం 09:30 గంటలకు 54:30 గంటల కౌంట్ డౌన్ మొదలైనది.

ప్రయోగ వివరాలు

[మార్చు]

మంగళవారం (8.03.16) ఉదయం 09:30గంటలకు 54:30 గంటల కౌంట్ డౌన్ మొదలై సాపిగా సాగిపోయింది.10.13-2016 గురువారం సాయంత్రం 4:01గంటలకు పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక శ్రీహరికోట లోని రెండవప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూనింగి లోకి దూసుకెల్లింది.ప్రయోగం సరిగా 4 గంటలకు జరుగ వలసి ఉండగా, అంతరిక్షశకలాలతో డీ కొట్టే ప్రమాదాన్ని నివారించడానికి ప్రయోగ సమయాన్ని ఇస్రో ఒక నిమిషం జాప్యం చేసింది. పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగ వేదిక నుండి బయలు దేరిన 20:2 నిమిషాలకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని విజయవంతంగాకక్ష్యలొకి ప్రవేశ పెట్టినది.[1]

ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బుస్టార్లలలో నింపిన 73.2టన్నుల ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన138.2 టన్నుల ఘన ఇంధనంతో108.6 సెకన్లకు మొదటి దశను,42 టన్నుల ద్రవ ఇంధనంతో 259.8సెకన్లకు రెండవ దశ,7.6 టన్నుల ఘన ఇంధనంతో 655.3సెకన్లకు మూడోదశ,2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,175.3సెకన్లకు నాలుగో దశ పూర్తయింది.పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్నిగురువారం కక్ష్యలొకి విజయవంతంగా ప్రవేశ పెట్టి ఇస్రో 33 వసారి విజయ బావుటా ఎగురవేసింది.ఇస్రో స్వదేశీనావిగేసన్ ఉపగ్రహ శ్రేణిలో 1,425 కిలోల ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని284 కిలోమీటర్లపెరిజీ (భూమికి దగ్గరగా),20,657కిలోమీటర్ల ఆపోజి (భూమికి దూరంగా) పరిదిలో భూస్థిరబదిలీకక్ష్యలో ప్రవేశ పెట్టారు.

అభినందనలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌకవిజయవంతమైనందులకు తెలుగురాష్ట్రాల ఉమ్మడిగవర్నరుఈఎస్ఎల్ నరసింహన్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలను తెలిపాడు [1] ప్రయోగం విజయవంతమవడం పై రాష్ట్రపతి ప్రణవ్, ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేసారు.ఇస్రో శాస్త్ర వేత్తల బృందాన్ని అభినందించారు[2]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఈనాడు దినపత్రిక,11.ఫిబ్రవరి.2016
  2. సాక్షి దినపత్రిక 11 ఫిబ్రవరి,2016