పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
(1960 తెలుగు సినిమా)
Pillalu techina challani rajyam.jpg
దర్శకత్వం బి.ఆర్.పంతులు
తారాగణం బి.ఆర్.పంతులు,
ఎమ్.వి.రాజమ్మ,
బాలకృష్ణ,
శివాజీ గణేశన్,
రాజనాల,
రమణారెడ్డి
నిర్మాణ సంస్థ పద్మిని పిక్చర్స్
భాష తెలుగు

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం సినిమా పద్మినీ పిక్చర్స్ బ్యేనర్‌పై బి.ఆర్.పంతులు తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ఒకేసారి తీసిన సినిమా. కన్నడభాషలో మక్కళరాజ్య పేరుతో, తమిళభాషలో కుళందిగళ్ కండ కుడియరసు అనే పేరుతో వెలువడింది. ఈ సినిమా 1960, జూలై 1న విడుదలయ్యింది.

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్యం, నిర్మాత: బి.ఆర్.పంతులు
  • కథ: దాదా మిరాశీ
  • మాటలు: డి.వి.నరసరాజు
  • సంగీతం: టి.జి.లింగప్ప
  • పాటలు: సముద్రాల, కొసరాజు
  • నేపథ్య గానం: పి.బి.శ్రీనివాస్, శీర్గళి గోవిందరాజన్, పి.సుశీల,జిక్కి, ఎస్.జానకి,జమునారాణి, కె.రాణి, కోమల, రాజేశ్వరి, పద్మ
  • ఛాయాగ్రహణం: డబ్యూ.ఆర్.సుబ్బారావు
  • కూర్పు: ఆర్.దేవరాజన్

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

గుణసేనుడనే రాజు రాచరిక వ్యవస్థను అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించాలనుకుంటాడు. ఇది నచ్చక మహామంత్రి, సేనాధిపతి తదితరులు కుట్రపన్ని రాజు ఉన్న వేదికను పేల్చేస్తారు. దాంతో మహామంత్రి ఆ రాజ్యానికి రాజవుతాడు. కానీ గుణసేనుడు ఆ ప్రమాదం నుంచి బయటపడి భార్యతో సహా పాతాళానికి చేరతాడు. ముని శాపం వల్ల రాజు మామిడి చెట్టు అయిపోతాడు. రాణి, విజయసేనుడికి జన్మనిస్తుంది. చిన్నతనం నుంచే అతను విప్లవ నాయకుడుగా ఎదుగుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా పిల్లలందర్నీ కూడగట్టుకుని ఎదిరిస్తాడు. విజయసేనుడికి యువరాణితో స్నేహం ఏర్పడుతుంది. వీరంతా కలిసి రాజుపై తిరుగుబాటు చేస్తారు. అందరిలో మార్పు తీసుకువచ్చి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు[1].

పాటలు[మార్చు]

క్ర.సం. పాట గాయకులు రచన నిడివి(ని:సె)
1 "పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం" 1 ఎల్.ఆర్.ఈశ్వరి
ఎం.ఎస్.పద్మ
02:10
2 "నగవు చిలుకుమా నగవు చిలుకుమా నగవు చిలుకుమా చిన్నారి రాజా" ఎస్.జానకి సముద్రాల 03:31
3 "ఆశల ఊయల ఊగేమా జీవితమే ఆమనిగా" జిక్కి
ఎ.పి.కోమల
సముద్రాల 03:01
4 "అమ్మా కనజాలవా ఈ కఠిన దృశ్యము" పి.సుశీల సముద్రాల 03:25
5 "నిన్ను చూచి వెన్నె గాచి నిన్ను చూచి చూచి విడిచిపోదునా" పి.బి.శ్రీనివాస్
కె.రాణి
02:35
6 "చిట్టి చీమలు పెట్టిన పుట్టలోన (పద్యం)" పి.బి.శ్రీనివాస్
7 "సుందర నంద కిశోరా నీ అందము చూపగ రారా" ఎస్.జానకి
ఎ.పి.కోమల
కొసరాజు 03:30
8 శీర్కాళి గోవిందరాజన్
9 "పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం" 2 ఎల్.ఆర్.ఈశ్వరి
ఎం.ఎస్.పద్మ
02:42

మూలాలు[మార్చు]

  1. డా.వైజయంతి (20 November 2013). "మరిచిపోలేని ప్రయత్నం...పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం". సాక్షి దినపత్రిక. Retrieved 4 August 2020. CS1 maint: discouraged parameter (link)

బయటిలింకులు[మార్చు]