Jump to content

పిల్లలు దిద్దిన కాపురం

వికీపీడియా నుండి
(పిల్లలు దిద్దినకాపురం నుండి దారిమార్పు చెందింది)
పిల్లలు దిద్దినకాపురం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం పేరాల
నిర్మాణం సంగిశెట్టి దశరథ
అమరా శ్రీశైలరావు
కథ పేరాల
చిత్రానువాదం పేరాల
వేమూరి సత్యనారాయణ
డి. నారాయణ వర్మ
తారాగణం జగపతి బాబు,
దివ్యవాణి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం కబీర్ లాల్
కూర్పు మురళి రామయ్య
నిర్మాణ సంస్థ కోణార్క్ మూవీస్
భాష తెలుగు

పిల్లలు దిద్దిన కాపురం 1993 లో వచ్చిన సినిమా. కోణార్క మూవీస్ కోసం పేరాల దర్శకత్వంలో సంగిశెట్టి దశరథ, అమరా శ్రీశైలరావు నిర్మించారు.[1] విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యవాణి, కిన్నెర, మాస్టర్ తరుణ్ నటించారు.[2]

రఘు ( జగపతి బాబు ), పద్మ (దివ్యవాని) ఒకే కళాశాలలో విద్యార్థులు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రఘును అతని అక్కే (అన్నపూర్ణ) పెంచి పెద చేసింది. అతనికి అన్నీ ఆమే. రఘు తన అక్క కూతురు అలివేలు (కిన్నెర) పెళ్ళికి హాజరవుతాడు. ఇది కట్నం సమస్య కారణంగా చివరి నిమిషంలో రద్దవుతుంది. రఘు అడుగుపెట్టి అలివేలును పెళ్ళి చేసుకుంటాడు. అతను నగరానికి తిరిగి వచ్చినప్పుడు, పద్మ గర్భవతి అని తెలుస్తుంది. ఆమె కూడా తనను పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తుంది.

కొంత సమయం తరువాత, రఘు తన గ్రామానికి తిరిగి వచ్చి, అతని అక్క, అలివేలు అతన్ని వెతుక్కుంటూ ఊరొదిలి వెళ్ళారని తెలుసుకుంటాడు. అలివేలు కూడా గర్భవతి. ఇద్దరూ ఒకేలాంటి కవలలలా కనిపించే అంజీ, ప్రసాద్ ( మాస్టర్ తరుణ్ ) లకు జన్మనిస్తారు. రఘు, అలివేలు చాలా సంవత్సరాల పాటు ఒకరినొకరు వెతుకుతుండగా, పిల్లలు పెరిగి పెద్దవారౌతారు. ఒక రోజు సోదరులు అనుకోకుండా కలుసుకుని, తమ తండ్రి ఒకరే అని తెలుసుకుంటారు. వారు తమ తల్లులను, తండ్రినీ ఏకం చేయడానికి నడుం కడతారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కళ: కె.వి.రమణ
  • నృత్యాలు: కుమారి
  • పోరాటాలు: సాహుల్
  • సంభాషణలు: జంధ్యాల
  • సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాహితి, డి. నారాయణ వర్మ, జగదీష్ బాబు
  • నేపథ్య గానం: ఎస్పీ బాలు, మనో, చిత్ర, మాల్గాడి శుభా, మిన్మిని, బేబీ కల్పన
  • సంగీతం: విద్యాసాగర్
  • చిత్రానువాదం: పెరళ, వేమూరి సత్యనారాయణ, డి.నారాయణ వర్మ
  • కూర్పు: మురళి-రామయ్య
  • ఛాయాగ్రహణం: కబీర్‌లాల్
  • నిర్మాత: సంగిశెట్టి దసరాధ, అమరా శ్రీశైలా రావు
  • కథ - దర్శకుడు: పెరాలా
  • బ్యానర్: కోనార్క్ మూవీస్
  • విడుదల తేదీ: 1993

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఇద్దరు ముద్దుల"Sahithiఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మిన్మిని4:29
2."అమా చూసానే ఈనాడు"సిరివెన్నెల సీతారామశాస్త్రిబేబీ కల్పన4:56
3."మంగళ గౌరీ"జగదీష్ బాబుమనో, చిత్ర, మిన్మిని4:15
4."ఆహా డింగ్ డాంగ్"సాహితిబేబీ కల్పన3:52
5."మలక్‌పేట పూరీ నేను"సాహితిమనో, మాల్గాడి శుభ2:50
మొత్తం నిడివి:20:22

మూలాలు

[మార్చు]
  1. "Pillalu Diddina Kapuram". Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-25.
  2. "Pillalu Diddina Kapuram". Nth Wall. Archived from the original on 2015-07-17. Retrieved 2020-08-25.