Jump to content

పేరాల సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
పేరాల సుబ్రహ్మణ్యం
ఇతర పేర్లువసంత సేన్, పేరాల
వృత్తిసినిమా దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1978-2005
Notable workపిల్లలు దిద్దిన కాపురం,
రాఘవయ్య గారి అబ్బాయి

పేరాల సుబ్రహ్మణ్యం తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతని స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని ఉప్పుగుండూరు. ఇతడు 1969లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్ద తొమ్మిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సినిమాలలో ప్రవేశించక ముందు అతడు సాంఘిక నాటకాలలో నటించాడు. [1]

సినిమారంగం

[మార్చు]

ఇతడు అనేక తెలుగు, కన్నడ సినిమాలకు కథ, చిత్రానువాదం, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. దర్శకుడిగా ఇతని తొలి సినిమా ఓ అమ్మకథలో ఇతడి పేరుని వసంతసేన్‌గా పేర్కొన్నారు. తరువాతి సినిమాలలో ఇతడు ఇంటిపేరు పేరాలతో ప్రసిద్ధి చెందాడు. ఇతడు కృష్ణంరాజు, జగపతి బాబు, నూతన్ ప్రసాద్, శ్రీనాథ్, చరణ్‌రాజ్, వజ్రముని, అంబరీష్, అనంత్ నాగ్, కన్నడ ప్రభాకర్,శారద, జయసుధ, అంబిక,గీత, ఆరతి, రాధిక, దివ్యవాణి, లక్ష్మి వంటి నటీనటులతో పనిచేశాడు.


ఇతడు పని చేసిన సినిమాలలో కొన్ని,:[2] [3]

సంవత్సరం సినిమా పేరు భాష పాత్ర వివరాలు
దర్శకుడు సహదర్శకుడు కథ స్క్రీన్ ప్లే/సంభాషణలు
1978డూ డూ బసవన్నతెలుగుGreen tick
1980త్రిలోక సుందరితెలుగుGreen tick
1981ఓ అమ్మకథతెలుగుGreen tickఈ చిత్రంలో ఇతని పేరు వసంతసేన్ అని పేర్కొన్నారు.
1981మావూరి పెద్దమనుషులుతెలుగుGreen tick
1981మనవూరి రాముడుతెలుగుGreen tick
1982గరుడరేఖెకన్నడGreen tick
1984బడ్డి బంగారమ్మకన్నడGreen tick
1984డాకూ రాణితెలుగుGreen tickహిందీలో డాకూరాణి హిమ్మత్‌వాలి అనే పేరుతో డబ్ చేయబడింది.
1985మారుతి మహిమెకన్నడGreen tickGreen tickGreen tick
1986బెట్టద తాయికన్నడGreen tickGreen tickGreen tick
1986బ్రహ్మాస్త్రకన్నడGreen tickGreen tick
1987[[:kn:ಅತಿರಥ ಮಹಾರಥ (ಚಲನಚಿತ್ರ)|అతిరథ మహారథ]]కన్నడGreen tickGreen tick
1987తాయికన్నడGreen tickGreen tick
1987బజార్ భీమకన్నడGreen tickGreen tick
1987లారీ డ్రైవర్కన్నడGreen tickGreen tick
1988కంకణ భాగ్యకన్నడGreen tickGreen tick
1988ధర్మతేజతెలుగుGreen tick
1988పృథ్వీరాజ్తెలుగుGreen tick
1990ఆవేశకన్నడGreen tickGreen tickGreen tick
1990నమ్మూర హమ్మీరకన్నడGreen tickGreen tick
1990నిగూఢ రహస్యకన్నడGreen tickGreen tickGreen tick
1992నన్న తంగికన్నడGreen tickGreen tickGreen tick
1993పిల్లలు దిద్దిన కాపురంతెలుగుGreen tickGreen tickGreen tick
1995ముత్తినంత హెండతికన్నడGreen tickGreen tickGreen tick
1996హైదరాబాద్ గూండాయిజంతెలుగుGreen tick
1997రాజదర్బార్తెలుగుGreen tick
1997జేనిన హొళెకన్నడGreen tickGreen tick
2000రాఘవయ్య గారి అబ్బాయితెలుగుGreen tickGreen tick
2005దేవీమాతాహిందీGreen tick
2005ఆశల పల్లెకితెలుగుGreen tickఉత్తమ బాలల చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వంచే నంది పురస్కారం[4]

మూలాలు

[మార్చు]
  1. వి.ఎస్.అవధాని (5 January 1982). "పరిచయం: పేరాల సుబ్రహ్మణ్యం" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి:68 సంచిక:276. Archived from the original (PDF) on 29 సెప్టెంబరు 2022. Retrieved 29 September 2022.
  2. వెబ్ మాస్టర్. "All Movies Perala". ఇండియన్ సినిమా. Retrieved 29 September 2022.
  3. వెబ్ మాస్టర్. "Perala". చిత్రలోక కన్నడ. Retrieved 29 September 2022.
  4. L.VENUGOPAL. "Andhra Pradesh State Nandi Film Awards(2001-2006)". TELUGUCINEMA CHARITRA. Retrieved 30 September 2022.

బయటిలింకులు

[మార్చు]